News
News
X

Viral Video: ఈ చేపల్ని ఎవరైనా హిప్నటైజ్ చేశారా? ఎందుకిలా తిరుగుతున్నాయ్? వైరల్ వీడియో

Viral Video: సముద్రం లోతుల్లో చేపలు ఉన్నట్టుండి ఒక్క చోటకు చేరి సుడిగుండంలా తిరగుతున్న వీడియో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

ఎంత అందంగా ఉందో.. 

సముద్రం లోతుల్లోకి వెళ్తే గానీ తెలియదు...లోపల ఎన్ని వింతలు, విశేషాలు ఉంటాయో. బయట ప్రపంచానికి తెలియనివెన్నో అక్కడ రోజూ జరిగిపోతూనే ఉంటాయి. అందులో నివసించే జలచరాల్లో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఎవరో ఒకరు ఆ లోతుల్లోకి వెళ్లి  వాటిని ఫోటోలు, వీడియోలు తీస్తే "వావ్" అని ఆశ్చర్యపోతారంతా. ఇప్పుడలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సముద్రంలోని కొన్ని చేపలు "టోర్నడో" ఆకారంలో ఒక్క దగ్గరకు చేరిపోయాయి. సుడిగుండం వచ్చినప్పుడు నీళ్లు ఎలాగైతే గుండ్రంగా తిరుగుతాయో..అదే విధంగా ఈ చేపలన్నీ తిరుగుతూ కనిపించాయి. వందలాది చేపలు ఏ మాత్రం దారి తప్పకుండా ఇలా పద్ధతి ప్రకారం తిరుగుతున్న వీడియోను ఓ మరైన్ ఫోటోగ్రాఫర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన వాళ్లంతా చేపల కో ఆర్డినేషన్‌ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఈ వీడియోకి 30 లక్షలకు పైగా వ్యూస్ రాగా, రెండున్నర లక్షల లైక్స్ వచ్చాయి. జపాన్‌కు చెందిన మరైన్ ఫోటోగ్రాఫర్ తాత్సురో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఇలాంటి ఎన్నో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేశాడు. సముద్రం లోతుల్లో ఉన్న అద్భుతాల్ని బయట ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. "బ్యూటిఫుల్ వీడియో" అంటూ అని కొందరు కామెంట్ చేస్తుంటే..మరికొందరు అమేజింగ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫినామినాని "మర్మరేషన్" (Murmuration)తో పోల్చుతున్నారు. ఒక్కోసారి కొన్ని వందల పక్షులు ఒక్క చోటకు చేరి, ఒకే మార్గంలో ఎగురుతూ వెళ్తాయి. ఆ సమయంలో ఓ విచిత్రమైన సౌండ్ చేస్తాయి. ఇప్పుడు చేపలు కూడా ఇదే విధంగా ఒకే డైరెక్షన్‌లో తిరుగుతుండటాన్ని చూసి ఇది కూడా మర్మరేషన్‌లాగే ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by 𓆡Tatsuro 𓆡 (@ta.tsu.1)

Also Read: Commonwealth Games 2022: గోల్డ్‌ మెడల్‌ కొట్టిన సాక్షి మలిక్‌ ఎందుకు ఏడ్చింది!

Also Read: బింబిసార, సీతారామం పాజిటివ్ టాక్ తో టాలీవుడ్ కు మళ్లీ తెలిసొచ్చిందేంటి..?| ABP Desam

Published at : 06 Aug 2022 07:30 PM (IST) Tags: Viral video Tornado Fish Vortex Undersea Fish Swirls

సంబంధిత కథనాలు

Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

Hiroshima Nagasaki: హిరోషిమాపై అణుదాడి జరిగే ముందు ఏం జరిగిందో తెలుసా? ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలెన్నో!

Hiroshima Nagasaki: హిరోషిమాపై అణుదాడి జరిగే ముందు ఏం జరిగిందో తెలుసా? ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలెన్నో!

Mahesh Babu Birthday: ‘మహీ, నా జీవితంలో వెలుగులు నింపావ్’ - భర్తకు నమ్రతా విషెస్, సూపర్ స్టార్‌కు చిరు, రోజా ట్వీట్స్!

Mahesh Babu Birthday: ‘మహీ, నా జీవితంలో వెలుగులు నింపావ్’ - భర్తకు నమ్రతా విషెస్, సూపర్ స్టార్‌కు చిరు, రోజా ట్వీట్స్!

Mother and Son Govt Jobs: ఆ తల్లీ కుమారుడు అదుర్స్, ఒకేసారి ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు

Mother and Son Govt Jobs: ఆ తల్లీ కుమారుడు అదుర్స్, ఒకేసారి ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

Harsha Sai: హ్యాట్సాఫ్ హర్షసాయి, ఫైవ్ స్టార్ హోటల్‌లో 101 మంది నిరుపేదలకు విందు, ఒక్కో ప్లేటు రూ.30 వేలు

టాప్ స్టోరీస్

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

NBK108 Announcement : ఇంతకు ముందు ఎప్పుడూ చేయనటువంటి పాత్రలో నందమూరి బాలకృష్ణ

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

Kajal Aggarwal : కట్టప్పలా మారిన కాజల్ - బాహుబలి ఎవరో చూశారా రాజమౌళి గారూ?

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

SC On Political Parties: ఎన్నికల్లో ‘ఫ్రీ’లు చాలా సీరియస్, డిబేట్ అవసరం - నా రిటైర్మెంట్‌లోగా రండి: CJI

Munugode Congress : "మునుగోడు" ఎలా గెలుద్దాం ? కాంగ్రెస్ సీనియర్ల తర్జన భర్జన !

Munugode Congress :