Kanas Lightning: వీడియో - ఈ మెరుపులేంటీ, వెరైటీగా కింద నుంచి పైకెళ్తున్నాయ్, మేఘాల నుంచి కదా రావాలి?
ఇవి సాదాసీదా మెరుపులు కాదు. ఇవి ఆకాశం నుంచి కాకుండా, చిచ్చుబుడ్డి తరహాలో నేల మీద నుంచి పైకి వెళ్తున్నాయి. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, ఈ వీడియో చూడండి.
Kanas Lightning | ఒక్క పిడుగు పడితేనే.. భూమి దద్దరిల్లినట్లు అనిపిస్తోంది. అలాంటిది వందలాది పిడుగులన్నీ కలిసి ఒకే చోట పడితే ఎట్టుంటుందో ఎప్పుడైనా చూశారా? అయితే, మీరు తప్పకుండా ఈ వీడియోలో చూడవచ్చు. చిత్రం ఏమిటంటే, ఈ పిడుగులు మేఘాల నుంచి కిందకు పడినట్లు ఉండదు. కింద నుంచి మేఘాల్లోకి వెళ్తున్నట్లుగా ఉంటుంది.
పిడుగులు చాలా ప్రమాదకరం.. మీద పడితే ప్రాణాలు పోవడం పక్కా. అందుకే, భారీ వర్షాలు కురిసినప్పుడు వీలైనంత వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిది. అలాగే, చెట్లు, రేకుల షెడ్ల కింద కూడా ఉండకూడదు. ఎందుకంటే.. వాటికి పిడుగులను ఆకట్టుకొనే గుణం ఉంది. పిడుగుల వల్ల ఏర్పడే మెరుపులు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో అంతే ప్రమాదకరం కూడా. సాధారణంగా ఈ మెరుపులు అక్కడక్కడా వస్తాయి. అయితే, అమెరికాలోని కనాస్‌లో మాత్రం ఒకే చోట వందలాది మెరుపులు ఏర్పడి బీభత్సం సృష్టించాయి.
Also read: ఎలాంటి ఆహారాలు తింటే రక్తనాళాలు మూసుకుపోతాయో తెలుసా? ఇదిగో ఇవే
చిత్రం ఏమిటంటే ఈ పిడుగు ఆకాశం నుంచి కింద పడినట్లు కనిపించలేదు. నేల మీద నుంచే మేఘాల్లోకి వెళ్లున్నట్లుగా అనిపించింది. చిచ్చుబుడ్డి మందు పైకి వెళ్లినట్లుగా ఒకే ప్రాంతంలో అనేక మెరుపులు చెట్టు ఆకారంలో మెరవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఎందుకంటే మెరుపులెప్పుడు మేఘాల్లో ఒకే చోట ఉండే భూమిపై వేర్వేరు ప్రాంతాల్లో పడతాయి. అంటే, వాటికి కేంద్రం మేఘాల్లో ఉంటుంది. కానీ, ఈ వీడియో చూస్తే.. నేలపైనే పిడుగు కేంద్రం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఫోటోగ్రాఫర్ టేలర్ వాన్ఫెల్డ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతే, అది క్షణాల్లో వైరల్‌గా మారిపోయింది.
Also Read: వేసవిలో వేడి నీటితో స్నానం చేయొచ్చా? చేస్తే ఏమవుతుంది?
వాతావరణ శాస్త్రవేత్త క్రిస్ వాగాస్కీ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. మేఘం నుంచి మెరుపులు వేర్వురు చోటపడటం వాస్తవమే. అయితే, భారీ అంతస్తులు లేదా ఆకాశహర్మ్యం, టవర్లపై ఏర్పాటు చేసే పొడవైన లోహపు కడ్డీలు(పిడుగులను అడ్డుకొనే ఎర్త్ టవర్లు) మీద పడినట్లయితే.. ఈ రకమైన మెరుపులు ఏర్పడతాయని తెలిపారు. అంటే, మెరుపులన్నీ ఒకే చోటకు చేరడం వల్ల మెరుపులు అలా కనిపిస్తాయని వివరించారు. ఈ వీడియో చూస్తే.. మీరు కూడా తప్పకుండా ఆశ్చర్యపోతారు.
I just captured the most insane strike of lightning I’ve ever caught on camera.. 😳😱⚡️ @weatherchannel @KSNNews @KWCH12 @KAKEnews @JimCantore pic.twitter.com/17TxaFiyXk
— Taylor Vonfeldt (@therealskicast) March 30, 2022