By: ABP Desam | Updated at : 17 Jan 2022 05:45 PM (IST)
క్యూలో నిలబడితే రోజుకు రూ. పదహారు వేలు !
" నీకు తెలుసుగా ..మనకు క్యూలో నిలబడే అలవాటు లేదు. అందుకే నిన్ను తీసుకొచ్చా.. వెళ్లి టిక్కెట్స్ తీసుకురా..పో " అనే డైలాగ్ ఓ తెలుగు సినిమాలో ఉంటుంది. ఇలా క్యూలో నిలబడటం అలవాటు లేని వాళ్లు చాలా మంది ఉంటారు. అలాంటివారు ఎక్కువగా డబ్బున్న వారే అయి ఉంటారు. మరి వాళ్లకు లేని అలవాటును తాను అలవాటుగా మార్చుకుని ఎందుకు డబ్బులు సంపాదించకూడదు అనే ఆలోచన ఎవరికీ వచ్చి ఉండదు. కానీ బ్రిటన్‌లో ఓ వ్యక్తికి వచ్చింది. అంతే ఇప్పుడు అతను రోజుకు 160 యూరోలు సంపాదిస్తున్నాడు. ఆ మొత్తం మన రూపాయల్లో అయితే పదహారు వేలు.
Also Read: సరసాలతో సంపాదన.. అమ్మాయిలతో ‘పులిహోర’ కలపడమే ఇతడి ఉద్యోగం
బ్రిటన్‌లో ఫ్రెడ్డి బెకిట్ అనే వ్యక్తి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఎందుకంటే అతను ఎంచుకున్న వృత్తి క్యూలో నిల్చుకోవడం. క్యూలో నిలబడం ఇష్టం లేని.. బాగా డబ్బున్న వ్యక్తులు .. ఫ్రెడ్డీకి గంటకు ఇరవై యూరోలు చొప్పిన ఇచ్చి తమ తరపున క్యూలో నిలబడుతున్నారు. తమ వంతు వచ్చినప్పుడు ఫ్రెడ్డీకి బదులుగా తాము వెళ్తున్నారు. ఇలా రోజూ ఎనిమిది గంటల పాటు వివిధ రకాల వ్యక్తుల కోసం ఫ్రెడ్డీ పలు చోట్ల నిలబడుతున్నాడు.
Also Read: కౌగిలించుకుంటే ఇన్ని ప్రయోజనాలా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు.. ఇక చెలరేగిపోతారు
ఫ్రెడ్డీ తన ప్రోఫైల్‌ను టాస్క్ రాబిట్ అనే వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసుకున్నాడు. ఇది మన దేశంలో ఉండే అర్బన్ క్లాప్ లాంటిది. అన్ని రకాల సర్వీసులు అందించేవారు తమ సేవలు పొందేందుకు ఇక్కడ లిస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రెడ్డీ కూడా తన సేవలు అవసరమైన వారు పొందవచ్చని లిస్ట్ చేసుకున్నారు. ఇందులో క్యూలో నిలబడటంతో పాటు పెట్ సిట్టింగ్, ప్యాకింగ్, గార్డెనింగ్ వంటి పనులు చేస్తానని ప్రోఫైల్ పెట్టుకున్నాడు. కానీ ఏ పని చేసినా గంటంకు ఇరవై యూరోల కంటే ఎక్కువ తీసుకోడు.
Amalapuram Violence : పోలీసుల వలయంలోనే అమలాపురం, మరో 46 మందిపై కేసు, ఎఫ్ఐఆర్ లో ప్రముఖుల పేర్లు
Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు
Jail Sentece To Sheep: గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష, ఎందుకో తెలిస్తే షాకవుతారు!
Six Ride On Activa: ఒకే స్కూటర్పై ఆరుగురు జర్నీ, ఒకరి భుజంపై మరొకరు ఎక్కి మరీ ప్రయాణం
Japan Dog Man: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్లో డాగ్ మ్యాన్!
NTR Centenary birth celebrations : తెలుగు చరిత్రలో నిలువెత్తు సంతకం ఎన్టీఆర్ !
Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్ సిలిండర్ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి
Irritable Bowel Syndrome: మీకు ఈ అలవాట్లు ఉంటే కడుపు కల్లోలమే, ఇలా చేస్తే సేఫ్!
NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్