అన్వేషించండి

Viral News: రన్నింగ్ లోకల్ ట్రైన్ నుంచి పడిపోయిన ప్యాసింజర్, ముంబై వాసులకు ఇంత నరకమా?

Mumbai Local Train News: జ‌నంతో కిక్కిరిసిన లోకల్ రైలు నుంచి ఓ వ్య‌క్తి కింద ప‌డిన ఘ‌ట‌న ప‌లు భ‌ద్రతా చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌న్న సందేశాన్ని అధికారుల‌ను హెచ‌రిస్తోంది. 

Mumbai Train Accident రైలు ప్ర‌మాద ఘ‌ట‌న‌లు భ‌యాందోళ‌న‌లు క‌లిగిస్తుంటాయి. ఏమాత్రం ఆద‌మ‌రిచినా ప్రాణాలు వ‌దిలేసుకోవ‌డ‌మే. ఎక్కేట‌ప్పుడు దిగేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త అవ‌స‌రం. అయితే లోక‌ల్ ట్రైన్ల‌లో ఆక‌తాయిల వ‌ల్ల కూడా ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫుట్‌బోర్డు ద‌గ్గ‌ర నిల‌బ‌డి ప్ర‌యాణాలు చేయ‌డం వ‌ల‌న సామాన్య ప్ర‌యాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కోసారి సాహ‌సాలు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మరిన్ని లోకల్ ట్రైన్స్ ఏర్పాటు చేయాలి 
ప్ర‌మాదాల నివార‌ణ‌కు నిపుణులు, ప్ర‌యాణికులు ప‌లు సూచ‌న‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల కోసం మ‌రిన్ని రైళ్ల‌ను ఏర్పాటు చేయాలి. లాంగ్ ట్రావెల్ ప్యాసింజర్ రైళ్ల సమయాన్ని తగ్గించాలి. మ‌రిన్ని లోకల్ రైళ్లను ప్రారంభించడంతోపాటు స‌మయాలను సర్దుబాటు చేయడం చాలా ముఖ్యం. తద్వారా ఆఫీసు వేళ‌ల్లో వెళ్ల‌డానికి ఇంటికి రావ‌డానికి ఉద్యోగుల‌కు సౌక‌ర్యంగా ఉంటుంది. డ‌బ్బు క‌న్నా ప్ర‌జ‌ల ప్రాణాలు, జీవితాలు చాలా ముఖ్య‌మని ప్రభుత్వం భావించాల‌ని కొంత‌మంది చుర‌క‌లంటిస్తున్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రజలు త‌ప్ప‌క ఇలాంటి రైళ్ల‌లోనే ప్ర‌యాణం చేయాల్సి ఉంటుందని, అయితే ఇలా తమ జీవితాన్ని పణంగా పెట్టలేం కదా అని ప్రశ్నిస్తున్నారు. 


ముంబై లోకల్ రైళ్లు నిత్యం ర‌ద్దీగా ఉంటాయి. ల‌క్ష‌లాది మంది ముంబై వాసుల ర‌వాణాకు అదే మూలాధారం. ఎక్క‌డినుంచి ఎక్క‌డికి పోవాల‌న్నా పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి అవే ఆధారం. నిత్యం ర‌ద్దీగా ఉంటున్న ఈ రైళ్ల కార‌ణంగా ప్ర‌యాణికులు నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. వర్షాకాలం స‌మ‌యంలో ప‌రిస్థితులు మ‌రీ దారుణంగా ఉంటున్నాయి. చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది, కానీ రైలులో నిల్చునే చోటు కూడా ఉండ‌దు. అనారోగ్య ప‌రిస్థితుల్లో నిల‌బ‌డ‌లేక‌పోతే బాధ దేవుడికే ఎరుక‌. తాజా 2022 నాటి ఒక వీడియోను ఒక వ్య‌క్తి ఎక్స్‌లో పోస్ట్ చేయ‌డం ద్వారా తాజాగా మ‌రోసారి రైలులో సౌక‌ర్యాలు భ‌ద్ర‌త గూర్చి మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. 

ఫుట్ బోర్డ్ ప్రయాణంలో ఊహించని ప్రమాదం

థానేలోని కాల్వా నుండి దాదర్‌కు ఉదయం 9:30 గంటలకు ముంబై లోకల్ ట్రైన్‌లో డానిష్ జాకీర్ హుస్సేన్ అనే యువకుడు ఫుట్‌బోర్డ్‌కు వేలాడుతూ, మరికొంత మందితో వెళ్తున్నాడు. హుస్సేన్ వేళాడుతూ వెళ్తుండ‌గా అత‌ని త‌ల అక‌స్మాత్తుగా బ‌య‌ట ఉన్న స్థంభాన్ని ఢీకొని మ‌ర‌ణిస్తాడు. ఈ సంఘ‌ట‌ను అదే రైలుకు స‌మాంత‌రంగా వెళ్తున్న మ‌రో రైలులోని వ్య‌క్తి ఈ వీడియో తీశాడు. ఈ భ‌యంక‌ర‌మైన వీడియో మ‌రోసారి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో ముంబై రైలు ప్ర‌యాణంలో భ‌ద్ర‌త‌పై ప‌లు అనుమానాలు రేకెత్తిస్తోంది. 

Also Read: మటన్ పేరుతో కుక్క మాంసం విక్రయం- రాజస్థాన్‌ నుంచి సరఫరా- బెంబేలెత్తిపోతున్నం జనం

టాప్ హెడ్ లైన్స్

Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
Embed widget