Viral News: మటన్ పేరుతో కుక్క మాంసం విక్రయం- రాజస్థాన్ నుంచి సరఫరా- బెంబేలెత్తిపోతున్నం జనం
Bangalore News: బెంగళూరులో కుక్క మాంసం కలకలం సృష్టిస్తోంది. రాజస్థాన్ నుంచి రైలులో వచ్చిన 4500 కిలోల కుక్క మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారన్న వార్తలు ప్రకంపనలు రేపుతున్నాయి.
Karnataka News: రెస్టారెంట్లలో చికెన్, మటన్ వంటి నాన్‌వెజ్ తినాలంటేనే బెంబేలెత్తిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. చికెన్, మటన్ పేరుతో కుక్క, దున్న, ఆవుల మాంసాలు విక్రయిస్తున్నారనే వార్తలతో రెస్టారెంట్లకు వెళ్లి తినేసి వచ్చిన వాళ్లు సైతం వాంతులు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఏదొక సిటీలో ప్రతి రోజూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ సీజ్ చేయడం, భారీగా పెనాల్టీలు వేస్తున్నా తర్వాత మళ్లీ ఈ ఘటనలు నిత్య కృత్యం అవుతున్నాయి. తాజాగా బెంగళూరు నగరంలో మటన్ పేరుతో 4500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం సంచలనంగా మారింది. హోటళ్లకు దీన్ని సప్లై చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
రాజస్థాన్ నుంచి బెంగళూరుకు భారీగా తీసుకొచ్చిన కుక్క మాంసం పట్టుకోవడం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. 90 బాక్సుల‌్లో 4500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం తీవ్ర దుమారం రేపుతోంది. బెంగళూరులోని యశ్వంత్‌పూర్ రైల్వే స్టేషన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. నిత్యం బెంగళూరు నగరానికి 14 వేల కిలోల కుక్క మాంసం వస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన రైలులో భారీగా కుక్క మాంసాన్ని పట్టుకున్నారు. 4500 కిలోల కుక్క మాంసాన్ని 90 డబ్బాల్లో తరలించడంపై హిందూ సంఘాలు అడ్డుకున్నాయి.
Also Read: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?
గతంలో చెన్నైలో కూడా..
గతంలోనూ చెన్నై నగరంలో కుక్క మాంసం వార్తలు కలకలం సృష్టించాయి. ఏకంగా 1000 కేజీల మాంసాన్ని ఎగ్మోర్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) పోలీసులు పట్టుకున్నారు. అదంతా కుక్క మాంసమేనని అనుమానిస్తున్నారు. నవంబర్ 17, 2018న ఈ ఘటన చోటుచేసుకుంది. జోధ్‌పూర్ నుంచి వచ్చిన ఓ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీ నుంచి ఆ మాంసాన్ని ప్లాట్‌ఫాంపైకి దించి తరలించడానికి సిద్ధంగా ఉంచినట్లు అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
Also Read: దివ్యాంగులను కించపరిచిన ఇద్దరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల అరెస్టు
కుక్క మాంసం చట్టబద్ధం చేయాలని యువకుడి నిరసన
కుక్క మాంసం చట్టబద్ధం చేయాలని.. తన పిటిషన్ పై సంతకం చేయాలంటూ బెంగళూరులో ఓ కుర్రాడు చేస్తున్న డిమాండ్ గతంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇతడి డిమాండ్ పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వచ్చాయి. జంతు ప్రేమికులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు కొందరైతే అతగాడిని కొట్టేందుకు కూడా రెడీ అయ్యారు. మామూలుగా నాన్ వెజ్ తినొద్దని చెబితే ఎవరూ వినరు. కాదు కాదు పట్టించుకోరు కూడా. అయితే భిన్నంగా ఆలోచించిన ఆ కుర్రాడు కుక్క మాంసాన్ని చట్టబద్ధం చేయాలని. .తన పిటిషన్ పై సంతకం చేయాలంటూ ప్లకార్డు పట్టుకుని డిమాండ్ చేశాడు.
కుక్క మాంసానికి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై అతడిని జంతు ప్రేమికులు వెళ్లి ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. తాను శాఖాహారిని. చాలామంది నాన్ వెజ్టేరియన్స్ చిన్నచిన్న సంతోషాలకు మూగజీవాలను చంపి తింటారు. అలా చేయొద్దంటే ఎవరూ వినడం లేదు. మీరు నిజంగా చికెన్ తినాలనుకుంటే కుక్క మాంసం ఎందుకు తినకూడదు. మీరు శాఖాహారిగా ఉండాలని తాను మాములుగా చెబితే వినేవారా? అందుకే ఇలా ప్లకార్డుతో డిమాండ్ చేసినట్లు చెప్పాడు.
Also Read: వానలు కురిసిన ఆనందంలో గాడిదలకు గులాబ్ జామూన్‌లు తినిపించిన గ్రామస్థులు - వీడియో