Viral Video: ఇలా చేస్తే మీరు ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు - ఈయన సలహా విన్నారా?
Viral News: ట్యాక్స్ కట్టకుండా ఈ టిప్స్ ఫాలో అవండి అంటూ ఓ యూజర్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గడ్డిని పెంచుకోండి అంటూ సరదా సలహా ఇచ్చాడు.
Viral News in Telugu: కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబ్‌లపై పెద్ద చర్చే జరుగుతోంది. సీరియస్ డిస్కషన్‌తోపాటు సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి. రకరకాల వీడియోలు, ఫొటోలతో నెటిజన్లు తమ క్రియేటివిటీ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇన్‌కమ్ ట్యాక్స్ పడకుండా ఎలా తప్పించుకోవచ్చో ఓ యూజర్ చాలా ఫన్నీగా చెప్పాడు. ఇంట్లో పెరిగిన గడ్డిని చూపిస్తూ ఓ వీడియో తీశాడు. ఆదాయపు పన్ను పడకుండా ఇలా చేయండి అంటూ ఓ సరదా సలహా ఇచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియో 2 లక్షల వ్యూస్ వచ్చాయి. కామెంట్స్ అయితే వందలాదిగా వచ్చి పడుతున్నాయి. ఓ CA కూడా ఈ వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేశాడు. "మీరు ఇన్‌కమ్ ట్యాక్స్‌ని 100% వరకూ సేవ్ చేసుకోవాలని అనుకుంటే నా దగ్గర ఓ సలహా ఉంది. ఇందులో ఎలాంటి మతలబు లేదు. పైగా లీగల్ కూడా" అని వీడియో మొదలు పెట్టాడు యూజర్. ఆ తరవాత స్టెప్స్ వారీగా ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాడు.
Salaried Class, this video is for you...
— CA Akhil Pachori (@akhilpachori) July 25, 2024
How to save 100% income tax 😂😂#Budget #Satire pic.twitter.com/UZBzuPNklV
"మీ ఇంట్లో బాల్కనీలో కానీ టెరస్‌పైన కానీ గడ్డి పెంచండి. ఇందులో ఎలాంటి అక్రమం లేదు. లీగల్ కూడా. గడ్డి పెరిగాక మీ కంపెనీ HR దగ్గరికి వెళ్లండి. నాకు శాలరీ వద్దు అని చెప్పండి. ఆ మాట వినగానే వాళ్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జీతం ఇవ్వడానికి బదులుగా మీరు పెంచిన గడ్డిని కొనాలని అడగండి. ఒకవేళ మీ జీతం రూ.50 వేలు అనుకుంటే ఒక 50 గడ్డి ఆకులు వాళ్లకు అమ్మేయండి. ఒక్కోటి రూ.1000 చొప్పున విక్రయించండి. అప్పుడు మీకు ఎలాంటి ట్యాక్స్ కట్ అవదు. మీరు అమ్మేది వ్యవసాయ ఉత్పత్తి. ఇండియాలో దీనిపై ఎలాంటి ట్యాక్స్ లేదు. అలా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్‌ని పూర్తిగా సేవ్ చేసుకోవ్చచు. ఇది లీగల్ ప్రాసెస్" అని ఈ వీడియోలో వివరించాడు. ఈ వీడియో చూసిన నెటిజన్‌లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.
కొత్త పన్ను శ్లాబులివే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను శ్లాబులను ఇటీవలి బడ్జెట్‌లో ప్రకటించారు. రూ.3 లక్షల వరకూ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన పని లేదని వెల్లడించారు. రూ.3-7 లక్షల మధ్య ఆదాయం ఉన్న వాళ్లు 5% ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.7-10 లక్షల వరకు ఆదాయుంటే 10% పన్ను కట్టాలి. రూ.10-12 లక్షల ఆదాయానికి 15%, రూ.12- 15 లక్షల ఆదాయానికి 20% పన్ను కట్టాల్సి ఉంటుంది. రూ.15 లక్షలకు మించి ఆదాయం ఉన్న వాళ్ల నుంచి 30% ట్యాక్స్ వసూలు చేస్తారు. ఇక ఈ కొత్త శ్లాబుల ద్వారా రూ.17,500 వరకూ ఆదా అవనుంది.
Also Read: Viral News: వానలు కురిసిన ఆనందంలో గాడిదలకు గులాబ్ జామూన్‌లు తినిపించిన గ్రామస్థులు - వీడియో