Kolkata Cop: కుక్కలు తడవకుండా గొడుగు పడుతూ... ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న పోలీసు... ఫొటో వైరల్
తాజాగా కోల్‌కతా పోలీసులు పోస్టు చేసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
కొద్ది రోజుల క్రితం ఓ జంతు ప్రేమికుడు తనతో పాటు తన కుక్క కూడా ప్రయాణించాలని ఏకంగా బిజినెస్ క్లాస్ మొత్తాన్ని బుక్ చేశారు. ఇందుకోసం మొత్తం రూ.2.25 లక్షలు వెచ్చించారు. ఎయిర్ ఇండియా విమానంలో ముంబయి నుంచి చెన్నై వచ్చారు వీరు.
Moment of the Day!
— Kolkata Police (@KolkataPolice) September 18, 2021
Constable Tarun Kumar Mandal of East Traffic Guard, near the 7 point crossing at Park Circus. #WeCareWeDare pic.twitter.com/pnUGYIRKkA
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... తాజాగా కోల్‌కతా పోలీసులు పోస్టు చేసిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సెప్టెంబరు 18న వీరు ఈ ఫొటోను పోస్టు చేశారు. ఇంతకీ ఆ ఫొటోలో ఏముందంటే... ఓ ట్రాఫిక్ పోలీసు వర్షంలో గొడుగు వాడుతూ డ్యూటీ చేస్తున్నాడు. దీంట్లో ఏం ప్రత్యేకత ఉందా అనే కదా మీ అనుమానం. ఆ గొడుగులో ఆ ట్రాఫిక్ పోలీసు కుక్కలు కూడా తడవకుండా చూసుకున్నాడు.
So adorable and my sincere regards to him.
— A K (@AK48989340) September 18, 2021
ఈ ఫొటోకి Moment of the Day అని వ్యాఖ్య జత చేశారు. ఈస్ట్ ట్రాఫిక్ గార్డ్ కానిస్టేబుల్ తరుణ్ కుమార్ అని ఫొటోలో ఉన్న వ్యక్తి గురించి తెలిపారు. కోల్‌కతా పోలీసులు పోస్టు చేసిన ఈ ఫొటోకి నెటిజన్లు ఎంతో పాజిటివ్‌గా స్పందించారు. ఆ కానిస్టేబుల్‌కి సెల్యూట్ అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.
My Salute to real life heroes. Thank you KP 🙏
— Sarfaraz Ali (@Sarfara49048664) September 18, 2021
Also Read: Trans Kitchen: ఇది ట్రాన్స్ జెండర్ల కిచెన్... పిల్లలకు, పేషెంట్లకు ఆహారం ఉచితం
Also Read: COVID-19: ఒక వ్యక్తి.... 5 సార్లు వ్యాక్సిన్ వేయించుకున్నాడు... 6వ సారి రిజిస్ట్రర్ చేసుకున్నాడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.