Viral : నాలుగు నెలల పాటు ఆన్ చేసే ఉంచిన గీజర్..కరెంట్ బిల్లు గురించి సోషల్ మీడియాలో రచ్చ
Bengaluru :బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల తన ఫ్లాట్ మేట్ గురించి ఓ ఫన్నీ కథను షేర్ చేశాడు. బెంగళూరులో తన ఫ్లాట్‌మేట్ చేసిన ఫన్నీ తప్పు సంఘటనను షేర్ చేశారు.

Bengaluru : బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి ఇటీవల తన ఫ్లాట్ మేట్ గురించి ఓ ఫన్నీ కథను షేర్ చేశాడు. బెంగళూరులో తన ఫ్లాట్‌మేట్ చేసిన ఫన్నీ తప్పు సంఘటనను షేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇంటర్నెట్‌లో ప్రతి ఒక్కరూ బ్యాచిలర్ జీవనశైలిలో జరిగిన ఈ తప్పును విని నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో ఆదిత్య దాస్ అనే నెటిజన్లకు ఇలా చెప్పుకొచ్చాడు. ‘‘నా ఫ్లాట్‌మేట్ గీజర్‌ను ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేయలేదు..దాని కారణంగా అది గత నాలుగు నెలలుగా ఆన్ లోనే ఉంది. ఈ సమయంలో మేమిద్దరం మా ఇంటికి వెళ్ళాము.’’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ పోస్ట్ జనవరి 22న షేర్ చేశారు. ఇప్పటివరకు దీనిని ఎనిమిది లక్షలకు పైగా వీక్షించారు. ఈ పోస్ట్ వైరల్ అవ్వగానే జనాలు దాని గురించి ఫన్నీ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. కొంతమంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేసి బిల్లు ఎంత అయిందని అడిగారు. అందుకు గాను ఆదిత్య.. 'అక్టోబర్ నుండి నాకు ఎటువంటి విద్యుత్ బిల్లు రాలేదు . బహుశా నేను లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చు.' అంటూ చెప్పుకొచ్చాడు.
మరొక నెటిజన్, 'భారతదేశంలో ప్రజలు వాటర్ హీటర్లను ఆపివేస్తారు, కానీ పశ్చిమ దేశాలలో మేము వాటిని ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచుతాము. సంవత్సరాలుగా ఎటువంటి సమస్య ఉండదు' అని అన్నారు. దీనికి ఆ యూజర్.. ఇదే విషయాన్ని ఇంకొకరు కూడా చెప్పారని కామెంట్ చేశారు.
Also Read : Chandrababu Team Davos: ఎంవోయూలు చేసుకోకుండానే దావోస్ టూర్ ముగింపు - చంద్రబాబు, లోకేష్ వ్యూహం మార్చారా ?
flatmate left the geyser on for 4 months while both of us had gone to our hometowns. AMA.
— Aditya Das (@theadityadas) January 22, 2025
ఈ పోస్ట్ చదివిన తర్వాత నెటిజన్లు మనసారా నవ్వుకున్నారు. ఈ పోస్ట్ వాటర్ హీటర్ల గురించి ఒక ముఖ్యమైన చర్చను కూడా ప్రారంభించింది. ఈ రోజుల్లో హీటర్లలో ఉష్ణోగ్రత సెన్సార్లు ఉన్నాయని, ఇవి నీటిని వేడి చేసిన తర్వాత ఆటో మేటిక్ గా విద్యుత్తును ఆపివేస్తాయని చాలా మంది నెటిజన్లు చెప్పారు. ఒక నెటిజన్.. 'ప్రస్తుతం గీజర్లలో ఉష్ణోగ్రత సెన్సార్లు లేవా, ఇవి నీరు సరైన ఉష్ణోగ్రతకు చేరుకున్న తర్వాత వేడిని ఆపుతాయి కదా ?. మునుపటి గీజర్లలో ఇది జరగలేదు, హీటింగ్ కాయిల్ ఆన్‌లో ఉండటంతో గీజర్ వేడెక్కుతుంది. దీనివల్ల నష్టం జరగవచ్చు' అని ఒక కామెంట్ చేశారు.
మరికొందరు నెటిజన్లు కూడా థర్మోస్టాట్ పనిచేయకపోవడం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. 'థర్మోస్టాట్ సరిగా లేకపోవడం వల్ల సమస్య తలెత్తవచ్చు, ఇది గీజర్ హీటింగ్ ఎలిమెంట్‌ను కూడా దెబ్బతీస్తుంది' అని ఒక వ్యక్తి రాసుకొచ్చారు. గీజర్ ఎక్కువ కాలం (3-4 రోజుల కంటే ఎక్కువ) ఉపయోగంలో లేనప్పుడు ఎటువంటి నష్టం జరగకుండా ఉండటానికి దానిని ఆపివేయాలని చాలా మంది నెటిజన్లు సూచించారు.
Also Read : EPFO: మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్ చేయండి





















