Watch: ఈ పిల్ల ఏనుగు ఎంత బాగా ఫుట్ బాల్ ఆడుతుందో... చూడండి
తాజాగా ఓ పిల్ల ఏనుగు ఫుట్ బాల్ ఆడుతూ సందడి చేసింది.
ఈ మధ్య కాలంలో ఏనుగులకు సంబంధించిన వార్తలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ పిల్ల ఏనుగు ఫుట్ బాల్ ఆడుతూ సందడి చేసింది.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. ఏనుగు పిల్ల ఎంత బాగా ఫుట్ బాల్ ఆడుతుందో అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. విక్రమ్ పల్వాత్ అనే వ్యక్తి తన ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోకి ‘ప్రాక్టీస్ టైమ్’ అని వ్యాఖ్య జత చేశాడు. కానీ, ఈ వీడియో ఎక్కడిదో అతడు చెప్పలేదు.
Practice time 😄 pic.twitter.com/rXGN66RHeR
— Vikram (@vikrampalawat) September 20, 2021
బంతితో పిల్ల ఏనుగు ఫుట్‌బాల్ చకచకా ఆడుతోంది. బంతిని అటు ఇటూ కాలితో తన్నుతూ దాని వెంట పరిగెడుతూ కాసేపు సరదాగా గడిపింది. ఈ పిల్ల ఏనుగుతో పాటు మరో ఏనుగు కూడా అక్కడ ఉంది. కానీ, అది మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఉంది. విక్రమ్ షేర్ చేసిన ఈ వీడియో కొద్దిసేపట్లోనే వైరల్‌గా మారింది. వెయ్యికి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు మెస్సీ, రొనాల్డో లాగా ఈ పిల్ల ఏనుగు కూడా ఫేమస్ అవుతుందేమో... అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.
Also Read: White Hair Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ ట్రై చేయండి
కొద్ది రోజుల క్రితం ఓ పెద్ద ఏనుగు తన పిల్ల ఏనుగును ఎంత లేపినా నిద్ర లేవకపోవడంతో అది కంగారు పడిన వీడియో వైరలైన సంగతి తెలిసిందే. అప్పుడు గమనించిన సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి ఆ పిల్ల ఏనుగును నిద్ర లేపారు. దీంతో ఆ పెద్ద ఏనుగు సంబరపడింది.
Mother elephant can’t wake her baby sound asleep and asks her keepers for help.. pic.twitter.com/6h0nzpB5IR
— Buitengebieden (@buitengebieden_) September 17, 2021
Also Read: Cadbury Dairy Milk Ad: క్యాడ్బరీ డెయిరీ మిల్క్ కొత్త యాడ్ చూశారా? మార్పు గమనించారా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)