Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా? అయితే... ఆ అలవాటు మానుకోండి... మరి, మంచి నీళ్లు ఎలా తాగాలి?
ఉదయాన్నే లేవగానే మంచి నీళ్లు తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు.
![Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా? అయితే... ఆ అలవాటు మానుకోండి... మరి, మంచి నీళ్లు ఎలా తాగాలి? Why standing and drinking water is a bad habit Drinking Water: నిలబడి నీళ్లు తాగుతున్నారా? అయితే... ఆ అలవాటు మానుకోండి... మరి, మంచి నీళ్లు ఎలా తాగాలి?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/18/0568ffe99833acb683bab1c2cd2cae6e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉదయాన్నే లేవగానే మంచి నీళ్లు తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్లు చెబుతున్నట్లు నీళ్లు తాగుతున్నాం. కానీ, ఎలా తాగుతున్నాం అన్నది కూడా ముఖ్యమే. ఔను. నిల్చుని నీళ్లు తాగితే నష్టాలు కొని తెచ్చుకున్నట్లే.
Also Read: Immune Boosting Juices: ఇమ్యూనిటీ పవర్ పెంచే జ్యూసులు ఇవే... మరి మీరు రోజూ తీసుకుంటున్నారా?
రోజంతా కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి అని తెలిసిందే. అలాగని ఇంట్లో ఉంటే అటు, ఇటు తిరుగుతూ మధ్యలో నీళ్లు తాగుతాం. అదే బయట ఉంటే బాటిల్‌తో తాగేస్తాం. ఆరోగ్యం కాపాడుకోవడానికి అంటే శరీరంలోని మలినాలు బయటికి పోవడానికి నీళ్లైతే తాగుతున్నాం. కానీ, ఆ నీళ్లు నిలబడి తాగితే మాత్రం రోగాలు వెంట తెచ్చుకున్నట్లే.
నిలబడి నీళ్లు తాగితే ఏమౌతుంది అనే కదా మీ సందేహం? నిలబడి నీరు తాగడం మంచిది కాదు అని పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకుంటే నిలబడి తాగిన నీరు ఒక్కసారిగా ఆహార గొట్టం ద్వారా జీర్ణాశయంలోకి వెళ్తుంది. దీంతో... అజీర్తి, అసిడిటీతో పాటు ఇతర సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు... కిడ్నీలకు నీరు అందదు కూడా. దీంతో మూత్రాశయ సమస్యలు, కిడ్నీల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్ సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది.
Also Read: Benefits of Eating Fish: చేపలు తరచూ తింటున్నారా? వారానికి 2 లేదా 3 సార్లైనా తింటే ఎంతో మంచిదట
నిలబడి నీరు తాగడం వలన మనం తాగిని నీటిని మూత్రపిండాలు సరిగా ఫిల్టర్ చేయలేవు. తద్వారా వ్యర్థ పదార్ధాలు నేరుగా మన మూత్రపిండాలలోకి వెళ్లి రక్తంతో కలుస్తాయి. ముఖ్యంగా నిలబడి నీరు తాగడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుందట. ద్రవాల సమతుల్యత దెబ్బతిని, కీళ్ళల్లో ఎక్కువ ద్రవాలు చేరి ఆర్థరైటీస్, కీళ్ళవాతం వంటి సమస్యలకు దారి తీస్తుంది.
మంచి నీటిని ఎలా తాగాలి?
ఇదంతా చదివిన తర్వాత అసలు నీటిని ఎలా తాగాలి అన్న సందేహం ఎవరికైనా కలుగుతోంది. నీటిని గ్లాసు లేదా బాటిల్‌లో తీసుకుని
చక్కగా కూర్చొని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగాలి. అంటే మనం వేడి వేడి కాఫీ, టీ తాగినట్లు అన్నమాట. ఇలా తాగితే అసిడిటీ, అజీర్ణ సమస్యలు తలెత్తవు. ఒకవేళ ఈ సమస్యలు ఉన్నా... ఇక నుంచి కూర్చుని నీళ్లు తాగి ప్రయత్నించండి. నెల రోజుల్లో మీకే తేడా తెలుస్తోంది. ఆహారం తీసుకునే ముందు, తర్వాత గంట వరకు నీటి జోలికి వెళ్లొద్దు.
Also Read: Bottle Feeding: మీ చిన్నారికి డబ్బాతో పాలు పడుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా?
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఎప్పుడు మంచినీళ్లు తాగినా ఎత్తి పోసుకోవద్దు. గ్లాసు లేదా బాటిల్ ఏదైనా చక్కగా కరిచిపెట్టుకుని తాగండి. దీని వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)