White Hair Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? ఈ టిప్స్ ట్రై చేయండి
ఇంట్లోనే కొన్ని పద్ధతులతో మనం తెల్ల జుట్టును సమస్యను పరిష్కరించుకునే మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మధ్య కాలంలో చిన్న వయస్సులోనే తెల్లు జట్టు సమస్యతో బాధపడుతున్నారు. కాలుష్యం ఒక కారణం అయితే, జన్యు లోపం వల్ల మరి కొంత మందికి జుట్టు తెల్లబడుతుంది. ఒత్తిడి సమస్య, పొంతన లేని ఆహారపు అలవాట్ల వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది. దీంతో తమ తెల్ల జట్టును నల్లగా మార్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రంగులు వేసుకుంటారు, డాక్టర్లను కలుస్తారు, ఏవైవే ప్రయోగాలు చేస్తుంటారు. దీంతో కొంతమంది జట్టు రాలిపోయే సమస్యను కూడా ఎదుర్కొంటారు.
Also Read: Immune Boosting Juices: ఇమ్యూనిటీ పవర్ పెంచే జ్యూసులు ఇవే... మరి మీరు రోజూ తీసుకుంటున్నారా?
ఇంట్లోనే కొన్ని పద్ధతులతో మనం తెల్ల జుట్టును సమస్యను పరిష్కరించుకునే మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఉసిరి పౌడర్
ఇనుప పాత్రలో ఒక కప్పు ఆమ్లా పౌడర్‌ను 500 మి.లీ కొబ్బరి నూనె వేసి సన్నని మంటపై నెమ్మదిగా 20 నిమిషాల పాటు వేడి చేయండి. తర్వాత దాన్ని చల్లార్చి వడకట్టండి. గాలి చొరబడని సీసాలో ఈ నూనెను స్టోర్ చేసుకుని వారానికి రెండు సార్లు తలకు పట్టించండి. కొద్ది సేపు నెమ్మదిగా మసాజ్ చేయండి.
కరివేపాకు ఆకులు
కొన్ని కరివేపాకు ఆకులను తీసుకొని 2 స్పూన్ల ఆమ్లా పౌడర్, 2 టీ స్పూన్ల బ్రాహ్మీ పౌడర్‌తో కలిపి రుబ్బాలి. దీన్ని హెయిర్ మాస్క్‌గా జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట పాటు అలాగే ఉంచి తేలిక పాటి షాంపూతో గోరు వెచ్చటి నీటితో తలస్నానం చేయాలి.
Also Read: Benefits of Eating Fish: చేపలు తరచూ తింటున్నారా? వారానికి 2 లేదా 3 సార్లైనా తింటే ఎంతో మంచిదట
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె, నిమ్మరసం జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడతాయి. తలస్నానం చేసే ముందు రోజు రాత్రి తలకు కొబ్బరి నూనె పట్టించండి. తర్వాత రోజో తలస్నానానికి అరగంట ముందు తలకి నిమ్మకాయ పట్టించండి. తరచూ ఇలా చేయడం వల్ల కొంత కాలానికి జుట్టు సహజంగా నల్లగా మారే అవకాశం ఉంది.
బ్లాక్ టీ
బ్లాక్ టీ ఆకులను 2 గంటల పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయాలి. ఈ పేస్టులో నిమ్మరసం కలిపి జుట్టును శుభ్రం చేయడానికి ముందు 40 నిమిషాల పాటు హెయిర్ మాస్క్ లాగా అప్లై చేయండి.
* టీస్పూన్ ఆమ్లా పౌడర్, 2 టీస్పూన్ల బ్లాక్ టీ, 1 టీస్పూన్ స్ట్రాంగ్ కాఫీ డికాషన్, 1/2 అంగుళాల కత్తా, 1 వాల్నట్ బెరడు ముక్క, 1 టీస్పూన్ ఇండిగో, 1 టీస్పూన్ బ్రాహ్మీ పౌడర్, 1 స్పూన్ త్రిఫల చూర్ణం పొడి తీసుకోండి. వీటన్నింటినీ 2 లీటర్ల నీటిలో సన్నని మంటపై నెమ్మదిగా 30 నిమిషాలు కాయండి. అనంతరం చల్లార్చి గాలి చొరబడని సీసాలో భద్రపరచండి. షాంపూ చేయడానికి 30 నిమిషాల ముందు ఈ నూనెను అప్లై చేయండి. కొన్ని రోజుల్లోనే మీ జుట్టు రంగులో తేడా చూస్తారు.
ఈ చిట్కాలను తప్పకుండా ట్రై చేసి తెల్ల జట్టు సమస్య నుంచి బయటపడండి.