News
News
X

Yendluri Sudhakar Passes Away: ప్రముఖ కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూత, ప్రముఖుల సంతాపం

Yendluri Sudhakar Passes Away: గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కవి, సాహితీవేత్త ఎండ్లూరి సుధాకర్ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

FOLLOW US: 
 
Yendluri Sudhakar Passes Away: ప్రముఖ కవి, సాహితీవేత్త ఎండ్లూరి సుధాకర్ కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కవి మరణం పట్ల సాహితీవేత్తలు, రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరి గౌరీశంకర్, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

కవి ఎండ్లూరి మరణం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు. ‘అభ్యుదయ స్ఫూర్తినిచ్చే రచనలతో తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ గారి మరణం విచారకరం.  సుధాక‌ర్ మృతి తెలుగు సాహితీ లోకానికే కాదు, దళిత సమాజానికి కూడా తీరని లోటు’ అన్నారు.

News Reels

ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ జనవరి 21, 1959న నిజామాబాద్ లోని పాములబస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి లకు ప్రథమ సంతానం. ఈయనకు ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు. హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్ లోనే సాగింది . నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం .ఏ, ఎం.ఫిల్, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. 

Also Read: Devulapalli Subbaraya Sastri Passes Away: ప్రముఖ కార్టూనిస్టు, రచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) కన్నుమూత 

ఆయన రచించిన పుస్తకాలు..
వర్తమానం, జాషువా' నాకథ ', కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం, మల్లె మొగ్గల గొడుగు, నల్లద్రాక్ష పందిరి, పుష్కర కవితలు, వర్గీకరణీయం, "ఆటా "జనికాంచె..., జాషువా సాహిత్యం- దృక్పథం - పరిణామం, గోసంగి, కథానాయకుడు జాషువా, నవయుగ కవి చక్రవర్తి జాషువా, కావ్యత్రయం, సాహితీ సుధ, తెలివెన్నెల పుస్తరాలు ఎండ్లూరి సుధాకర్ రచించారు.

ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు. తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడుగా సేవలు అందించారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

Also Read: NeoCov: త్వరలోనే మరో డేంజర్! ఊహాన్ శాస్త్రవేత్తల సంచలన ప్రకటన, ఇది వింటే వెన్నులో వణుకు ఖాయం!

Published at : 28 Jan 2022 11:20 AM (IST) Tags: Telugu News Yendluri Sudhakar Dies Telugu Poet Yendluri Sudhakar Passes Away Yendluri Sudhakar Yendluri Sudhakar Death News

సంబంధిత కథనాలు

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాజన్న బిడ్డలు

అధికారమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న రాజన్న బిడ్డలు

Nizamabad News : విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్, బడితపూజ చేసిన తల్లిదండ్రులు!

Nizamabad News : విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్, బడితపూజ చేసిన తల్లిదండ్రులు!

Jaggareddy : రేవంత్‌తో నాది తోడికోడళ్ల పంచాయతీ - కలిసి పని చేస్తామని జగ్గారెడ్డి ప్రకటన !

Jaggareddy : రేవంత్‌తో నాది తోడికోడళ్ల పంచాయతీ - కలిసి పని చేస్తామని జగ్గారెడ్డి ప్రకటన !

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

YS Sharmila : నేను తెలంగాణ కోడలిని, కేసీఆర్ ను గద్దె దించే వరకు నా పోరాటం ఆగదు - వైఎస్ షర్మిల

టాప్ స్టోరీస్

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

In Pics : పార్నపల్లి రిజర్వాయర్ లో సీఎం జగన్ బోటింగ్

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!

New Year gift to farmers: పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు- ఆరోజునే ఇస్తారట!

New Year gift to farmers: పీఎం కిసాన్ యోజన 13వ విడత డబ్బులు- ఆరోజునే ఇస్తారట!