అన్వేషించండి

Devulapalli Subbaraya Sastri Passes Away: ప్రముఖ కార్టూనిస్టు, రచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి (బుజ్జాయి) కన్నుమూత

Devulapalli Subbaraya Sastri Death News: అద్భుతమైన కార్టూన్లు, కథలతో చిన్నారులతో పాటు పెద్దలను సైతం అలరించిన దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి తుదిశ్వాస విడిచారు.

Devulapalli Subbaraya Sastri Dies In Chennai: ప్రముఖ చిత్రకారుడు, రచయిత దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి కన్నుమూశారు. సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి తమిళనాడు రాజధాని చెన్నైలో తుదిశ్వాస విడిచారని సమాచారం. అద్భుతమైన కార్టూన్లు, కథలతో చిన్నారులతో పాటు పెద్దలను సైతం అలరించిన సుబ్బరాయశాస్త్రి కలం పేరు బుజ్జాయి. కార్టూనిస్టుగా, చిన్న పిల్లల కథా రచయితగా ఆయన చాలా ఫేమస్. ముఖ్యంగా ఆయన క్రియేట్ చేసిన డుంబు పాత్ర సుబ్బరాయశాస్త్రికి చాలా పేరు తెచ్చింది.

ప్రముఖ కవి, సినీ గేయరచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు సెప్టెంబరు 11 1931 లో దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి జన్మించారు. మిగతావారిలా స్కూలుకు వెళ్లకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. చిన్నతనంలో తండ్రి కృష్ణశాస్త్రి వెన్నంటే ఉండేవారు. దాంతో ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికి సన్నిహితంగా మెలిగే అవకాశం కలగడంతో ఎన్నో విషయాలు నేర్చుకునేవారు. ప్రముఖ కవి, రచయిత శ్రీశ్రీ ఓ సభలో బోరు కొడుతుందని సుబ్బరాయశాస్త్రిని షికారుకు తీసుకెళ్లి ఆడించారు. ఇలా ప్రముఖులతో చిన్ననాటి నుంచి కొత్త విషయాలు, జీవితాన్ని నేర్చుకున్నారు. వాటిని బొమ్మల రూపంలో, చిన్న పిల్లల కథల రూపంలో మన ముందుకు తీసుకొచ్చి విజయం సాధించిన వారిలో ఈయన ఒకరు.

దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి 17 ఏళ్ల వయసులో బుజ్జాయి ‘బానిస పిల్ల’ అనే బొమ్మల పుస్తకం ప్రచురించి 'కామిక్‌ స్ట్రిప్‌' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్తగా నిలిచారు. చిన్నారులు ఎంతగానో ఇష్టపడే పంచతంత్ర కథలకు ఎంతో అందమైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. ఈ ఇంగ్లీష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. ఆయన భైరవ్, పెత్తందార్, డుంబు కామిక్ స్ట్రిప్పులను చేశారు.

దేవులపల్లి సుబ్బరాయశాస్త్రికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. తన కుమారునికి తండ్రి పేరు దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి పేరు పెట్టారు. సుబ్బరాయశాస్త్రి కుమారుడు కూడా రచయిత. ఓ కుమార్తె రేఖా సుప్రియ, బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్‌ కూడా రచయిత్రి అయ్యారు.

గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. ‘న్యాయానికి భయం లేదు’ అనే బొమ్మల ధారావాహిక 1975లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది. ప్రముఖులతో తాను నేర్చుకున్న విషయాలు, అనుభవాలను ‘నాన్న-నేను’ అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని రాశారు. ‘నవ్వులబండి - డుంబు బొమ్మల కథలు’ అనే పుస్తకాన్నిరాసి చిన్నారులకు వినోదాన్ని పంచారు.

Also Read: Horoscope Today 28 January 2022: ఈ మూడు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Also Read: Weather Updates: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలే.. తెలంగాణలో పెరుగుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget