అన్వేషించండి

Janwada Farm House : జన్వాడ ఫామ్ హౌస్ ఎవరిది ? ఆ ఫామ్ హౌస్ చుట్టూ వివాదమెందుకు ?

Telangana Politics : జన్వాడ ఫామ్ హౌస్ చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కూల్చేస్తారని బీఆర్ఎస్ నేతలు కోర్టుకెళ్లారు. ఆ ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Who owns Janwada Farm House KTR or His Friend  :  తెలంగాణ రాజకీయాల్లో రోజుకో అంశం తెరపైకి వస్తోంది. బుధవారం జన్వాడ ఫామ్ హౌస్‌ అంశం హాట్ టాపిక్ అయింది. కొద్ది రోజులుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు శిఖం భూముల్లో కట్టిన నిర్మాణాలను వరుసగా కూల్చూతూ పోతున్నారు. ఈ క్రమంలో బుధవారం కూల్చబోయేది జన్వాడలోని కేటీఆర్ ఫామ్ హౌసేనని  విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో ప్రదీప్ రెడ్డి బీఆర్ఎస్ నేత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన ఫామ్ హౌస్ కూల్చే ప్రయత్నంలో ఉన్నారని అడ్డుకోవాలని కోరారు. అదే సమయంలో  తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించిన కేటీఆర్ తనకు ఎలాంటి ఫామ్ హౌస్‌లు లేవని స్పష్టం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు మాత్రమే తన మిత్రుని వద్ద తీసుకున్నానన్నారు. 

జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనని కాంగ్రెస్ ఆరోపణ
 
రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్న సమయంలో.. పీసీసీ అధ్యక్షుడిగా కూడా నియమితులు కాక ముందు ఓ సారి సంచలన ప్రకటన చేశారు. మీడియాను తీసుకెళ్లి ఓ అద్భుతం చూపిస్తానన్నారు. అలా మీడియా ప్రతినిధల్ని తీసుకుని జన్వాడ గ్రామం వద్దకు వెళ్లారు. అక్కడ ఫామ్ హౌస్ ను మీడియా ప్రతినిధులకు చూపించారు. పోలీసులకు దగ్గరకు వెళ్లనీయకపోవడంతో.. అక్కడ డ్రోన్ ఎగురవేసి ఆ దృశ్యాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. ఆ ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనని ఆరోపించారు. అయితే అలా డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసు పెట్టి జైలుకు పంపింది. చాలా రోజుల తర్వాత రేవంత్ రెడ్డికి బెయిల్ వచ్చింది. తర్వాత రేవంత్ రెడ్డి ఆ ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా కట్టారని గ్రీన్ ట్రిబ్యూనల్‌లోనూ పిటిషన్ వేశారు. అప్పట్లోనే కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ తనది కాదని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్  మాత్రం..  ఆ ఫామ్ హౌస్ కేటీఆర్‌దేనని.. కొన్ని భూములు ఆయన భార్య శైలిమ పేరుపై ఉంటే.. మరికొన్ని  బినామీల పేరుపై ఉన్నాయని ఆరోపిస్తున్నాయి.

కేటీఆర్ సతీమణి శైలిమ పేరు మీద కొన్ని భూములు 

జన్వాడలో మాజీ మంత్రి కేటీఆర్ పేరు మీద ఎలాంటి భూములు లేవు. కానీ ఆయన భార్య శైలిమ పేరు మీద కొన్ని భూములు ఉన్నాయి. ఫామ్ హౌస్ ఉన్న భూమి ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద ఉంది. ఆ చుట్టుపక్కల కూడా మరికొంత మంది ఇతర వ్యక్తులు కొనుగోలు చేశారు. అయితే వీరంతా కేటీఆర్ బినామీలని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. జన్వాడ ఫామ్ హౌస్  తనది కాదని కేటీఆర్ చెబుతున్నారు. కానీ కేటీఆర్ తరచూ అక్కడకు వెళ్తూంటారు. పార్టీ నేతలతో ఆంతంగిక సమావేశాలు నిర్వహిస్తూంటారు. ఆయన అధీనంలోనే ఫామ్ హౌస్ ఉందని రాజకీవర్గాలకు తెలుసు. అందుకే కేటీఆర్..తాను లీజుకు తీసుకున్నానని చెబుతున్నారు. అయితే కేటీఆర్ బుకాయిస్తున్నారని లీజుకు తీసుకుంటే.. ఆ పత్రాలు , బ్యాంక్ స్టేట్‌మెంట్లు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీఆర్ఎస్ స్పందించాల్సి ఉంది. 

అత్యంత విలాసవంతమైన ఫామ్ హౌస్ 

జన్వాడ ఫామ్ హౌస్ అత్యంత విలాసవంతంగా ఉంటుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్‌పై డ్రోన్ ఎగురవేసినందుకు రేవంత్ రెడ్డి జైలుకెళ్లారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నేతలు అత్యంత ఆదునికమైన డ్రోన్లను ఎగురవేసి పూర్తి స్థాయిలో దృశ్యాలు చిత్రీకరించి మీడియాకు ఇస్తున్నారు. అక్కడ నాలాలను కబ్జా  చేశారని..అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.  కేటీఆర్ వినియోగిస్తున్న విల్లా అత్యంత విలాసంగా నిర్మించారని అంటున్నారు. ఈ ఫామ్ హౌస్ వివాదం మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది. కూలగొట్టేందుకు హైడ్రాకు .. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడం వల్ల.. ఏ క్షణమైనా ఆ ఫామ్ హౌస్ పై  బుల్డోజర్లు దాడి చేయవచ్చని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య తొలి టెస్టు నేడే‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Balineni Srinivasa Reddy: జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
జగన్‌ తీరు నచ్చలేదు- పార్టీ నుంచి బయటకు పంపే కుట్రలు చేశారు: బాలినేని కీలక వ్యాఖ్యలు
Telangana: తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
తెలంగాణవాసులకు బిగ్ అలర్ట్‌- మీ వాహనం కొని 15 ఏళ్లు దాటిందంటే తుక్కే
Pawan Kalyan: సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
సినిమా శతదినోత్సవాలు జరుపుకున్న పవన్‌కు 100 రోజుల పాలన ఎలా ఉంది?
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్ - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Mokshagna Teja: నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
నందమూరి మోక్షజ్ఞ సరసన మహేష్‌ బాబు హీరోయిన్‌! - బాలయ్య సినిమాలోనూ...
Embed widget