అన్వేషించండి

Telangana BJP Chief: మళ్లీ కేంద్రంలోకి కిషన్ రెడ్డి - తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్?

Telangana BJP President: మోడీ క్యాబినెట్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు మంత్రి పదవులు కన్ఫామ్ అయ్యాయి. దీంతో బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఈటల రాజేందర్ నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Telangana Bjp Chief Kishan Reddy:  నరేంద్ర మోడీ 3.0 కేబినెట్‌ ఆదివారం సాయం కొలువుదీరనుంది. రాష్ట్రపతి భవనం ఇందుకు వేదిక కానుంది.  ప్రధానిగా మోడీతో పాలు పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మోడీ క్యాబినెట్లో మంత్రి పదవులు దక్కించుకున్న వారు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రమాణస్వీకారం చేసే ముందు నరేంద్ర మోడీ తన నివాసంలో ఎంపీలకు తేనేటి విందు ఏర్పాటు చేశారు.  ఆ విందుకు హాజరైన వారందిరికీ మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఊహాగానాలు వచ్చాయి.  నరేంద్రమోడీ క్యాబినెట్లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి మంత్రి పదవులు దక్కినట్లు తెలుస్తోంది.  సాయంత్రం జరుగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమం నిమిత్తం  రాష్ట్రపతి భవన్‌లో భారీగా ఏర్పాట్లు చేశారు. 

పార్టీ పగ్గాలు ఎవరికి ? 
 ఇక తెలంగాణ నుంచి మంత్రి వర్గంలో ఎవరు ఉండబోతున్నారో తేలిపోయింది. దీంతో ప్రస్తుం అందరి చూపు తెలంగాణా అధ్యక్ష పదవి మీదే పడింది.  ప్రస్తుతం  కేంద్రమంత్రి కిషన్ రెడ్డే బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొంతకాలానికి ముందు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ను పార్టీ అధిష్టానం తప్పించి  కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది. ఆదివారం రాత్రి నరేంద్రమోడీతో పాటు కొలువుదీరనున్న కొత్త మంత్రి వర్గంలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్ కూడా ఉన్నారు.   మంత్రివర్గంలో ఉండబోయే వాళ్ల పై క్లారిటీ వచ్చింది. నిన్న మొన్నటి వరకు కిషన్ రెడ్డిని మంత్రి వర్గంలోకి తీసుకుంటారా లేక పోతే  జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అన్న చర్చ జరిగింది.  ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డాను తప్పించి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న ప్రచారం బాగా జరిగింది. 

రేసులో ముగ్గురు
జాతీయ అధ్యక్షపదవి కిషన్  రెడ్డికి ఇవ్వబోతున్నారన్న ప్రచారం నేపథ్యంలో .. నూతన మంత్రివర్గంలో తెలంగాణా నుండి ఎవరుంటారు ? అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే కిషన్ రెడ్డి విషయంలో ఓ క్లారిటీ వచ్చేయడంతో  ఇక మిగిలింది తెలంగాణ అధ్యక్ష పదవే. ఇక్కడే కొందరు ఎంపీలు పార్టీ రాష్ట్రాధ్యక్ష పదవి కోసం అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  వారిలో ముగ్గురు ఎంపీలు అధ్యక్ష బరిలో ఉన్నారు.  పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ రేసులో ఉన్నారు. 

ఈటలకే ఛాన్స్
డీకే అరుణ ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు.. అందువల్ల ఆమెకు అధ్యక్ష పదవీ బాధ్యతలను అప్పగిస్తే మహిళలకు ఇచ్చినట్లు కూడా ఉంటుందన్న చర్చ జోరుగా జరుగుతోంది.  అరుణకు చొచ్చుకుపోయే తత్వం బాగా ఉంది.. దాంతో పాటు ఆమెకు చాలామంది నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి పార్టీ పగ్గాలు అప్పగిస్తే న్యాయం చేయగలరని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ధర్మపురి అర్వింద్ రెండోసారి ఎంపీ అయ్యారు. పైగా బీసీ వర్గానికి చెందిన నేత.  అలాగే ఈటల రాజేందర్ కూడా బీసీ సామాజికవర్గానికే చెందిన వారు. వీరిద్దరూ కూడా మంచి వాగ్ధాటి ఉన్న నాయకులు. దాంతో పాటు  బీసీల్లో మంచి క్రేజు ఉన్న నేతలు. పైగా అధిష్టానంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నారు.  

వీరి ముగ్గురిలోనూ ఈటల రాజేందర్ కే అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సారి ఈటల మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి 3.91లక్షల పైచిలుకు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎంపీగా గెలిచిన ఈటలకు క్యాబినెట్లో చోటు దక్కుతుందని జోరుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా బండి సంజయ్, కిషన్ రెడ్డికి మంత్రి పదవులు దక్కడంతో.. ఈటలకే అధ్యక్ష పదవిని అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది.

అధికారిక ప్రకటనే అలస్యం

ఇది ఇలా ఉంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ను నియమించాలని అధిష్టానం నిర్ణయించింది. రేపు అధికారికంగా ప్రకటన వెలువడనుంది.  ఆదివారం ఉదయం ఈటల రాజేందర్ తో  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు.  పార్టీ అధిష్టానం దూతగా అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస శర్మ ఈటల రాజేందర్ తో చర్చలు జరిపారు. తెలంగాణలో బీజేపీ బాగా పుంజుకుందని,  వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే ఊపును కొనసాగించాలని హేమంత్ బిశ్వాస శర్మ సూచించినట్లు తెలుస్తోంది.  తెలంగాణలో బీజేపీని  అధికారం లోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని.. ఇందుకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యత స్వీకరించాలని కోరినట్లు తెలిసింది. దీనికి ఈటల రాజేందర్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. రేపు ఈటల రాజేందర్.. అమిత్ షా తో భేటీ కానున్నారు. ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి 
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది.  బీజేపీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకుని.. కూటమిలో తొలి అతిపెద్దగా పార్టీ స్థానాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో 240సీట్లు బీజేపీ సంపాదించుకుంది. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 272సీట్లు కావాలి. దీంతో బీజేపీ తన మిత్రపక్షాల సాయంతో ఆదివారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. పలు రాష్ట్రాలకు చెందిన వారిని మోడీ తన క్యాబినెట్లోకి ఆహ్వానించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలువురు ఎంపీలు ఇప్పటికే పార్టీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వారు క్యాబినెట్లో మంత్రి పదవులు చేపట్టనుండడంతో ఆయా రాష్ట్రాల్లో కూడా పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Rain Updates: అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
అల్పపీడనం ఎఫెక్ట్, ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచనతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Rohit Sharma: రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
రోహిత్ చేసింది కరెక్టే, కాదు అతని కెరీర్ కే ప్రమాదం- బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై మాజీల వాదన
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
NITW: వరంగల్ నిట్‌లో నాన్‌ టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Embed widget