News
News
వీడియోలు ఆటలు
X

New Scam: మీకూ ఇలా ఫారిన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయా? ఐతే డెంజర్‌లో ఉన్నట్లే!

మనకే కాదు..మన చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఈ మధ్య కాలంలోనే ఫారెన్ నెంబర్స్ నుంచి వాట్సాప్ కాల్స్, మేసేజ్ లు వస్తున్నాయి. దీని వెనుక ఎంత పెద్ద స్కామ్ జరగుతుందో చూడండి.

FOLLOW US: 
Share:

మీకు రిసేంట్ గా +251, +62, +84 వంటి విదేశీ కోడ్ ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా..? అది చూసి ఫారెన్ లో  ఉన్న మన ఫ్రెండ్ ఎవరైనా చేసి ఉండి ఉండవచ్చు అనుకుంటున్నారా..! ఐతే.. ఒక్క సెకన్. ఫోన్ చేసేది దోస్తులు కాదు.. దొంగలు. డేటా దొంగలు జర జాగ్రత్త. మనకే కాదు..మన చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఈ మధ్య కాలంలోనే ఫారెన్ నెంబర్స్ నుంచి వాట్సాప్ కాల్స్, మేసేజ్ లు వస్తున్నాయి. దీని వెనుక ఎంత పెద్ద స్కామ్ జరగుతుందో చెబుతా జర మనసున పెట్టండి..! 

టెంప్ట్ అయ్యేలా ఆఫర్లు

అసలేంటి..? ఈ స్కామ్ అంటే..! +251, +62, +84 వంటి కోడ్ ల నుంచి వాట్సాప్ కాల్ వస్తుంది. లేదా మేసేజ్ వస్తుంది. ఇది వేరే దేశానికి సంబంధించిన  కోడ్ మాత్రమే. లోకేషన్ కచ్చితంగా అక్కడిది కాదు. ఎక్కడో చిన్న రూమ్ లో నుంచి ఆపరేట్ చేస్తుంటారు. మీ ప్రొపైల్ చాలా బాగుంది. ఎక్స్ లెంట్ ఆఫర్ మా దగ్గర ఉంది. పెద్ద కంపెనీలో అంబానీ కంటే పెద్ద జీతం. పార్ట్ టైమ్ ద్వారా కూడా గంటకు పదివేలు సంపాదించవచ్చు వంటి ఆఫర్లు పెడుతుంటారు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్లు ఏం చేస్తాం. నిజంగా జాబ్ ఆఫర్  చూద్దాం మిగతా డిటెయిల్స్ అని లింక్ క్లిక్ చేస్తారు. ఇక అంతే.. మీ డాటా అంతా సైబర్ క్రైమ్ కేటుగాళ్లకు చేరిపోతోంది. ఒక్కసోరి..మీ అకౌంట్ లో డబ్బులు ఖల్లాస్ కూడా అవుతాయి. 

అబ్బా..! ఎంత పెద్ద మోసం కదా..! వీటి నుంచి తప్పించుకోవడానికి ఏం చేయాలి అనే కదా మీ ప్రశ్న..! నా దగ్గర దీనికో సూపర్ సోల్యూషన్ ఉంది. అదేటంటే..!  వీటిని లైట్ తీసుకోండి. అదేనండి..! పెద్దొళ్లు అంటారు కదా ఉరుకున్నంతా ఉత్తమం మరోకటి లేదని. సేమ్ అలాగే, ఏదైనా మేసేజ్ లు, కాల్స్ వస్తే.. మీరు దానికి రెస్పాండ్ అవ్వకుండా వాట్సాప్ కు రిపోర్ట్ చేయడం లేదా బ్లాక్ చేయడం వంటివి చేయండి. ఒకప్పుడు ఫోన్ అంటే కాల్స్ మాట్లాడాటానికే.. కానీ ఇప్పుడలా కాదు..! మన గుట్టు, రట్టు అంతా అందులోనే ఉంటుంది. పొరపాటున మన డేటా ఇతరుల చేతికి వెళ్లిందా ఇక అంతే గోవిందా గోవిందా కాబట్టి.. ఈ చిన్న టిప్స్ ఫాలో అవండి

No-1: వాట్సాప్ లో కానీ నార్మల్ గా వచ్చే కాల్స్, మేసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండండి. మనకు తెలిసిన వాళ్లు కొత్త నంబర్ నుంచి 99 శాతం ఫోన్ చేయరు, మేసేజ్ చేయరు. ఒకవేళ చేసిన అరే..నా అకౌంట్ పనిచేయట్లేదు. ఫలానా నెంబర్ కు ఓ 5 వేలు వేయండని అడగరు. ఒకవేళ అడిగారు అంటే కచ్చితంగా ఫ్రాడే.. 

No-2: ఉద్యోగాలు లింకిడ్ ఇన్, నౌకరీ వంటి వెబ్ సైట్స్ లో వెతుక్కోవాలి. అంతేకానీ నేరుగా బాబు..! నువ్వు సూపర్ గా ఉన్నావ్ అని ఎవడూ నీకు మేసేజ్ చేయడు. కాబట్టి.. పార్ట్ టైమ్ జాబ్స్, ఫుల్ టైమ్ జాబ్స్ అని మేసేజ్ లు వస్తే లైట్ తీసుకోండి. 

No-3: అమ్మాయిల డీపీ ఉండి.. హాయ్ రమేష్ అని మేసేజ్ రాగానే.. సొంగ కార్చుకుంటూ రిప్లై ఇవ్వకండి. మీకు తెలియని అమ్మాయిలతో చాటింగ్ అంటే.. ఆలౌమోస్ట్ బాంబ్ పై కూర్చున్నట్లు. అలా మాటల్లో కలిపి.. వీడియో కాల్ చేయమంటారు నీవు చేస్తావ్ అవతల అమ్మాయి కనిపించదు. వెంటనే కాల్ కట్ అవుతుంది. అబ్బా ఛాన్స్ మిస్ ఐందని అనుకుంటావ్. కానీ, వెంటనే అదంతా రికార్డ్ చేసి.. నువ్వు న్యూడ్ గా ఉన్నట్లు లేదా న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు ఎడిట్ చేసి... బ్లాక్ మెయిల్ చేస్తారు కాబట్టి.. అలాంటి కాల్స్ పట్ల జాగ్రత్త

No-4:
బ్రాండెడ్ ప్రొడక్ట్ ఆఫర్ లో .. 500లకే వస్తుందనే మేసేజులు వస్తాయి. ఈ లింక్ ను క్లిక్ చేయండి అన్నాడో..వాడిని అసలు నమ్మకండి. 

ఒకవేళ.. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా మేము మోసపోయాం అనుకుంటే..డోంట్ వర్రీ..! 24 గంటల్లోపే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. దానీ వల్ల..మీ డబ్బులు తిరిగి రాబట్టే అవకాశం ఉంది. అంతేకానీ.. చదవుకున్నాం. సమాజంలో హై ప్రొపైల్ లో ఉన్నాం.. చెబితే పరువు పోతుంది.. అనుకుంటే జీవితాంతం సైబర్ నేరగాళ్ల చేతిలో పడుతూ ఉండాల్సిందే. ఎందుకంటే.. మనముంటుంది మానవప్రపంచంలో కాదు.. సైబర్ ప్రపంచంలో..! కాబట్టి, డ్రైవింగ్ చేసేటప్పుడే కాదు.. ఫోన్ వాడేటప్పుడు కూడా సోయిలో ఉండి సోచాయిస్తూ ఉపయోగించాలి.

Also Read: ఫారిన్ ఫేక్ కాల్స్‌పై స్పందించిన వాట్సప్, త్వరలో కొత్త టెక్నాలజీ

Published at : 09 May 2023 08:01 PM (IST) Tags: Whatsapp Scam WhatsApp calls Foregin Numbers country codes Foregin fake calls

సంబంధిత కథనాలు

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, నేడు వర్షాలు, ఈదురుగాలుల అలర్ట్ - ఐఎండీ

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

Telangana Formation Day: తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన 12 సంఘటనలు, చారిత్రక ఘట్టాలు ఇవే!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్,  జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్

టాప్ స్టోరీస్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !