Sharmila Padayatra: అకాల వర్షానికి నాశనమైన పంటలను పరిశీలిస్తున్న వైఎస్ షర్మిల
Sharmila Padayatra: అకాల వర్షానికి నష్టపోయిన పంటలను వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించారు.
Sharmila Tour: అకాల వర్షానికి నష్టపోయిన పంటలకు ఎకరాకు 30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎకరాకు 10 వేల రూపాయలు ఇస్తే ఏ మూలకు సరిపోవని, రైతులు ప్రతి ఎకరాకు రూ. 30 వేల చొప్పున ఖర్చు పెట్టారని షర్మిల తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటను షర్మిల పరిశీలించారు. జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్ గ్రామంలో పంట నష్టాన్ని పరిశీలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పూర్తిగా దెబ్బతిన్నదని రైతులు షర్మిలకు తెలిపారు. చేతికొచ్చిన వరి పంట పూర్తి నేల పాలయ్యిందని షర్మిలతో చెప్పుకుంటూ ఆవేదన చెందారు.
జనగాం జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని షర్మిల అన్నారు. చేతికొచ్చిన పంట మొత్తం నేల పాలయ్యిందని పేర్కొన్నారు. రైతులు సర్వస్వం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఒక్క బచ్చన్న పేట మండలంలోనే 10 వేల ఎకరాలకు పైగా నష్టం జరిగినట్లు తెలుస్తున్నట్లు పేర్కొన్నారు. అకాల వర్షాలతో ఇంత పంట నష్టపోతున్నా కేసీఆర్ ఒక్క ఎకరాకు కూడా పరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. గత నెల 23వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ లో వచ్చారని, ఎకరాకు 10 వేల రూపాయల సహాయం చేస్తామని హామీ ఇచ్చారని షర్మిల గుర్తు చేశారు. 10 వేలు ఇస్తామని చెప్పి నెల రోజులు గడుస్తున్నా ఒక్క రూపాయి కూడా అందలేదని షర్మిల విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల కోట్ల పంట నష్టం జరిగిందంటున్న షర్మిల
గత 9 ఏళ్లుగా అకాల వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల కోట్ల పంట నష్టం జరిగిందని షర్మిల తెలిపారు. ఏటా 1500 కోట్ల నష్టం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ముష్టి రైతు బంధు ఇచ్చి కేసీఆర్ రైతులను ఉద్ధరించినట్లు బిల్డప్ ఇస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ రైతు ద్రోహి అంటూ మండిపడ్డారు. ఒక్కో ఎకరాకు 30 వేల వరకు పెట్టుబడి పెట్టినట్లు రైతులు చెబుతుంటే, కేసీఆర్ ఇస్తానని 10 వేలు ఏ మూలకూ సరిపోవని షర్మిల అన్నారు. ఎకరాకు 10 వేలు కాదని వెంటనే 30 వేల నష్టపరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు.
అయినా నీ బంగారు బతుకమ్మే బాగా లేనప్పుడు.. ఇతరులను శిక్షించే అర్హత నీకెక్కడిది. మీ ప్రభుత్వానికి పాలించే స్థాయి ఎక్కడిది. అవినీతి పాలనలో మునిగి తేలిన మీకు, మీ ఎమ్మెల్యేలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడుతారు. నీ అధికారాన్ని దూరం చేస్తారు. 4/4
— YS Sharmila (@realyssharmila) April 28, 2023
https://t.co/bknD1vUUZi
— YS Sharmila (@realyssharmila) April 28, 2023
దళితబంధులో ఒక్కో కుటుంబం వద్ద రూ.3లక్షలు తిన్న MLAలను KCR వెంటనే బర్తరఫ్ చేయాలి.MLAల పేర్లు బయటపెడితే కాళేశ్వరంలో మీరు తిన్న రూ.70వేల కోట్ల గురించి,బిడ్డ లిక్కర్ స్కాం,కొడుకు రియల్ ఎస్టేట్ స్కాంపై ప్రశ్నిస్తారని భయమా?దమ్ముంటే అవినీతి MLAలపై చర్యలు తీసుకో.
తప్పు చేస్తే నా బిడ్డయినా, కొడుకైనా వదిలిపెట్టేది లేదు..
— YS Sharmila (@realyssharmila) April 28, 2023
జైలుకు పంపుడే అన్న కేసీఆర్.. ఇప్పుడు నీ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నారని నువ్వే ఒప్పుకున్నావు కదా?
దళిత బంధులో రూ.3 లక్షల లంచం తీసుకుంటున్నారు. 1/4
నిన్నటికి నిన్న రైతుబంధు పేరుతో పెద్ద ఎత్తున ప్రజలను మోసం చేసినట్లు షర్మిత తెలిపారు. దళితబంధులో ఒక్కో కుటుంబం వద్ద ఎమ్మెల్యేలు 3 లక్షలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాంటి వారిని బర్తరఫ్ చేయాలని కోరారు.