అన్వేషించండి

Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో విషాదం! డ్రైవర్ శంకర్ గౌడ్‌ మృతి! తొందరపాటు నిర్ణయాలు వద్దన్న సీఎం! విపక్షాల హెచ్చరిక!

Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డిమాండ్ల సాధన కోసం నర్సంపేట డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసి మరణించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆర్టీసీ సమ్మె రెండో రోజు కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసి మరణించాడు.
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు తొందరపాటు నిర్ణయాలు వద్దన్నారు.
  • సమస్యల పరిష్కారానికి ఐదుగురు మంత్రుల కమిటీ చర్చలు జరపనుంది.
  • కార్మికులు వెనక్కి తగ్గకుండా ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు.

Telangana RTC Strike: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులు చేపట్టిన సమ్మె రెండోరోజు తీవ్ర విషాదం నెలకొంది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న కార్మికుల్లో ఒకరైన వరంగల్ జిల్లాకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్‌ ఆత్మహత్యాయత్నం చేసి మరణించడం సమ్మె తీవ్రత పెంచింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కగా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. 

వరంగల్ జిల్లా నర్సంపేట డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శంకర్ గౌడ్‌ సమ్మెలో మానసిక ఒత్తిడికి గురయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయన తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. 80 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న శంకర్‌ను మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా, దారి మధ్యలోనే కర్మాన్‌ఘాట్ వద్ద ఆయన కన్నుమూశారు. శంకర్ గౌడ్ మృతితో ఆర్టీసీ కార్మికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతదేహాన్ని ప్రస్తుతం కంచన్‌బాగ్‌ డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో ఉంచినట్టు సమాచారం. 

మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

తొందరపాటు నిర్ణయాలు వద్దని వారించిన సీఎం 

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలు, మరణాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కార్మికులు ఎవరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసుకోవద్దని, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదని హితవుపలికారు. ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో ఉందని ఈ విషయంలో ఇప్పటికే దృష్టి సారించామని పేర్కొన్నారు. 

 

ఈ క్రమంలోనే సమ్మెను విరమింపజేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఐదుగురు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శుక్రవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపనుంది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుందామని, కార్మికులు సంయమనం పాటించాలని మంత్రి శ్రీధర్ బాబు కూడా విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని ఆసక్తికరమైన వెబ్‌స్టోరీ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ఆర్టీసీ సమ్మెకు బీజేపీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్‌ పథకం అమలులో ఆర్టీసీ కార్మికులు ఎంతో సహకరిస్తున్నా, ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

ఆర్టీసీతో పెట్టుకున్న వారు ఎవరూ బాగుపడలేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ పరిస్థితి ఏమైందో అందరూ చూశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అదే తప్పు చేయద్దని హితవు పలికారు. 

వెనక్కి తగ్గని ఆర్టీసీ కార్మికులు 

ప్రభుత్వంతో చర్చల ప్రకటన వచ్చినప్పటికీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కార్మికుడు శంకర్ గౌడ్ మృతితో పోరాటం ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చాయి. జేఏసీ ఛైర్మన్ వెంకన్న, వైస్ ఛైర్మన్ థామస్ రెడ్డి రాబోయే రోజుల కోసం కీలక కార్యాచరణను ప్రకటించారు. ఏప్రిల్ 24 అన్ని డిపోల ముందు మౌన ప్రదర్శన చేస్తారు. ఏప్రిల్ 25న డిపోల వద్ద వంటా వార్పు కార్యక్రమం, ఏప్రిల్ 26న జిల్లాల్లో ఆర్టీసీ కార్మికుల కవాతు ఉంటుంది. ఏప్రిల్ 27న ప్రజాప్రతినిధులకు వినతి పత్రాల అందేత, మహిళా ఉద్యోగుల నిరసన చేస్తారు. ఏప్రిల్ 29న డిపోల ముందు అర్ధనగ్న ప్రదర్శనలు చేస్తారు. 

Frequently Asked Questions

ఆర్టీసీ సమ్మెలో ఆత్మహత్యాయత్నం చేసుకున్న కార్మికుడి పేరు ఏమిటి?

వరంగల్ జిల్లాకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుని మరణించారు. ఆయన నర్సంపేట డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది?

ప్రభుత్వం ఐదుగురు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ శుక్రవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చలు జరపనుంది.

ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు తెలిపిందా?

అవును, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆర్టీసీ సమ్మెకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ కార్మికులు భవిష్యత్తులో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు?

కార్మికులు ఏప్రిల్ 24న మౌన ప్రదర్శన, 25న వంటా వార్పు, 26న కవాతు, 27న వినతి పత్రాల అందేత, 29న అర్ధనగ్న ప్రదర్శనలు చేపట్టనున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Breaking News: పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!
పోక్సో కేసులో తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి పృధ్వీశ్వర్ రెడ్డిపై బీఫ్ఐ సస్పెన్షన్!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Embed widget