అన్వేషించండి

Medaram Jatara: సమ్మక్క–సారక్కలమ్మను దర్శించుకున్న రాష్ట్ర కేంద్ర మంతులు-నిలువెత్తు బంగారం సమర్పణ

Medaram Jatara: మేడారం సమ్మక్క–సారక్క భక్తులతో కిక్కిరిసిపోయింది. సామాన్య భక్తులతోపాటు మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా దర్శించుకుంటున్నారు. మొక్కులు తీర్చుకుంటున్నారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్ర మంత్రులు మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
  • భారీ గిరిజన పండుగ అభివృద్ధికి కేంద్రం నిధులు అందిస్తోంది.
  • గిరిజన సంక్షేమం, విద్యా, పర్యాటక అభివృద్ధికి పలు పథకాలు అమలు.
  • రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అమ్మవార్లకు బంగారాన్ని సమర్పించారు.

Medaram Jatara: మేడారం సమ్మక్క–సారక్క జాతర సందర్భంగా కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకుని మొక్కులు సమర్పించారు. రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆలయ ప్రధాన ద్వారం వద్ద కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ డోలు–డప్పుల నడుమ ఆలయంలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించారు.

తదనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం మాట్లాడుతూ, “సమ్మక్క–సారక్క జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది గిరిజనుల మహాకుంభంగా నిలుస్తోంది. సుమారు 20 ఏళ్ల క్రితం నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు మళ్లీ ఈ పవిత్ర జాతరకు రావడం ఆనందంగా ఉంది” అని అన్నారు.


Medaram Jatara: సమ్మక్క–సారక్కలమ్మను దర్శించుకున్న రాష్ట్ర కేంద్ర మంతులు-నిలువెత్తు బంగారం సమర్పణ

ఈ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందిస్తోందని తెలిపారు. జాతర నిర్వహణకు సహకరిస్తూనే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు పాత మిత్రులని, పార్లమెంటులో కలిసి పనిచేసిన అనుభవం ఉందని గుర్తు చేశారు.

గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ధర్తీ ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద ₹1 లక్ష కోట్లు, పీఎం జన్-మన్ యోజన కింద ₹24,000 కోట్లు, తెలంగాణకు 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేస్తున్నట్టు వెల్లడించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో గిరిజన వ్యవహారాల ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటై, తొలి క్యాబినెట్ మంత్రిగా తాను బాధ్యతలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. భగవాన్ బిర్సా ముండా వంటి గిరిజన వీరుల త్యాగాలను దేశం గౌరవిస్తోందని అన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ “సమ్మక్క–సారక్క జాతర గిరిజన ప్రజల అతిపెద్ద పండుగ. నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి వస్తారు” అని తెలిపారు. జాతర ఏర్పాట్లలో భాగస్వాములైన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, బొగత జలపాతం ప్రాంతాల పర్యాటక అభివృద్ధికి ₹80 కోట్లు, రామప్ప దేవాలయ అభివృద్ధికి ₹140 కోట్లు, ఈ ఏడాది జాతర నిర్వహణకు ₹3.70 కోట్లు మంజూరు చేశారని అన్నారు. సమ్మక్క–సారక్క పేరుతో ₹890 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు కానుందని, పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. త్వరలో ప్రధాని చేతుల మీదుగా ప్రారంబించుకుంటామని వెల్లడించారు.

లక్షలాది మంది వచ్చే ఈ మహాజాతరలో భక్తులకు కనీస వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందిస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న అధికారులు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

గురువారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు నిలవెత్తు బంగారాన్ని  సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Medaram Jatara: సమ్మక్క–సారక్కలమ్మను దర్శించుకున్న రాష్ట్ర కేంద్ర మంతులు-నిలువెత్తు బంగారం సమర్పణ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడారం జాతరకు ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. భక్తులందరూ ప్రశాంతంగా అమ్మవార్లను దర్శించుకుని తిరిగి ఇంటికి చేరుకోవాలి. అమ్మవార్ల దయవల్ల అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. 


Medaram Jatara: సమ్మక్క–సారక్కలమ్మను దర్శించుకున్న రాష్ట్ర కేంద్ర మంతులు-నిలువెత్తు బంగారం సమర్పణ


Medaram Jatara: సమ్మక్క–సారక్కలమ్మను దర్శించుకున్న రాష్ట్ర కేంద్ర మంతులు-నిలువెత్తు బంగారం సమర్పణ

 

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget