Singareni Employees: సింగరేణి ఉద్యోగులకు గుడ్ న్యూస్, 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ విడుదల
Singareni Employees: సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ ను ఆ సంస్థ విడుదల చేసింది. అలాగే దసరా, దీపావళి బోనస్ ల చెల్లింపులకు కూడా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది.
Singareni Employees: సింగరేణి ఉద్యోగులకు 11వ వేజ్ బోర్డు ఏరియర్స్ ను ఆ సంస్థ విడుదల చేసింది. మొత్తంగా 1450 కోట్లు రూపాయలను విడుదల చేసినట్లు ఫైనాన్స్ డైరెక్టర్ ఎన్.బలరామ్ వెల్లడించారు. ఒక్కో కార్మికుడికి ఏరయర్స్ రూపంలో 37. లక్షల రూపాయలు మేర ఇచ్చినట్లు స్పష్టం చేశారు. దాదాపు వేల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరబోతుంది. కార్మికులకు చెల్లించాల్సిన 11వ వేతన ఒప్పందం 23 నెలల పెండింగ్ బకాయిలును విడుదల ేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో వేతన బకాయిలను విడుదల చేయడం చరిత్రలో ఇదే మొదటి సారి అని యాజమాన్యం చెబుతోంది. అలాగే దీపావళి, దసరా పండుగల బోనస్ చెల్లింపులు చేసేందుకు సింగరేణి సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీజీబీకేఎస్ అధ్యక్షురాలు కవిత ప్రత్యేక చొరవ వల్లే సింగరేణి కార్మికులకు ఏరియర్స్ బాయిలు అందనున్నాయి. 23 నెలల ఏరియర్స్ చెల్లింపుల్లో 23 నెలలకు సంబంధించిన పీఎఫ్ షేర్, ఇన్ కమ్ టాక్స్ బకాయిలు కట్ చేసుకొని మిగతా డబ్బులు చెల్లించనున్నారు. ఏరియర్స్ చెల్లిస్తున్నారని తెలుసుకున్న ఉద్యోగులు తెగ సంబర పడిపోతున్నారు. అలాగే దీపావళి, దసరా బోనస్ లు ఇస్తామని చెప్పడంపై కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్