Revanth Reddy: ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతీ లేదు - కేటీఆర్ వల్లే ప్రశ్నాపత్రాల లీకేజీ: రేవంత్ రెడ్డి
Revanth Reddy: ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అయినా ఇస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ ఇప్పటి వరకు ఆ పని ఎందుకు చేయలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Revanth Reddy: రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత పరిస్థితీ చాలా అధ్వాన్నంగా మారిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. పదో తరగతి ప్రశ్నా పత్రాలు వాట్సాప్ లో, టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో దొరుకుతున్నాయంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరుద్యోగ నిరసన ర్యాలీలో చెప్పారు. అలాగే భూములు, కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు కొల్లగొట్టి.. ఇప్పుడు నిరుద్యోగులు, యువత జీవితాలను నాశనం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసలు ఈ ప్రశ్నా పత్రాల లీకేజీకి సీఎం కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటీఆర్ యే కారణం అని చెప్పుకొచ్చారు. యువతకు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మంత్రి కేటీఆర్ చెప్పినట్లు గుర్తు చేశారు. కానీ ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదని, నిరుద్యోగ భృతీ ఇవ్వలేదని అన్నారు.
తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం…కాని ఎక్కడ కూడా @TelanganaCMO ప్రోటోకాల్ కానీ, నిబంధనలను కాని పాటించలేదు.
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2023
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణ సచివాలయం,అమరవీరుల స్థూపం,అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో జరిగిన అవినీతి నిగ్గుదేల్చి దోషులను కఠినంగా శిక్షించడం…
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేందుకు ప్రాణాలను బలి ఇచ్చింది బడుగు, బలహీన వర్గాల ప్రలని రేవంత్ రెడ్డి వివరించారు. సెక్రటేరియట్ కు అంబేడ్కర్ పేరు పెట్టామని కేసీఆర్ గొప్పులు చెప్పుకుంటున్నారని... కానీ పంజాగుట్ట చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహం పెడతామని వీహెచ్ అడిగితే ఎందుకు అనుమతింలేదని నిలదీశారు. మంత్రి వర్గంలో ఒక్క మాదిగకు కూడా చోటు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని తాకేందుకు కూడా సీఎం కేసీఆర్ కు అర్హత లేదన్నారు. కాంగ్రెస్ హయాంలోనే కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను కట్టినట్లు తెలిపారు. కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి పాలమూరుకు వస్తే ఎంపీగా గెలిపించినట్లు గుర్తు చేశారు. కానీ కేసీఆర్ మాత్రం పాలమూరు అవమానించారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలమూరు జిల్లా - కాంగ్రెస్ పుట్టినిల్లు
— Telangana Youth Congress (@IYCTelangana) April 30, 2023
నడుస్తున్న జనం సాక్షిగా
సంకల్పించిన మనసుతో
భయాన్ని వీడి
ఎగురుతున్న కాంగ్రెస్ జెండా నీడన
ఈసారి కాంగ్రెస్ అంటున్న తెలంగాణ సమాజం!
-@revanth_anumula
-@ShivaSenaIYC
-@SampathKumarINC pic.twitter.com/VDgRAP7H1e
పాలమూరు బిడ్డకు రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిగా సోనియా గాంధీ అవకాశం ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మీ బిడ్డను చంపుకుంటారో, చక్కగా సాధుకుంటారో మీ ఇష్టం అని అన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలోని 14 ఎమ్మెల్యే, 2ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సరూర్ నగర్ లో విద్యార్థి నిరుద్యోగ, నిరసన ర్యాలీకి మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ వస్తున్నారని.. పాలమూరు నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, చిన్నారెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, రాములు నాయక్, మల్లు రవి, సంపత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
నెత్తురు మండే..
— Revanth Reddy (@revanth_anumula) April 30, 2023
శక్తులు నిండే
నిరుద్యోగి కోసం..
పాలమూరు గర్జించే#NirudyogaNirasanaRally #Mahabubnagar #ByeByeKCR pic.twitter.com/jwCO7kjfPx