అన్వేషించండి

KTR In Mulugu: అక్కడ నీళ్లిచ్చే ముఖమేనా వాళ్లది, అన్నీ ఆగంఆగం మాటలు - కేటీఆర్

తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్‌ డేలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

తెలంగాణలో ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొంటుంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్‌లో మాత్రం నామమాత్రంగా ధాన్యం కొంటున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ తరహాలోనే ఛత్తీస్‌గఢ్‌లో వరి, పత్తి సాగవుతుందని, అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎకరానికి 12 క్వింటాళ్లే కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఎంత ధాన్యం పండించినా ఎకరానికి పరిమితంగానే ధాన్యం కొంటారని అన్నారు. మిగతా ధాన్యమంతా రైతులు మార్కెట్‌కు వెళ్లి మిల్లర్‌ ఎంత ఇస్తే అంతకు అమ్ముకోవాల్సిందేనని అన్నారు. పండించిన ధాన్యానికి ప్రభుత్వ రక్షణ లేదని, ప్రభుత్వ మద్దతు ధర కూడా లేదని అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్‌ డేలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. బహిరంగ సభలో ప్రతిపక్షాలపై కేటీఆర్ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఛత్తీస్‌గఢ్‌లో ఇంటింటికీ నల్లా నీరిచ్చే మొఖం లేదు కానీ.. తెలంగాణలో మాత్రం పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారంటూ కేటీఆర్ విమర్శించారు. అక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం అలా ఉంటే.. ఇక్కడకు వచ్చి కాంగ్రెస్‌ నేతలు పెద్దపెద్ద మాటలు మాట్లాడతరని అన్నారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ఉచిత కరెంటు ఉన్నదా? మరి ఎవరిని గెలిపిద్దాం? ఎవరిని ప్రోత్సహిద్దామో ఆలోచించాలి. రైతులు, సాగు, తాగునీరు మాత్రమే కాదు.. ఎందుకు దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నరు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనపై ఉన్నది’’ అని కేటీఆర్ అన్నారు.

అక్కడ ఇంకా కొనపాయె వడ్లు.. ఇంక ఎన్నడు కొంటరు? ఇంకేం చేస్తరు ఎగిరెగిరిపడుతరు. అక్కడ ఇచ్చేది ఎకరానికి రూ.2 వేలు కూడా పంట పెట్టుబడికి ఇచ్చేది లేదు. ఇక్కడ తెలంగాణలో ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్న కేసీఆర్‌ ని అదే కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నరు. అక్కడ మంచినీళ్లు ఇచ్చే మొఖం లేదు. ఇక్కడకు వచ్చి మాత్రం పెద్ద డైలాగ్‌లు, యాక్టింగ్‌లు, ఉపన్యాసాలు, ప్రజలను ఆగం చేసే కార్యక్రమాలు చేస్తున్నరు.

ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా అభివృద్ధి

‘‘రూ.65 కోట్లతో కలెక్టర్‌ కార్యాలయానికి నేడు లాంచనంగా శంకుస్థాపన చేసుకున్నాం. ములుగు జిల్లా ఎస్పీ ఆఫీసుకు రూ.38.50 కోట్లతో హోంమంత్రి, డీజీపీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశాం. రూ.12 కోట్లతో 5 మోడల్‌ పోలీస్‌ స్టేషన్లకు శంకుస్థాపన, ఓ మోడల్‌ స్టేషన్‌కు ప్రారంభం చేసుకున్నాం. బస్‌ డిపో ఉండాలంటే రూ.10 కోట్లతో, రూ.4 కోట్లతో సీసీరోడ్లు, మురికి కాలువలు, రూ.కోటితో వైకుంఠధామం, రూ.30 లక్షలతో లైబ్రరీలకు శంకుస్థాపన చేసుకున్నాం. ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా ప్రజలపై ప్రేమతో, అభిమానంతో మంత్రులను ఇక్కడికి పంపారు. 116 మంది దళితులకు రూ.2.39 కోట్లు, ఎస్టీలకు రూ.1.45కోట్ల బ్యాంకు ద్వారా సబ్సిడీ అందించనున్నాం. 3 వేల మంది యాదవులకు రూ.1.87 లక్షల సబ్సిడీతో గొర్రెల పంపిణీ జరుగుతోంది.

33 మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు ఇవ్వబోతున్నాం. 37 కుటుంబాలకు ఇంటి పట్టాలు, 4 ఫిషరీ సొసైటీలకు రిజిస్ట్రేషన్‌ పట్టాలు, 1181 మహిళా సంఘాలకు రూ.110 కోట్ల విలువైన చెక్కులు, మూడు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నాం. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగు జిల్లాలోనే 17 వేల ఎకరాలకు పోడు భూముల పట్టాలు అందజేయనున్నాం’’ అని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Minister Peddireddy: నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
నా జీవితంలో జగన్ లాంటి ముఖ్యమంత్రిని చూడలేదు: మంత్రి పెద్దిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
UPSC: సివిల్స్ ఫలితాల్లో పాల‌మూరు అమ్మాయికి మూడో ర్యాంకు, తెలుగు రాష్ట్రాల నుంచి 50 మందికి పైగా ఎంపిక
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Embed widget