అన్వేషించండి

Miss World 2025 contestants: మైమరిపించే ఓరుగల్లు అందాలను వీక్షించనున్న ప్రపంచ సుందరీమణులు

వరంగల్ లో ప్రపంచ సుందరీమణులు పర్యటనకు సర్వం సిద్దమైయ్యింది. ఓరుగల్లు అందాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు మిస్ వరల్డ్ అందగత్తెలు రేపు ఓరుగల్లు వెళ్లనున్నారు.

హైదరాబాద్ లో మిస్ వరల్డ్ 2025 పోటీలు తెలంగాణ ఖ్యాతిని, ప్రాచీన శిల్పసంపదను ప్రపంచానికి పరిచయం చేయనున్నాయి. తెలంగాణలో ప్రముఖ ప్రాంతాలను సందర్శిస్తున్న ప్రపంచ సుందరీమణులు బుధవారం వరంగల్ వెళ్లనున్నారు. ప్రపంచ అందగత్తెలు వరంగల్ లో సందర్శబోయే ప్రదేశాల ప్రత్యేకతలేంటంటే..

ఓరుగల్లు అంటేనే తెలంగాణ, సంస్కృతి సంప్రదాయాలు, చరిత్రకు నిలువెత్తు నిదర్శనం.. భవ్య దివ్య నవ్య నగరంగా పేరు గాంచింది వరంగల్. అంతేకాకుండా కాకతీయ సామ్రాజ్య రాజధాని ఈ నగరం. రమణీయ శిల్ప సౌందర్యం.. అద్భుతమై ఆలయాలు.. అలరించే రాజస కట్టడాలు వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఆలయం.. ఒకటి కాదు రెండూ కాదూ.. వేయి స్తంభాలతో కొలువైన కోవెల నగరం.. త్రినగరిలో.. కొలువైన త్రికూటాలయం.. వరంగల్ నగరానికి వన్నె తెచ్చిన కట్టడాలు అనేకం..

కాకతీయులు నిర్మించిన వరంగల్ కోట

వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్య కాలంలో ఓ ఇతిహాసిక దుర్పం.. కాకతీయులు దీనిని అత్యంత అద్భుతంగా నిర్మించారు. వరంగల్ కోటలోని కీర్తి తోరణాన్ని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర చిహ్నంగా ఎంచుకోవడం ద్వారా తెలంగాణ సాంస్కృతిక గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది.. దీంతోపాటు రామప్ప ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో అద్భుతంగా నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. ఇంతటి ప్రఖ్యాతులు సాధించిన ఆలయాలు.. పర్యాటకంగా పేరుగాంచిన ప్రాంతాలను తనివీ తీరా పరిశీంచేందుకు ప్రపంచ సుందరీమణులు వరంగల్ తరలిరానున్నారు.

రాత్రి హరిత హోటల్​లో డిన్నర్

ప్రపంచ సుందరీమణులు (మిస్ వరల్డ్-2025 పోటీదారులు) బుధవారం వరంగల్​ జిల్లా పర్యటనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.  ముందుగా 35 మందితో కూడిన అందాల భామల బృందం వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తారు. వీరితోపాటు 22 మంది అందగత్తెలతో కూడిన మరో బృందం హైదరాబాద్ నుండి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి చేరుకుని, అక్కడి శిల్ప సౌందర్యాన్ని పరిశీలిస్తారు. పేరిణి నృత్య ప్రదర్శనను తిలకి స్తారు. రాత్రి హరిత హోటల్​లో డిన్నర్ పూర్తి చేసుకుని హైదరాబాద్​కు తిరుగు ప్రయాణమవుతారు.

తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా చర్యలు

ఈ క్రమంలో వరంగల్ , ములుగు జిల్లాల కలెక్టర్లు అందాల భామల పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వారికి ఎక్కడా ఏలాంటి ఇబ్బందిరాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భద్రత చర్యలు తీసుకున్నారు.  మిస్​ వరల్డ్​ పోటీల నేపథ్యంలో ప్రతి అంశంలోనూ తెలంగాణ ఖ్యాతి ప్రతిబింబించేలా అధికారుల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ‘తెలంగాణ జరూర్​ ఆనా’అనే థీమ్​తో ప్రభుత్వం అందాల భామలు ప్రాచీన ఆలయాలు.. పర్యాటక ప్రాంతాల అందాలు తిలకించేలా ప్రణాళిక రచించింది. తద్వారా వరంగల్​ ఖ్యాతి ప్రపంచానికి పరిచయం చేయనున్నారు.


Miss World 2025 contestants: మైమరిపించే ఓరుగల్లు అందాలను వీక్షించనున్న ప్రపంచ సుందరీమణులు

వరంగల్‌లో ఏం ఉన్నాయంటే..

వరంగల్ లో చారిత్రాత్మక ఆలయం.. వేయి స్తంభాల గుడి. వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రుద్రేశ్వర స్వామి ఆలయం అని  పిలువబడే  హిందూ దేవాలయం. హన్మకొండలో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయం కాకతీయ వంశ రాజుల కళా నైపుణ్యానికి, శిల్పకళా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేరిన ఈ ఆలయం.., క్రీ.శ. 1163లో కాకతీయ రాజు రుద్రదేవుని ఆదేశాల మేరకు నిర్మించారు. ఈ ఆలయం చాళుక్య శైలిలో నిర్మించబడింది. అయితే కాకతీయుల శిల్పకళా వైభవం దీనిలో స్పష్టంగా కనిపిస్తుంది. నక్షత్రాకార పీఠంపై నిర్మితమైన ఈ త్రికూటాలయం అద్భుతమైన వాస్తుకళను ప్రదర్శిస్తుంది. ఆలయం కళ్యాణ మంటపం.. ప్రధాన ఆలయంతో కలిపి సుమారు వేయి స్తంభాలతో నిర్మించడంతో దీనికి "వేయి స్తంభాల గుడి" అనే పేరు వచ్చింది. వేయి స్తంభాల గుడి కాకతీయ సామ్రాజ్య కళా వైభవానికి, శిల్పకళా నైపుణ్యానికి, ఇంజినీరింగ్ చాతుర్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది.  ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను, చరిత్ర పరిశోధకులను ఆకర్షిస్తోంది.

 

యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప

మరో కీర్తికిరీటం రామప్ప దేవాలయం.  ములుగు జిల్లా, వెంకటాపూర్ మండలం పలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఈ ఆలయం కాకతీయ రాజవంశం ఆధ్వర్యంలో 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని కాకతీయ రాజు గణపతి దేవుని సైన్యాధ్యక్షుడైన రేచర్ల రుద్రుడు నిర్మించారు. శిల్పి రామప్ప పేరు మీదుగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఇది ఒక అరుదైన ప్రత్యేకత. రామప్ప ఆలయం కాకతీయ శైలిలో నిర్మించారు. ఇది ఎత్తైన నక్షత్ర ఆకారపు పీఠంపై తూర్పు దిశాభిముఖంగా నిర్మించారు. జులై 25, 2021న, రామప్ప ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఈ గుర్తింపు కోసం 255 కట్టడాలు పోటీపడగా, 17 దేశాల ప్రతినిధులు రామప్పకు అనుకూలంగా ఓటు వేశారు. అలా యునెస్కో వారసత్వ హోదా సాధించింది. ఆలయం కాకతీయ శిల్పకళా వైభవానికి చిహ్నంగా నిలుస్తోంది.

కాకతీయుల వైభవానికి నిదర్శనం వరంగల్ కోట. వరంగల్ కోట కాకతీయ సామ్రాజ్యం కాలంలో నిర్మితమైన ఒక ఐతిహాసిక దుర్గం. ఈ కోట క్రీ.శ. 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు విస్తరించిన చరిత్రను కలిగి ఉంది. కాకతీయులు (క్రీ.శ. 750-1323) ఈ కోటను నిర్మించి, తమ రాజధానిగా చేసుకున్నారు. కోటలోని మూడు వృత్తాకార పొరలు, నాలుగు భారీ రాతి ద్వారాలు, స్వయంభూ శివాలయం వంటివి కాకతీయుల నిర్మాణ వైభవానికి నిదర్శనం.. కాకతీయ రాజు ప్రోల రాజు ఈ కోట నిర్మాణానికి పునాది వేశారని ప్రజలు నమ్ముతారు. గణపతి దేవుడు, రుద్రమ దేవి, ప్రతాపరుద్రుడు వంటి రాజులు ఈ కోటను మరింత బలోపేతం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ కోటను ఒక ముఖ్యమైన చారిత్రక, సాంస్కృతిక వారసత్వ స్థలంగా గుర్తించి, దాని పరిరక్షణ.. పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. కాకతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు కాకతీయ వైభవ సప్తాహం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వరంగల్ కోటలోని కాకతీయ కళా తోరణం (కీర్తి తోరణం) తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంగా గుర్తింపు పొందింది. ఈ తోరణం కాకతీయుల నిర్మాణ కళాత్మకతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.
Miss World 2025 contestants: మైమరిపించే ఓరుగల్లు అందాలను వీక్షించనున్న ప్రపంచ సుందరీమణులు

ఇలా వరంగల్ ,ములుగు జిల్లాలో అద్భుతమైన ఆలయాలు,, పర్యాటక ప్రాంతాల చూసేందుకు ప్రపంచ అందాల భామలు తరలిరావడం చరిత్రలో కొత్త అధ్యాయనానికి నాంది పలుకుతోంది.ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తే, జిల్లావాసులు ప్రపంచ సుంరీమణుల రాకకు ఆకశక్తిగా ఎదురుచూస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget