అన్వేషించండి

Mahabubabad: మహబూబాబాద్‌లో గెలిచేదెవరు? అధికార పార్టీనా? లేక బీఆర్ఎస్ సత్తా చాటుతుందా?

Telangana News: 2009 కి ముందు వరంగల్ పార్లమెంట్ జనరల్ స్థానంగా కొనసాగింది. 2009 లో నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా మహబూబాబాద్ ఏర్పడి ఎస్టీ రిజర్వుడు అయ్యింది.

Mahabubabad Parliament Constituency: మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం ఉమ్మడి వరంగల్, ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలలోని అసెంబ్లీ నియోజకవర్గాలను కలుపుకొని మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంగా కొనసాగుతుంది. ఈ నియోజకవర్గం 2009 కి ముందు వరంగల్ పార్లమెంట్ జనరల్ స్థానంగా కొనసాగింది. 2009 లో నియోజకవర్గం పునర్వ్యవస్థీకరణలో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గం ఏర్పడి ఎస్టీ రిజర్వుడు అయ్యింది. 

ఈ నియోజకవర్గంలో ఆదివాసి గిరిజనులు, లంబాడీల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. వరంగల్ పార్లమెంట్ స్థానంగా ఉన్నప్పుడు 1952 నుంచి 2004 వరకు 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఎక్కువసార్లు గెలవడం జరిగింది. 2009లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడిన తరువాత 2009, 2014, 2019 మూడు సార్లు ఎన్నికలు జరగగా రెండు సార్లు బీఅర్ఎస్, ఒకసారి కాంగ్రెస్ పార్టీ గెలిచింది.

2009లో 
2009లో ఎన్నికలలో కాంగ్రెస్‌ నుంచి పోరిక బలరాంనాయక్‌, మహాకూటమి సీపీఐ నుంచి కుంజా శ్రీనివాసరావు, ప్రజారాజ్యం పార్టీ నుంచి డీటీ నాయక్‌ పోటీపడ్డారు. 2009లో ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పోరిక బలరాం నాయక్‌కు సమీప ప్రత్యర్థి సీపీఐ కుంజా శ్రీనివాసరావు పై 68 వేల 957 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు. 

2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి సీతారాం నాయక్, కాంగ్రెస్ నుండి బలరాం నాయక్, టీడీపీ నుండి మోహన్ లాల్, ఎస్సార్ సీపీ నుండి తెల్లం వెంకట్రావు పోటీ చేయగా.. కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ పై సీతారాం నాయక్ 34 వేల 992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

2019లో 
2019 ఎన్నికల్లో టీఅర్ఎస్ నుండి మలోతు కవిత, కాంగ్రెస్ నుండి బలరాం నాయక్, బీజేపీ నుంచి హుస్సేన్ నాయక్, సీపీఐ నుండి వెంకటేశ్వర రావు పోటీ చేయగా.. మాలోతు కవిత లక్షా 46 వేల 660 ఓట్ల మెజార్టీతో బలరాం నాయక్ పై విజయం సాధించారు.

2024లో జరుగుతున్న ఎన్నికల్లో బీఅర్ఎస్ నుంచి మాలోతు కవిత, కాంగ్రెస్ నుండి బలరాం నాయక్, బీజేపీ నుండి సీతారాం నాయక్ లు పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒకరు సిట్టింగ్ అయితే ఇద్దరు ఎంపీలుగా పనిచేసిన వారు కావడం విశేషం. ఇక్కడ త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి మహబూబాబాద్, డోర్నకల్, ములుగు, నర్సంపేట, పినపాక, ఇల్లందు, భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. భద్రాచలం ఒక్కటి బీఅర్ఎస్ గెలవగా మిగితా ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. భద్రాచలం బీఅర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.

టాప్ హెడ్ లైన్స్

Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Telangana Police Recruitment 2026: తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
తెలంగాణలో నిరుద్యోగులకు ఊరట! యూనిఫామ్ కొలువుల వయోపరిమితి రెండేళ్లు పెంపు!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Independence Day 2026: దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!
దేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా ప్రధాని మోదీ, ముఖ్యమంత్రులు చెప్పిన శుభాకాంక్షలు ఇవే!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget