News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Bogatha Water Falls: భారీ వర్షాల కారణంగా ఉప్పొంగుతున్న బొగతా జలపాతం - సందర్శన నిలిపివేత

Bogatha Water Falls: తెలంగాణ నయాగారాగా పేరొందిన బొగతా జలపాతం భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లుతోంది. ఈక్రమంలోనే సందర్శనను నిలిపివేశారు. 

FOLLOW US: 
Share:

Bogatha Water Falls: తెలంగాణ నయాగారాగా పేరుగాంచిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగతా జలపాతం పొంగి పొర్లుతోంది. మూడ్రోజులుగా ఛత్తీస్ గఢ్ తో పాటు స్థానికంగా కురుస్తున్న వర్షాలతో వరదలు ఎక్కువ అయ్యాయి. దీంతో బొగతా జలపాతం వద్ద పెద్ద ఎత్తున నీరు ప్రవహిస్తోంది. నిండుకుండలా మారి పొంగి పొర్లుతున్న గంగమ్మను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. జలపాతాన్ని చూస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే భారీ వర్షాలు, వరద ఉద్ధృతి ఎక్కువవడంతో జలపాతం సందర్శనను నిలిపి వేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. బొగతా జలపాతం సందర్శనకు అనుమతి లేదని.. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని ఎఫ్ఆర్ఓ చంద్రమౌళి వెల్లడించారు. 

రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు

రాష్ట్రంలో రాగల ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నుంచి వచ్చే సోమవారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షం ఉందని వివరించింది. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వీటితోపాటు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాభాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

సోమవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం

ఇప్పటికే సోమవారం రోజు నుంచి ఎడతెరిపి లేకుండా ఇప్పిటికీ వర్షం కురుస్తూనే ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద క్రమంగా వరద పెరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కు ప్రాణహిత వరద పోటెత్తడంతో 35 గేట్లు ఎత్తి, 165,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే తుపాకుల గూడెం వద్ద సమ్మక్క బరాజ్ కు గోదావరితో పాటు ఇంద్రావతి నది వరకు భారీగా వచ్చి చేరుతుండడంతో 33 గేట్లు ఎత్తి, లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరికి వదులుతున్నారు. వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 8.54 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. మరోవైపు రాష్ట్రంలో భారీ నుంతి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో అస్సలే బయటకు వెళ్లకూడదని అంటున్నారు. ఈక్రమంలోనే సీఎం శాంతి కుమారి మంగళవారం రోజు కలెక్ర్లు, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని అన్నారు. 

Published at : 19 Jul 2023 01:04 PM (IST) Tags: Telangana Tourism Telangana News Heavy Rains bogatha water falls Bogatha Water Falls News

ఇవి కూడా చూడండి

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

CPGET Seat Allotment: సెప్టెంబరు 29న సీపీగెట్‌ సీట్ల కేటాయింపు, ఈ తేదీలోగా జాయిన్ అవ్వాల్సిందే!

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

TSPSC: 'గ్రూప్‌-1' పరీక్షలో అవకతవకలు జరగలేదు, టీఎస్‌పీఎస్సీ వివరణ

Elections In Singareni: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు, వచ్చే నెల 28వ తేదీనే మహూర్తం ఫిక్స్

Elections In Singareni: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు, వచ్చే నెల 28వ తేదీనే మహూర్తం ఫిక్స్

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

Breaking News Live Telugu Updates: బాలాపూర్‌ లడ్డూ వేలం రికార్డు బ్రేక్ చేసిన రిచ్మండ్‌ విల్లా లడ్డూ

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది

BhagavanthKesari:  గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది