అన్వేషించండి

Warangal News: సంక్రాంతికి ఊరికి వెళ్లే వారు జాగ్రత్త.. పోలీసులకు సమాచారం ఇవ్వండి

సంక్రాంతి ఊరెళ్తున్నారా.. ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వండి. లేకుంటే తర్వాత జరిగే పరిణామాలకు బాధపడొద్దని అంటున్నారు పోలీసులు.

 సంక్రాంతి పండుగ పిల్లలకు సెలవులుండటంతో చాలా మంది ప్రయాణాలు చేస్తారు. ఇదే అదనుగా దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారు. ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. 'సంక్రాంతి పండుగ దృష్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. రాత్రి వేళల్లో వీధుల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ విషయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ప్రజలకు పలు సూచనలు చేశారు.

సంక్రాంతికి ఊరెళ్లే వారికి పోలీస్ కమిషనర్ చేస్తున్న సూచనలు 

👉🏻ఇంట్లో బంగారు నగలు, నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం. ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.

👉🏻ఊరు వెళ్తున్నప్పుడు ఇంటి పరిసరాలను గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. 

👉🏻విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కారులలో పెట్టొద్దు. కొందరు ఇంటి కీని కూడా ఇంటి బయట దాస్తుంటారు. అలాంటివి కూడా చేయద్దు.  

👉🏻ద్విచక్రవాహనాలు, కారులను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపరాదు. 

👉🏻బీరువా తాళాలను ఇంట్లో ఉంచొద్దు, తమతోపాటే తీసుకెళ్లాలి. 

👉🏻గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచడం మంచిది. 

👉🏻ఎక్కువ రోజులు విహారయాత్రల్లో ఉంటే పేపర్, పాల వారిని రావద్దని చెప్పాలి.

👉🏻పని మనుషులు ఉంటే రోజూ ఇంటి ముందు శుభ్రం చేయమని చెప్పాలి.

👉🏻విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకపోవడం మంచిది. 

👉🏻ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ వేయాలి.

👉🏻ఇంటి డోరకు సెంట్రల్ లాకింగ్ సిస్టంను ఏర్పాటు చేసుకోవడం సురక్షితం.

👉🏻వాచ్ మెన్ లేదా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.

👉🏻సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఇంటర్నెట్ అనుసంధానం చేసుకొని మీ మొబైల్‌లో చూసుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా లైవ్  చూసుకోవచ్చను.  

👉🏻ప్రజలు తమ ప్రాంతంలో గస్తీ ఏర్పాటుకు సహకరించాలి.

👉🏻పోలీసు స్టేషన్ నెంబర్, వీధుల్లో వచ్చే బీట్ కానిస్టేబుల్ నెంబర్ దగ్గర పెట్టుకోవాలి.

👉🏻ప్రజలు నిరంతరం పోలీసులతో సమన్వయంగా సహకరిస్తే చోరీలను నియంత్రించడం చాలా సులభం.
👉🏻 అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి.

 👉🏻ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలి.

👉🏻అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై 100 డయల్ లేదా వరంగల్ పోలీస్ కమిషనరేట్ వాట్సాప్ నెంబర్ 9491089257 కు సమాచారం ఇవ్వాలి.

Also Read: మరికొన్ని గంటల్లో నిశ్చితార్థం ఇంతలో సూసైడ్... ఖమ్మం లాడ్జ్ లో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

Also Read: మా చావుకు కారణం ఆ నలుగురే.. అస్సలు వదలొద్దు.. నిజామాబాద్ ఫ్యామిలీ సెల్ఫీ వీడియో వెలుగులోకి..

Also Read:  కాలు విరిగినట్టు తెగ బిల్డప్.. పిలిచి ఆరా తీస్తే అసలు గుట్టు బయటికి..

Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?

Also Read: ఏపీలో నైట్ కర్ఫ్యూ... థియేటర్లలో 50 శాతం సిట్టింగ్... కోవిడ్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABPMadhavi Latha Shoots Arrow At Mosque |Viral Video | బాణం వేసిన మాధవి లత... అది మసీదు వైపే వేశారా..?RK Roja Files Nomination | నగరిలో నామినేషన్ వేసిన రోజా... హాజరైన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిKiran Kumar reddy on Peddireddy | పెద్దిరెడ్డిపై మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Brs Mla: బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
బీఆర్ఎస్ కు మరో షాక్ - కాంగ్రెస్ లోకి మరో ఎమ్మెల్యే?
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిజైల్‌, భారత్‌ నుంచి తొలిసారి ఎగుమతి - ABP ఎక్స్‌క్లూజివ్ ఫొటోలు
Allu Arjun: బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
బాలీవుడ్ హీరోలను బీట్ చేసిన బన్నీ - 1000 కోట్లు ఏంటి సామి? నంబర్ వన్ రేసులో దూసుకెళ్తున్న బన్నీ
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
ఉదయం 11 గంటల సమయానికి 24.5% పోలింగ్, కొనసాగుతున్న తొలి విడత ఓటింగ్
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
నెలకు లక్ష రూపాయల స్కాలర్‌షిప్‌- తెలుగు విద్యార్థులకు స్వీట్ న్యూస్ చెప్పిన జపాన్‌
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Embed widget