By: ABP Desam | Published : 10 Jan 2022 02:26 PM (IST)|Updated : 10 Jan 2022 03:29 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
ఏపీలో నైట్ కర్య్ఫూ
రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా వైరస్ విస్తరిస్తోన్న విషయాన్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోవిడ్ సోకిన వారికి దాదాపుగా స్వల్పలక్షణాలు ఉంటున్నాయని అధికారులు తెలిపారు. కోవిడ్ కొత్త వేరయంట్ ఒమిక్రాన్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం జగన్ ఆరా తీశారు. ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీచేశారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందుల కిట్ లను సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి అన్నారు. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలన్నారు. అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.
Also Read: సినిమా వాళ్లు బలిసికొట్టుకుంటున్నారు... వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు !
కోవిడ్ కేర్ సెంటర్లు సిద్ధం చేయండి
104 కాల్ సెంటర్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఎవరు కాల్ చేసినా వెంటనే స్పందించేంది చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లను కూడా సిద్ధం చేయాలన్నారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేయాలన్నారు. కోవిడ్ నివారణ చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలన్నారు. మాస్క్‌లు ధరించకపోతే జరిమానా విధించాలని అధికారులను ఆదేశించారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలన్నారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించేలా చర్యలు చేపట్టాలన్నారు.
Also Read: సినిమా టిక్కెట్ రేట్ల కాన్సెప్ట్ బస్ టిక్కెట్లకు వర్తించదా !? ఏపీ ప్రభుత్వం ఎలా సమర్థించుకుంటుంది ?
నైట్ కర్ఫ్యూ
బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో 100 మందికి మించకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు. థియేటర్లలో సగం కెపాసిటీతో అనుమతించాలన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ ఉంచాలని అధికారులను ఆదేశించారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో కూడా భౌతిక దూరం పాటించేలా, మాస్క్ ధరించేలా చూడాలన్నారు. ఈ మేరకు మార్గదర్శకాలు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించారు.
Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..
వైద్య పరికాలను పరిశీలించిన సీఎం జగన్
సీఎం క్యాంప్ కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి, వాటి పనితీరును సీఎం వైఎస్ జగన్ ఆరా తీశారు. దాదాపు 20 రకాలకు పైగా హై ఎండ్ ఎక్విప్‌మెంట్ పనితీరును సీఎంకి డాక్టర్లు వివరించారు. వీటితో పాటు మెడికల్ కాలేజీల నిర్మాణ పనుల పురోగతి, పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం జగన్ పరిశీలించారు. ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్లను వర్చువల్ విధానంలో క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్‌పీఎం సామర్ధ్యం గల 144 పీఎస్‌ఏ ప్లాంట్లతో సహా క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్‌ఎంఓ ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు ఇతర మౌలిక సదుపాయాలను సీఎం ప్రారంభించారు. సీఎం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Srikakulam News : ఏపీలో మరో పోలీసు సూసైడ్, ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!
Ravela Kishore Resign To BJP : ఏపీ బీజేపీకి ఎదురు దెబ్బ - పార్టీ ఉపాధ్యక్షుడు రాజీనామా !
Ayyanna Vs Ambati Twitter : అంబటి వర్సెస్ అయ్యన్న - ట్విట్టర్లో రచ్చ రచ్చ
Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
YSR Rythu Bharosa Scheme : చంద్రబాబుపై దత్తపుత్రుడికి విపరీతమైన ప్రేమ, వ్యవసాయం దండగన్న నాయకుడ్ని ఎందుకు ప్రశ్నించలేదు : సీఎం జగన్
Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి
Sithara Ghattamaneni: సితార క్యూట్ ఫోటోలు చూశారా?
NTR Birth Centenary Celebrations: ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రారంభించనున్న నందమూరి బాలకృష్ణ
777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?