News
News
X

Warangal: అధైర్యపడొద్దు అండగా ఉంటాం... పంట నష్టాన్ని పరిశీలించిన మంత్రులు... మిర్చి రైతులను ఆదుకుంటామని హామీ

అకాల వర్షాలకు వరంగల్ జిల్లాలో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పరకాల నియోజకవర్గంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, అధికారులు పర్యటించారు. పంటనష్టాన్ని పరిశీలించారు.

FOLLOW US: 

నోటికొచ్చిన మిర్చి నేలరాలిందని, రైతుల అధైర్యపడొద్దు అండగా ఉంటామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల పంట నష్టాన్ని పరిశీలిస్తున్నామని మంత్రులు అన్నారు. పరకాల నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు పలునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ పర్యటించారు. పంట నష్టాన్ని పరిశీలించారు. 

సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం

అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... నర్సంపేట, పరకాల, భూపాలపల్లి, మంథనిలో మిర్చి దెబ్బతిందన్నారు. తెలంగాణ సర్కార్ రైతులకు అండగా నిలుస్తుందని రైతులకు హామీ ఇచ్చారు. దేశ పాలకుల అసంబద్ధ విధానాల మూలంగా రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. దేశంలో వ్యవసాయ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయన్నారు. రైతుకు వెన్నుదన్నుగా నిలిచింది కేసీఆర్ సర్కార్ అన్నారు. ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలవుతున్నాయని గుర్తుచేశారు. రైతు బంధు ఎనిమిదో విడతతో కలిపి రూ.50 వేల కోట్లు నిధులు రైతుల ఖాతాలలో వేశామన్నారు.  అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతుల పంటల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారన్నారు. రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పంట నష్టం వివరాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Also Read: ములుగు జిల్లాలో ఎదురుకాల్పులు... నలుగురు మావోయిస్టుల మృతి

మిర్చి రైతుల పరిస్థితి బాధాకరం 

మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడుతూ... బాధితులందరికీ న్యాయం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టామన్న ఆయన.. మిర్చి రైతుల పరిస్థితి బాధాకరమన్నారు.  చేతికొచ్చిన పంట నేలపాలయ్యిందన్నారు. రైతులు ధైర్యంగా ఉండాలని, సీఎం కేసీఆర్ రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు. పరకాల, నర్సంపేట, భూపాలపల్లి పరిధిలో ఎక్కువ నష్టం జరిగినట్లు మంత్రి అన్నారు. 

Also Read: అదే జరిగితే మిత్రపక్షం ఎంఐఎంకి కేసీఆర్ ద్రోహం చేసినట్లే.. రేవంత్ రెడ్డి

అంతకు ముందు
పరకాల నియోజకవర్గం పరకాల, నడికూడ మండలాల్లోని నాగారం, మల్లక్కపేట, నడికూడ గ్రామాలలో మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, నిరంజన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది. వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. మంత్రులను చూడగానే బాధిత రైతులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పంట నష్టపోయిన ప్రతీ రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 

Also Read: చెల్లి శవంతో నాలుగు రోజులుగా ఇంట్లోనే అక్క.. అది కుళ్లడంతో చివరికి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Jan 2022 03:33 PM (IST) Tags: warangal TS News mirchi farmers minister niranjanreddy parakala

సంబంధిత కథనాలు

వెయ్యి కిలోమీటర్లు దాటిన

వెయ్యి కిలోమీటర్లు దాటిన "ప్రజాసంగ్రామ యాత్ర"

KTR : ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

KTR :  ఆసియా లీడర్స్ మీట్‌కు కేటీఆర్ - ఆహ్వానం పంపిన ప్రతిష్టాత్మక సంస్థ !

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Breaking News Live Telugu Updates: కాంగ్రెస్‌కు మరో షాక్! రేవంత్ పై మర్రి శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

30వేల మంది విద్యార్థులతో మెగా ఈవెంట్- మల్లారెడ్డి యూనివర్సిటీ రికార్డు ప్రోగ్రామ్!

30వేల మంది విద్యార్థులతో మెగా ఈవెంట్- మల్లారెడ్డి యూనివర్సిటీ రికార్డు ప్రోగ్రామ్!

TS Congress : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

TS Congress  : కాళేశ్వరం చూస్తామంటే ఎందుకంతే భయం ? ఏదో దాచి పెడుతున్నారని టీఆర్ఎస్ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ !

టాప్ స్టోరీస్

YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

YSRCP Vs Janasena :  వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Common Charging Port: మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ అన్నిటికీ ఒకే చార్జర్లు - కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

Munugode Bypoll : రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల దండయాత్ర - మునుగోడు ముందు మునిగిపోతున్న టీ కాంగ్రెస్ !

Munugode Bypoll : రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల దండయాత్ర - మునుగోడు ముందు మునిగిపోతున్న టీ కాంగ్రెస్ !

Tendulkar On Vinod Kambli: చేతిలో డబ్బుల్లేవ్- ఏదైనా పని ఇవ్వండి- క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ వేడుకోలు

Tendulkar On Vinod Kambli: చేతిలో డబ్బుల్లేవ్- ఏదైనా పని ఇవ్వండి- క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లీ వేడుకోలు