Warangal: టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరి కడతారు... ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారు... హన్మకొండ సభలో బీజేపీ నేతలు

నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై 317 జీవో నీళ్లు జల్లిందని బీజేపీ నేతలు ఆరోపించారు. నిజాం పాలన అంతం అయినట్లు కేసీఆర్ పాలన అంతం అవుతుందన్నారు.

FOLLOW US: 

వరంగల్ జిల్లా హన్మకొండలో బీజేపీ  ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, నిరుద్యోగుల నిరసన సభ చేపట్టింది. ఈ సభలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ కీలక నేతలు పాల్గొన్నారరు. ఈ సభలో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పోలీసులతో బీజేపీని ఆపాలని టీఆర్ఎస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతోందన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఎప్పుడైనా వెళ్లొచ్చన్న ఆయన.. ఈసారి కేసీఆర్ ను డబ్బులు, పోలీసులు కాపడలేరన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలవాలని కేసీఆర్ ప్రయతిస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గోరి కడతారని విమర్శించారు. మీడియా మొత్తాన్ని కేసీఆర్ కొనేశారని, యూట్యూబ్ ఛానెళ్లను బెదిరిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు తొడగొట్టి నిలిచే ప్రజలన్న ఈటల అణచివేతకు గురిచేస్తే తిరగబడతారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీకి అండగా అన్ని రాష్ట్రాల బీజేపీ సీఎంలు, ప్రధాని అండగా ఉన్నారన్నారు. 

Also Read: ఖమ్మం కాంగ్రెస్‌లో అసలేంటి ఈ పరిస్థితి! తర్జనభర్జనలు పడుతున్న రాష్ట్ర నాయకత్వం

317 జీవోతో కుటుంబాలను విడదీస్తున్నారు : లక్ష్మణ్

ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ... 'నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై 317 జీవో నీళ్లు జల్లింది. ఈ అంశం పై బండి సంజయ్ దీక్ష చేస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ధర్మ యుద్ధంలో మొదటి విడతలో బీజేపీ గెలిచింది. తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించేందుకు బీజేపీ జాతీయ నాయకులు పర్యటనలు చేపట్టారు. ఏ స్థానికత అంశంపై రాష్టం ఏర్పడిందో అందుకు వ్యతిరేకంగా 317 జీవో అమలు చేస్తున్నారు. కొలమానం లేకుండా నూతన జిల్లాలు ఏర్పాటు చేశారు. 317 జీవోతో కుటుంబాలను విడదీస్తున్నారు. ఉద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. నోటిఫికేషన్ లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారు. అక్రమ అరెస్ట్ లతో బీజేపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలను ఆపలేరు.' 

Also Read:  పెద్దోళ్లను ఎదిరించి లవర్‌ను దక్కించుకున్న ప్రియుడు.. యువతి కోరిక నచ్చక ఘాతుకం

కేసీఆర్ ను జైల్లో పెట్టడం ఖాయం : బండి సంజయ్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ... 'కేసీఆర్ అత్యంత అవినీతి పరుడు. కేసీఆర్ ను జైల్లో పెట్టడం ఖాయం. 317 జీవోతో ఉద్యోగులను కష్టాలకు గురిచేస్తున్నారు. భార్యాభర్తలను విడదీసిన పాపం కేసీఆర్ ది. ఇప్పటి వరకు 8 మంది ఉద్యోగులు చనిపోయారు. ఉద్యోగుల కోసం ఎంత వరకైనా పోరాడుతాం. 2023లో బీజేపీ అధికారంలోకి రాబోతుంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 317 జీవో ను రద్దు చేస్తాం. ఉద్యోగులకు, పెన్షన్ల దారులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు. చైనా లాంటి కమ్యూనిస్ట్ దేశాలను కేసీఆర్ సపోర్ట్ చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన టీఆర్ఎస్ మెడలు వంచి తీరుతాం. బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. కార్యకర్తలకు భరోసా ఇవ్వండని చెప్పారు. కోవిడ్ నిబంధనలు సవరించక హైదరాబాద్ లో లక్షల మందితో సభ నిర్వహిస్తాం. 

Also Read:  ఒమిక్రాన్ - డెల్టా రకాల లక్షణాలతో కొత్త వేరియంట్ ‘డెల్టాక్రాన్’,ఏ దేశంలో బయటపడిందంటే...

కేసీఆర్ కు ప్రజల మద్దతు లేదు : అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ... 'బండి సంజయ్ మాటల్లో ఉద్వేగం తెలుస్తోంది. తెలంగాణ కంటే అస్సాం ఆర్థికంగా వెనక ఉన్నప్పటికీ పాలన బాగా ఉంది. అస్సాంలో లక్ష మందికి ఏడాదిలో ఉద్యోగులు కల్పించాం. ప్రజల కోసం కేసీఆర్ కు చింత లేదు ఆయన పిల్లల కోసం ప్రాధేయపడుతున్నారు. కేసీఆర్ కు కేవలం పోలీసుల సపోర్ట్ మాత్రమే ఉంది. ప్రజల మద్దతు ఏ మాత్రం లేదు.
బాబర్ ఎలా అంతం అయ్యాడో ఓవైసీ కూడా అలాగే అంతం అవుతారు. నిజాం పాలన అంతం అయినట్టుగా కేసీఆర్ పాలన అంతం అవుతుంది. కేసీఆర్ తన వారసుడిని సీఎం చేయాలి అనుకుంటున్నారు. 
డబ్బుతో ఈటల రాజేందర్ ను ఓడించాలని చూశారు. డబ్బుతో అధికారంలోకి రాలేరు.  కేసీఆర్ ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.' 

Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...! 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: BJP telangana news cm kcr Bandi Sanjay Etela Rajender Hanumkonda bjp meet 317 G.O

సంబంధిత కథనాలు

Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

Breaking News Live Updates: ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య 

Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

Child Marriage : బర్త్ డే వేడుకల ముసుగులో బాల్య వివాహం, 12 ఏళ్ల బాలికకు 35 ఏళ్ల వ్యక్తితో పెళ్లి

Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!

Lovers Death: కొద్దిరోజుల్లోనే పెళ్లి, యాక్సిడెంట్‌లో ప్రియుడు మృతి - ప్రియురాలు షాకింగ్ నిర్ణయం!

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఇంకో 4 రోజులు వానలే! నేడు ఈ జిల్లాల వారికి అలర్ట్

Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ఇంకో 4 రోజులు వానలే! నేడు ఈ జిల్లాల వారికి అలర్ట్

Petrol-Diesel Price, 16th May: వాహనదారులకు హ్యాపీ ! చాలా చోట్ల స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఇక్కడ మాత్రం స్థిరం

Petrol-Diesel Price, 16th May: వాహనదారులకు హ్యాపీ ! చాలా చోట్ల స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు, ఇక్కడ మాత్రం స్థిరం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి

Gun Violence In USA: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత- ముగ్గురు మృతి

PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన

PM Modi in Nepal: నేపాల్ పర్యనటలో మోదీ- ప్రముఖ బౌద్ధ క్షేత్రం సందర్శన

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

777 Charlie Telugu Trailer: ఓ మనిషి జీవితాన్ని కుక్క ఎలా మార్చింది? - 'చార్లి' ట్రైలర్ చూశారా?

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !

Telangana Politics: మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ ? జాతీయ పార్టీల టార్గెట్‌గా కేసీఆర్ !