అన్వేషించండి

Telangana Election 2023: ఓటర్లకు బిగ్ అలర్ట్ - 'లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోండి'

ఓటర్ ఐడీ ఉన్నా కూడా ఓటర్ల జాబితాలో పేరు సరి చూసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ ఓటర్లకు సూచించారు.

Telangana Elections 2023 Voters List:

ఓటర్లు అప్రమత్తంగా ఉండి జాబితాలో తమ పేరును చెక్ చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. 'ఓటర్ ఐడీ కార్డు ఉన్నంత మాత్రాన మీ ఓటు ఉందని భావించవద్దు. జాబితాలో మీ పేరును రీ చెక్ చేసుకోవాలి' అని స్పష్టం చేశారు. హైకోర్టులో స్వీప్ యాక్టివిటీ కింద ఏర్పాటు చేసిన రీ చెక్ యువర్ ఓటు కౌంటర్ ను డిప్యూటీ డీఈవో అనుదీప్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, సిబ్బందితో మాట్లాడి ఓటరు జాబితాలో తమ పేరు ఎలా చెక్ చేసుకోవాలో అవగాహన కల్పించారు. https://voters.eci.gov.in/ లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఇతర సందేహాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950ను సంప్రదించాలని స్పష్టం చేశారు.

ముందస్తు అనుమతి తప్పనిసరి

రాజకీయ పార్టీలు సమావేశాలు, ర్యాలీల నిర్వహణ కోసం సువిధ యాప్‌ ద్వారా ముందస్తు అనుమతులు తీసుకోవాలని, 24 గంటల్లోగా దరఖాస్తులను పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన వీవీఐపీలు, వీఐపీల పర్యటన సమయంలో స్థానిక పోలీస్‌ అధికారులతో పాటు పార్టీ నాయకులు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు, ముఖ్య అతిథులకు ఇబ్బందులు కలుగకుండా సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. జిల్లాలో సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ తెలిపారు.

తెలంగాణ సహా మరో నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ సాధారణ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్ గుర్తింపు నిర్ధారణ విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేస్తూ సీఈసీ ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధాన అధికారులకు ఇటీవల లేఖ రాసింది.

ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి (Model Code of Conduct)ని కచ్చితంగా అమలు చేసి ఎన్నికల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని జిల్లా ఎన్నికల అధికారి, రొనాల్డ్ రోస్ అధికారులకు సూచించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చినా, మీడియాలో ఫేక్‌ న్యూస్‌ ప్రసారమైనా, ఓటర్లు ఏదైనా సందేహాల నివృత్తికి, సమాచారం కోసం సంప్రదించిన వెం టనే స్పందించాలని చెప్పారు. సి-విజిల్‌ ఫిర్యాదులను వంద నిమిషాల్లో పరిష్కరించాలన్నారు.

ఎక్కడైనా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే వెంటనే క్షేత్రస్థాయిలో ప్లయింగ్‌ స్వ్కాడ్‌లను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతీ విభాగానికి వేర్వేరుగా రికార్డులను నిర్వహించాలన్నారు. ఆయా బృందాలతో శాసనసభ నియోజకవర్గాల వారీగా విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అధికారులు ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అధికారులు ఎలాంటి అలసత్వం, నిర్లక్ష్యం లేకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికారులు ఎన్నికల సంబంధిత ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు కానుకల పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సీ విజిల్‌ యాప్‌ ద్వారా అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget