Vikarabad: మంత్రి సమక్షంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ బాహాబాహీ... ప్రోటోకాల్ పాటించలేదని అడిషనల్ కలెక్టర్ పై ఎమ్మెల్సీ ఫైర్
వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు తలెత్తాయి. ప్రోటోకాల్ విషయంలో వివాదం తలెత్తి ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ మంత్రి సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు.
మంత్రి ముందే టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్సీ-ఎమ్మెల్యేల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తి వేదికపైనే తిట్టుకున్నారు. స్టేజ్ పై ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్ పర్సన్ కూర్చోవడంతో ఎమ్మెల్యే వర్గీయులు మంత్రి ముందే రభస చేశారు. ప్రోటోకాల్ సరిగ్గా పాటించలేదని అదనపు కలెక్టర్ చంద్రయ్య పై ఎమ్మెల్సీ సీరియస్ అయ్యారు.
Also Read: తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే?
ప్రోటోకాల్ విషయంలో వివాదం
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో.. నియోజకవర్గంలోని పంచాయతీలకు దోమల నివారణ కోసం ఫాగింగ్ మిషన్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణి దేవి హాజరయ్యారు. సభ ప్రారంభం అయ్యే ముందే ఎమ్మెల్యే వర్గీయులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ప్రతిసారి వివిధ కార్యక్రమాల్లో ఈ విధంగానే జరుగుతుందని మంత్రి ముందే ఇరువర్గాల వారు వాగ్వాదానికి దిగారు. దీంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు స్థానిక కౌన్సిలర్ కూడా తమకు కార్యక్రమం గురించి సమాచారం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టౌన్ లో నిర్వహించే సభలకు తమను ఆహ్వానించకుండా అవమానానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: నూతన సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ మధ్య వర్గ విభేదాలు
వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బాహాబాహీకి దిగారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందే ఇరువురు వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు పరస్పరం గొడవకు దిగారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ వర్గీయులు బైఠాయించి నిరసన తెలియజేశారు. మంత్రి సబితా సర్ధిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Also Read: వచ్చే దసరాకు పాలనలో కొత్త వెలుగులు... రెడీ అవుతున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !
Also Read: అమరావతి రైతుల భోజన ఏర్పాట్లు చేస్తున్న పొలం దున్నేసిన దండగులు ! వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనేనని ఆరోపణలు !
Also Read: OTS Issue: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి