Amaravati Padayatra : అమరావతి రైతుల భోజన ఏర్పాట్లు చేస్తున్న పొలం దున్నేసిన దండగులు ! వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనేనని ఆరోపణలు !
అమరావతి రైతులకు సాయం చేసినందుకు అట్రాసిటీ కేసులు పెడతామని వేధిస్తున్నారని చిత్తూరు జిల్లా రైతు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఆయన రైతుల భోజనాలు చేయడానికి తన స్థలాన్ని ఇచ్చారు.
![Amaravati Padayatra : అమరావతి రైతుల భోజన ఏర్పాట్లు చేస్తున్న పొలం దున్నేసిన దండగులు ! వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనేనని ఆరోపణలు ! Disruptions to Amravati farmers in Chittoor district - YSRCP leaders plowing a dining area Amaravati Padayatra : అమరావతి రైతుల భోజన ఏర్పాట్లు చేస్తున్న పొలం దున్నేసిన దండగులు ! వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనేనని ఆరోపణలు !](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/07/6f094ea040263cc379cc8cfc7eb2b510_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పాదయాత్ర చిత్తూరు జిల్లాకు చేరింది. ఏర్పేడు మండలం ఎంపేడు గ్రామం వద్ద అమరావతి రైతులు భోజనం చేసేందుకు రవీంద్రనాథ్ రెడ్డి అనే రైతు స్థలం ఇచ్చారు. అయితే రాత్రికి రాత్రి కొంత మంది ఆ పొలాన్ని దున్నేశారు. అమరావతి రైతులకు సహకరిస్తే అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరించారని.. వారే రాత్రికి రాత్రి తన పొలాన్ని దున్నేశారని రైతు రవీంద్ర నాథ్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంత మంది నేతలు తనను బెదిరించారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రైతులు భోజన ఏర్పాట్లు చేసుకునేందుకు స్థలం ఇస్తే.. అలాంటి పరిస్థితి లేకుండా దున్నేశారని.. తనపై దౌర్జన్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మా భూముల్లో అమరావతి రైతులకు భోజనం పెడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. అమరావతి రైతుల పాదయాత్రకు మొదటి నుంచి ఓ వైపు పోలీసుల నుంచి మరో వైపు అధికార పార్టీ నేతల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. పలు చోట్ల లాఠీ చార్జ్ జరిగింది. అనేక చోట్ల వారికి భోజనాలకు కూడా స్థలం.. కేటాయించకపోవడం... వంట వండుకునే అవకాశం లేకుండా చేయడం వంటివి చేయడం కలకలం రేపాయి.
Also Read: OTS Issue: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..
చిత్తూరు జిల్లాలో అడుగు పెట్టడంతోనే ఇలాంటి పరిస్థితి ఎదురు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అనేక మంది స్వచ్చందంగా రైతులకు సంఘిభావం తెలుపుతూ.. సౌకర్యాలు కల్పిస్తున్నా.. వారిని అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారని.. కేసులు పెడతామని బెదిరించి.. ఎవరూ సాయం చేయకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపణలపై వైఎస్ఆర్‌సీపీ నేతలెవరూ స్పందించలేదు.
చిత్తూరు జిల్లాలో ప్రారంభమైన పాదయాత్ర తిరుపతికి చేరుకున్న తర్వాత బహిరంగసభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే పోలీసులు బహిరంగసభకు ఇంత వరకూ పర్మిషన్ ఇవ్వలేదు. కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.
Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)