అన్వేషించండి

Niranjan Reddy Open Letter: తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ.. ఏం చెప్పారంటే?

తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కార్పొరేట్లకు ఇస్తున్న సహకారాన్ని.. రైతులకు ఇవ్వడం లేదని.. లేఖలో ప్రస్తావించారు.


తెలంగాణ ఉద్యమం మొదలైందే.. నీళ్ల కోసమని.. మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సమైక్య రాష్ట్రంలో దాదాపు 22 లక్షల బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో వానలు రాక, కరెంటు లేక, సాగు నీరు అందక నిత్యం యుద్ధం చేస్తున్న పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి పరిస్థితులలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే సమస్యల పరిష్కారానికి మార్గమని నమ్మి ముఖ్యమంత్రి కేసీఆర్ మలి దశ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారని లేఖలో నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. 14 ఏళ్ల సుధీర్ఘ ఉద్యమం, అనేక మంది అమరుల త్యాగాలు, ప్రజల అండదండలతో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, ప్రజాస్వామ్యబద్దంగా పార్లమెంటును ఒప్పించి  తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని లేఖలో చెప్పారు. 

లేఖలో మంత్రి నిరంజన్ రెడ్డి ఏం చెప్పారంటే..
సుమారు ఆరు దశాబ్దాల పాటు సమైక్య పాలకుల వివక్ష మూలంగా తెలంగాణ రైతాంగం ఎంత నష్టపోయిందన్న విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి స్పష్టమయిన అవగాహన ఉంది. వ్యవసాయమే వృత్తిగా దాదాపు 60 శాతం మంది జనాభా ఆధారపడిన ఈ రంగాన్ని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో .. తెలంగాణ రాష్ట్ర ఫలాలు వీరికే మొదట అందాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టిసారించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టి మూడున్నరేళ్లలో పూర్తి చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రస్తుతం 70 శాతం పైగా పూర్తయ్యాయి. సీతారామ సాగర్ ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. 

వ్యవసాయ అనుకూల విధానాలు
ఆకలిచావులు, ఆత్మహత్యలు, వలసలతో సమైక్య రాష్ట్రంలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వ్యవసాయానికి దూరమైన రైతాంగానికి  సాగునీరు  అందించడం ఒక్కటే సమస్య పరిష్కారానికి మార్గం కాదని కేసీఆర్భావించారు. రైతులకు ఆత్మస్థైర్యం కల్పించి ధైర్యంగా వ్యవసాయం చేసేందుకు దేశంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలకు శ్రీకారం చుట్టారు.  

సాగు నీరు అందించడంతో పాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా, పంట పెట్టుబడి కోసం రైతు వడ్డీ వ్యాపారుల ముందు చేయిచాచకుండా ఉండేందుకు ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు అందించే రైతుబంధు పథకం ఉంది.  వ్యవసాయమే జీవితంగా జీవిస్తున్న రైతు ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి రూ.5 లక్షలు అందించేలా రైతు భీమా పథకం, పంటల రుణమాఫీ, రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు సమితుల ఏర్పాటు చేశాం.  ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలతో ఏడేళ్లలో తెలంగాణ వ్యవసాయరంగ ముఖచిత్రం సంపూర్ణంగా మారిపోయింది. ఏడేళ్ల క్రితం ఆకలిచావులతో అల్లాడిన తెలంగాణ అన్నపూర్ణగా మారింది. తిండిగింజలకు తండ్లాడిన తెలంగాణ ధాన్యపురాశులతో కళకళలాడుతున్నది.  ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యవసాయ అనుకూల విధానాల మూలంగానే ఈ విజయం సాధ్యమైంది.

అనూహ్యంగా పెరిగిన సాగు, పంటల దిగుబడి
తెలంగాణ వచ్చేనాటికి రెండు సీజన్లు కలిపి సాగుకు యోగ్యమైన భూమి 1 కోటి 31 లక్షల ఎకరాలు. 2020-21 సంవత్సరం నాటికి అన్ని పంటలు కలిపి సాగు విస్తీర్ణమైన భూమి 2 కోట్ల 15 లక్షల ఎకరాలు. నూతనంగా 84  లక్షల ఎకరాలలో సాగు మొదలయింది. ఈ ఏడేండ్ల కాలంలో సాగువిస్తీర్ణం 50 శాతానికి పైగా పెరిగింది.  అలాగే 2014-15 లో వరి సాగు విస్తీర్ణం రెండు పంటలు కలిపి 34.96 లక్షల ఎకరాలు మాత్రమే ఉండగా, 2020-21 నాటికి 198.15 % పెరిగి 104.23 లక్షల ఎకరాలకు చేరుకున్నది. 2014-15 లో వరి ధాన్యం దిగుబడి 68.17 లక్షల టన్నులు మాత్రమే ఉండగా, 2020-21 నాటికి అనూహ్యంగా సుమారు 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. 

తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014-15 సంవత్సరంలో 24.30 లక్షల టన్నుల వరిధాన్యం సేకరించగా. 2020-21 సంవత్సరంలో (480.25 శాతం వృద్ధి) 116.70 లక్షల టన్నులు పెరిగి 141.00 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించడమైనది. 2020-21 వానాకాలం మరియు యాసంగి లో ప్రభుత్వం ప్రతి సీజన్ లో 6,967 కేంద్రాల ద్వారా రైతుల కల్లాల వద్దే 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ముఖ్యంగా దొడ్డు వడ్లు సాగు పెరగడానికి కారణం కేంద్రం అనుసరిస్తున్న విధానాలే కావడం గమనార్హం. పారాబాయిల్డ్ రైస్ వినియోగానికి తగినట్లు ఉత్పత్తి లేనందున దేశంలో సన్న రకాల కన్నా అధిక దిగుబడులు ఇచ్చే దొడ్డు రకాలకు అధిక మద్దతుధర ఇచ్చి, వాటిని సేకరిస్తూ వచ్చిన కేంద్రం రైతులను ప్రోత్సహించింది. దిగుబడితో పాటు అధికధర లభించడం మూలంగా దశాబ్దాలుగా రైతాంగం దొడ్డు వడ్ల సాగుకు మొగ్గుచూపింది.

పెరిగిన సాగు విస్తీర్ణం, దిగుబడులకు అనుగుణంగా పంటల సేకరణకు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందిస్తూ వస్తున్నది. క్షేత్రస్థాయిలో వివిధ పంటల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ముందే బ్యాంకుల ద్వారా నిధులు సేకరించి, యంత్రాంగాన్ని సమాయాత్తం చేసి, మౌళిక సదుపాయాలు కల్పిస్తుంది. ధాన్యం సేకరణ అనంతరం ఆరు నెలల తర్వాత కేంద్రం రైతులకు నిధులు విడుదల చేస్తుంది. అదే సమయంలో కేంద్రంతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్రం ధాన్యం కొనుగోలు చేసిన పది రోజుల లోపు రైతుల ఖాతాలలో నిధులు జమచేస్తూ వడ్డీభారాన్ని కూడా  మోస్తున్నది. కరోనా విపత్తు సమయంలోనూ తెలంగాణ ప్రభుత్వం గ్రామ గ్రామాన రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ చేసింది. ఎఫ్ సీ ఐకి గోదాముల సామర్థ్యం లేకున్నా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ గోదాంలతో పాటు ఫంక్షన్ హాళ్లు, రైతు వేదికలు, రైస్ మిల్లులు, పత్తి మిల్లులు, స్కూళ్లు, కళాశాల భవనాలు తదితర స్థలాలను ధాన్యం నిల్వకు ఉపయోగించడం జరిగింది.

తెలంగాణ ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరణ
కేంద్రప్రభుత్వం తెలంగాణలోని యాసంగి ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేసింది. ఆరు నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో వానాకాలంలో మాత్రమే వరి పంట సాగుచేస్తారు. తెలుగు రాష్ట్రాలలో వానాకాలంతో పాటు యాసంగిలో వరి విస్తారంగా సాగు చేస్తారు. ముఖ్యంగా తెలంగాణలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి ధాన్యంలో ఎక్కువగా దొడ్డు రకాలే సాగుచేస్తారు. సన్న వడ్ల సాగులో పెట్టుబడి అధికంగా ఉండడంతో పాటు దిగుబడి తక్కువగా రావడం, మద్దతు ధర ఆశించినంతగా లేకపోవడం మూలంగా దొడ్డు రకాలను మాత్రమే సాగుచేస్తారు. దొడ్డు రకాలను బియ్యంగా మార్చినప్పుడు యాసంగి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నూక శాతం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో, నూక శాతం తగ్గించడానికి బాయిల్డ్ రైస్ రూపంలో ఎఫ్ సీ ఐ సేకరిస్తూ వస్తున్నది. అయితే ఈ ఏడాది యాసంగి నుండి తెలంగాణలో బాయిల్డ్ రైస్ సేకరించలేమని హఠాత్తుగా ప్రకటించి.. తెలంగాణ రైతాంగానికి షాక్ ఇచ్చింది. దేశంలో పార బాయిల్డ్ రైస్ వినియోగం తగ్గిందని,  బియ్యం నిల్వలు పెరిగిపోయాయన్నది కేంద్రప్రభుత్వ వాదన.

Also Read: MLC Elelctions: రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్... క్యాంపు రాజకీయాలపై దర్యాప్తు... ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్

Also Read: Ganja: గంజాయి తరలిస్తున్న అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు అరెస్టు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
AP Telangana Latest Weather Updates: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం- పంట నష్టపోయి తలపట్టుకున్న రైతులు- చలితో వణికిపోతున్న జనం 
Tirumala: జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు- తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ 
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Embed widget