అన్వేషించండి

MLC Elelctions: రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్... క్యాంపు రాజకీయాలపై దర్యాప్తు... ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్

రేపు జరిగే స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. అయితే క్యాంపు రాజకీయాలపై అధికారులు దర్యాప్తు చేశారన్నారు.

తెలంగాణలో శుక్రవారం స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. తమ సభ్యులు ప్రలోభాలకు లోనుకాకుండా వారందరినీ ట్రిప్పులకు తీసుకెళ్లారు. బెంగళూరు, నర్సాపూర్‌, ఊటీ, దిల్లీ, మైసూర్‌లలో పార్టీలు క్యాంపులు ఏర్పాటుచేసినట్లు తెలిసింది. ఈ క్యాంపుల్లో సభ్యులు ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు, వీడియో ఇటీవల నెట్టింట హల్ చేశాయి. అయితే ఈ క్యాంపు రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ స్పందించారు. 

క్యాంపు రాజకీయాలపై ఫిర్యాదు అందలేదు  

తెలంగాణలో శుక్రవారం జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ తెలిపారు. ప్రతి పోలింగ్‌ స్టేషన్‌లో వెబ్‌కాస్టింగ్‌, వీడియో ద్వారా పోలింగ్‌ ప్రక్రియను రికార్డు చేస్తామన్నారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని తెలిపారు. ఓటరు స్లిప్పులను ఇప్పటికే ఓటర్లకు పంపిణీ చేశామని చెప్పారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలింగ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని శశాంక్‌ గోయల్‌ వివరించారు. ఓటర్లు మాస్క్‌ ధరించి పోలింగ్‌ కేంద్రానికి రావాలని కోరారు. పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు. క్యాంపు రాజకీయాలపై ఇప్పటి వరకూ ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. అయితే క్యాంపు రాజకీయాలపై అధికారులు దర్యాప్తు చేశారని శశాంక్‌ గోయల్‌ చెప్పారు. 

Also Read: పార్లమెంటులో వాళ్లదంతా ఉత్తుత్తి పోరాటం.. టీఆర్ఎస్, బీజేపీది కుమ్మక్కు రాజకీయం

ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం

రేపు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఖమ్మం కలెక్టర్ పీవీ గౌతమ్ వివరించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో 84 మంది, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 221 మంది, కల్లూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 115 మంది, ఖమ్మం రెవెన్యూ డివిజన్ కార్యాలయం పోలింగ్ కేంద్రంలో 348 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 314 మంది పురుషులు, 454 మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రాచలం పోలింగ్ కేంద్రంలో 9 మంది జడ్పీటీసీలు, 75 మంది ఎంపీటీసీలు, కొత్తగూడెం పోలింగ్ కేంద్రంలో 60 మంది కౌన్సిలర్లు, 14 మంది జడ్పీటీసీలు, 145 మంది ఎంపీటీసీలు, ఇద్దరు ఎక్స్ అఫీసియో సభ్యులు, కల్లూరు పోలింగ్ కేంద్రంలో 23 మంది కౌన్సిలర్లు, 6 గురు జడ్పీటీసీలు, 85 మంది ఎంపీటీసీలు, ఒక్కరు ఎక్స్ అఫీసియో సభ్యులు, ఖమ్మం పోలింగ్ కేంద్రంలో 60 మంది కార్పొరేటర్లు, 42 మంది కౌన్సిలర్లు, 16 మంది జడ్పీటీసీలు, 224 మంది ఎంపీటీసీలు, 6 గురు ఎక్స్ అఫీసియో సభ్యులు ఉన్నట్లు కలెక్టర్ వివరించారు. 

Also Read: Also Read: జడ్పీటీసీ హత్య కోసం భారీ కుట్ర.. భగ్నం చేసిన సూర్యాపేట పోలీసులు, వెలుగులోకి ఇలా..

కరీంనగర్ లో... 

కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. పోలింగ్, కౌంటింగ్ జరగనున్న ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కర్ణన్ తో పాటు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ గురువారం సందర్శించారు. సిబ్బందికి పోలింగ్ విధానంపై పూర్తిస్థాయిలో శిక్షణ అందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందుకుగాను 8 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. కరీంనగర్, హుజురాబాద్ జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంథని, సిద్ధిపేట, హుస్నాబాద్ లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు.  1324 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. టీఆర్ఎస్ నుంచి ఎల్. రమణ, టి. భానుప్రసాద్ రావు పోటీలో ఉండగా, ఇండిపెండెంట్ గా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్ బరిలో ఉన్నారు.  శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న కౌంటింగ్ జరగనుంది. 

Also Read: ఈ పిల్లలు జీవితాంతం బస్సుల్లో ఫ్రీగా తిరగొచ్చు.. ఎండీ సజ్జనార్ గ్రేట్ ఆఫర్, ఎందుకంటే.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget