అన్వేషించండి

Electricity Bill Payment: మీ కరెంట్ బిల్లులను ఆన్‌లైన్‌లో ఎలా చెల్లించాలో తెలుసా, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదీ

TGSPDCL Electricity Bill: కరెంట్ బిల్లు కట్టేందుకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అనేక పద్ధతులు ఉన్నాయి. కానీ జులై 1 (నేటి) నుంచి అధికారిక వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే కరెంట్ బిల్లు చెల్లించాలి.

How To Pay Electricity Bill Step by Step Process in Telugu:  తెలంగాణలో విద్యుత్ పంపిణీని తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) నిర్వహిస్తుంది. అత్యున్నత స్థాయి భద్రత, సౌకర్యాలతో వెబ్‌సైట్‌లో విద్యుత్ బిల్లు చెల్లింపు ఆన్‌లైన్‌లో సులభంగా చేయవచ్చు. జూన్ వరకు విద్యుత్ వినియోగదారులు కరెంట్ బిల్లులను తమకు వీలైన పద్ధతుల్లో చెల్లించేవారు. కానీ జులై 1 నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యూపీఐ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కరెంట్ బిల్లులు చెల్లింపులు నిలిపివేశారు. ఆర్బీఐ నిబంధనల మేరకు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా చెల్లింపులను  TGSPDCL నిలిపివేసింది. తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) అధికారిక వెబ్‌సైట్ లో గానీ, యాప్ ద్వారా మీ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు. ఇప్పటివరకూ థర్డ్ పార్టీ యూపీఐ యాప్స్ ద్వారా బిల్లులు చెల్లించిన వినియోగదారులు ఇక నుంచి ఈ కింద సూచించిన విధంగా సులువుగా కరెంట్ బిల్లు చెల్లించవచ్చు.

TGSPDCL వెబ్‌సైట్‌లో కరెంట్ బిల్లు ఇలా చెల్లించండి
కింది స్టెప్స్ ఫాలో అవుతూ ఈజీగా కరెంట్ బిల్ కట్టవచ్చు.  
* TGSPDCL అధికారిక వెబ్‌సైట్‌ https://tgsouthernpower.org/ వెళ్లండి
* హోమ్ పేజీలో Consumer Services లో ఆన్‌లైన్ సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
*  ఇప్పుడు ఆన్‌లైన్ సర్వీసెస్‌కు కుడివైపున కనిపించే పే యువర్ బిల్ (Pay Your Bill) మీద క్లిక్ చేయండి
*  ఇప్పుడు, క్రింద ఇచ్చిన ప్లేసులో మీ యూనిక్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
* మీరు మీ విద్యుత్ బిల్లును చూపే మరొక పేజీకి వెళ్తుంది. అక్కడ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి
*  వివరాలు ఎంటర్ చేశాక మీ ఫోన్‌కు వచ్చే OTPని ఎంటర్ చేసి, చెల్లింపును ప్రాసెస్ చేయాలి
* చెల్లింపు పూర్తయిన తర్వాత  E-రసీదు పొందవచ్చు. దానిని సేవ్ చేసుకోవాలి. 

బిల్ డెస్క్  ద్వారా TGSPDCL ఎలక్ట్రిసిటీ బిల్లును ఎలా చెల్లించాలంటే.. 
మీరు బిల్ డెస్క్ ఆప్షన్‌ని ఉపయోగించి విద్యుత్ బిల్లును చెల్లించవచ్చు
బిల్ డెస్క్‌ని ఉపయోగించి బిల్లును చెల్లించడానికి కింద స్టెప్స్ ఫాలో అవ్వాలి. 
* TGSPDCL అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
* 'పే యువర్ బిల్'పై క్లిక్ చేయండి.
* తదుపరి పేజీలో, 'బిల్ డెస్క్'పై క్లిక్ చేయండి.
* తర్వాత, యూనిక్ సర్వీస్ నంబర్, ఇమెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.
* 'మేక్ పేమెంట్'పై క్లిక్ చేయండి.
* బిల్లు అమౌంట్  మొత్తం తదుపరి స్క్రీన్‌లో కనిపిస్తుంది
* ప్రక్రియను పూర్తి చేయడానికి పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.   

TGSPDCL మొబైల్ యాప్‌తో   విద్యుత్ బిల్లు చెల్లింపు విధానం
TGSPDCL అధికారిక మొబైల్ అప్లికేషన్ ద్వారా విద్యుత్ బిల్లు చెల్లించడానికి కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.
* మీ ఫోన్‌లో యాప్ లేకపోతే TGSPDCL అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
* మొదట TGSPDCL యాప్ ఓపెన్ చేయండి
* కరెంట్ బిల్ కట్టేందుకు మీ యూనిక్ సర్వీసు నంబర్ తో అకౌంట్ ఓపెన్ చేయాలి.  
* ఇప్పుడు అప్లికేషన్ స్క్రీన్ నుండి 'పే యువర్ పవర్ బిల్' ఆప్షన్ ఎంచుకోవాలి.
* మీ బిల్లు మొత్తాన్ని పొందడానికి అప్లికేషన్‌పై మీ యూనిక్ సర్వీసు నంబర్, ఫోన్ నంబర్‌ ఎంటర్ చేయాలి.
* పేమెంట్ ఆప్షన్ లతో పాటు మీరు చెల్లించాల్సిన బిల్లు చూపిస్తుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లు లేదా UPI యాప్‌లతో ఏదో ఒక దానితో పేమెంట్ చేసుకోవచ్చు.  
 * ఇ-రసీదు వస్తుంది . డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. 

విద్యుత్ బిల్లు చెల్లింపు ఆఫ్‌లైన్‌లో చేయాలంటే.. 
విద్యుత్ బిల్లు చెల్లింపు ఆఫ్ లైన్ లో చేయాలనుకునే వారు సమీపంలోని TSSPDCL కార్యాలయం లేదా  కలెక్షన్ సెంటర్ కు వెళ్లి చెల్లించవచ్చు. లేకపోతే దగ్గర్లోని మీ సేవా, ఈ సేవా కేంద్రాల ద్వారా కూడా బిల్లు చెల్లించవచ్చు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తప్పతాగి కరెంటు తీగలపై పడుకున్నాడు - వీడియోఅమెరికాలో తెలుగు యూత్ పాడు పని! కేటీఆర్, బండి సంజయ్‌ అనుచరులేనా?Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
తెలంగాణ కాంగ్రెస్‌లో న్యూ ఇయర్ మార్పులు - ఇంచార్జ్‌గా దీపాదాస్ స్థానంలో సీనియర్ నేత?
Modi Government : రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
రైతులకు హ్యాపీ న్యూస్ చెప్పిన మోదీ ప్రభుత్వం- ఎరువులు, బీమా స్కీమ్‌లో భారీ మార్పులు 
Chandrababu First Sign in 2025: నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
నూతన సంవత్సరంలో సీఎం చంద్రబాబు తొలి సంతకం, వారికి అందనున్న ఆర్ధికసాయం
KTR Comments On Hyderabad Regional Ring Road : నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
నాపై పెట్టింది లొట్టపీసు కేసు- రేవంత్‌ను కూడా అరెస్టు చేయాలి- ట్రిపుల్ ఆర్‌లో భారీ అవినీతి: కేటీఆర్
Shiva Rajkumar: క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
క్యాన్సర్ నుంచి కోలుకున్న కన్నడ హీరో... పుకార్లకు క్లారిటీ ఇస్తూ భార్యతో కలిసి వీడియో రిలీజ్
Air India Wifi : ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్.. దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
ఎయిర్ ఇండియా ప్యాసింజర్స్ కు గుడ్ న్యూస్ - దేశీయ విమానాల్లో ఫ్రీగా వై-ఫై సేవలు
Atul Subhash: ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
ఢిల్లీలో మరో అతుల్ సుభాష్ - భార్య వేధింపులతో వ్యాపారవేత్త ఆత్మహత్య - ఇంకెందరు బలి కావాలి?
Visa Fee Reductions : చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్.. వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
చైనాకు వెళ్లాలనుకునే ఇండియన్స్ కు గుడ్ న్యూస్ - వీసా ఫీజుల తగ్గింపు ఈ ఏడాదికి పెంపు
Embed widget