అన్వేషించండి

TSRTC News: TSRTC గుడ్ న్యూస్ - బస్ టికెట్ తో పాటే శ్రీశైలం దర్శన టికెట్ బుకింగ్ సదుపాయం

Telangana News: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బస్సుల్లో టికెట్ తీసుకునే వారికి అందులోనే దర్శనం టికెట్లు అందించేలా చర్యలు చేపట్టనుంది. త్వరలోనే ఈ విధానం అందుబాటులోకి రానుంది.

TSRTC Good News For Devotees: శ్రీశైలం (Srisailam) మల్లన్న దర్శనానికి వెళ్లే భక్తులకు TSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకునే వారికి వాటితో పాటే శ్రీశైలం ఆలయంలో దర్శన టికెట్లు బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ప్రతి రోజూ 1200 టికెట్లు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 200 స్పర్శ దర్శనం, 500 అతి శ్రీఘ్రదర్శనం, మరో 500 శీఘ్రదర్శనం టికెట్లు ఉన్నాయని చెప్పారు. ఈ మేరకు ఆర్టీసీ, శ్రీశైలం దేవస్థానం మధ్య ఒప్పందం కుదిరినట్లు వెల్లడించారు. స్పర్శదర్శనం టికెట్ ధర రూ.500, అతి శీఘ్రదర్శనం రూ.300, శీఘ్రదర్శనం టికెట్ ధర రూ.150 ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే ఈ విధానం అమల్లోకి తీసుకు రానున్నట్లు స్పష్టం చేశారు.

50 నిమిషాలకో ఏసీ బస్సు

హైదరాబాద్ (Hyderabad) నుంచి శ్రీశైలం (Srisailam) వరకూ ఇప్పటివరకూ నాన్ ఏసీ బస్సులు ఉండగా శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఏసీ బస్సులను ప్రారంభించారు. ఈ సర్వీసులు వారం రోజుల్లోగా ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. వీటి ఛార్జీలను పెద్దలకు జేబీఎస్ నుంచి రూ.750, పిల్లలకు రూ.540, ఎంజీబీఎస్ నుంచి అయితే పెద్దలకు రూ.700, పిల్లలకు రూ.510గా నిర్ణయించినట్లు చెప్పారు. హైదరాబాద్ - శ్రీశైలానికి ప్రతి 50 నిమిషాలకు ఓ ఏసీ బస్సు, ప్రతి 20 నిమిషాలకు ఓ సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ ఆర్ఎం శ్రీధర్ తెలిపారు.

100 బస్సులు ప్రారంభించిన సీఎం

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శనివారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద 100 కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆరు గ్యారెంటీల్లో మొట్ట మొదటి హామీ అమలు చేసిన ఘనత ఆర్టీసీ కార్మికులదేనని సీఎం రేవంత్ ఈ సందర్భంగా అన్నారు. ఇప్పటివరకూ 15.21 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని, ఇందు కోసం ఆర్టీసీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ.535 కోట్లు విడుదల చేశారని వివరించారు. మరో 1,300 బస్సులు కొనాలని సంస్థ కోరిందని.. అందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రారంభించిన కొత్త బస్సుల్లో 90 సర్వీసులు 'మహాలక్ష్మి' పథకం కింద తిప్పుతామని, మరో 10 ఏసీ బస్సులు హైదరాబాద్ - శ్రీశైలం మార్గంలో నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Also Read: Weather Latest Update: నేడు కాస్త ఎక్కువగానే ఎండలు, హైదరాబాద్ లో ఇలా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Casio launches first smart ring: స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో -  అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
స్మార్ట్ రింగ్ లేదా స్మార్ట్ వాచ్ కాదు రెండు ఒకే దాంట్లో - అబ్బురపరుస్తున్న కాసియో ఫస్ట్ రింగ్ విత్ స్మార్ట్ వాచ్
Embed widget