(Source: ECI/ABP News/ABP Majha)
TS Assembly Session: రాష్ట్రంలో మరో 20 ఏళ్లు అధికారం మాదే .. పరిశ్రమలకు తెలంగాణ గమ్యస్థానం... అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి ప్రతిపక్షనేతలే బ్రాండ్ అంబాసిడర్స్ అని వ్యాఖ్యానించిన ఆయన.. అభివృద్ధిని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదన్నారు.
తెలంగాణలో మరో 20 ఏళ్లపాటు టీఆర్ఎస్ పార్టీదే అధికారమని మంత్రి కేటీఆర్ అన్నారు.రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రభుత్వానికి పేరు వస్తుందనే కారణంతో రాష్ట్రాన్ని నిందిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎప్పుడూ దూరదృష్టితో ఆలోచిస్తారని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రోత్సాహకాలు పారదర్శకంగా అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నీకెంత, నాకెంత అనే వ్యవహారాలు ఉండేవని ఇప్పుడా ఆ పరిస్థితులు లేవన్నారు. 17 వేలకు పైగా పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకొచ్చామన్నారు. కార్ల పరిశ్రమల కోసం ఇతర దేశాలతో పోటీ పడ్డామని ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా ముచ్చర్ల అవతరించబోతోందని కేటీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు.
రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం స్టార్ట్ అప్..
— TRS Party (@trspartyonline) September 27, 2021
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానం ప్యాకప్ : అసెంబ్లీలో మంత్రి శ్రీ @KTRTRS. pic.twitter.com/qhH5ZxT3EO
Also Read : టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?
మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ దే అధికారం
రాష్ట్రంలో ఇండస్ట్రియల్ కారిడార్లు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని మంత్రి కేటీఆర్తెలిపారు. ఐదు జాతీయ రహదారుల వెంబడి కారిడార్లు పెట్టాలని కోరినప్పటికీ కేంద్రం నుంచి స్పందన లేదని మంత్రి అన్నారు. ప్రతిపక్ష నాయకులు పాదయాత్రలు చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఎవరు ఎంత సంస్కార హీనంగా మాట్లాడినా ప్రజలకు అంతా తెలుసని సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇట్లాంటి రాజకీయాలు మంచివి కావన్న కేటీఆర్... ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో వరంగల్ జిల్లాలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ పెడతామని కేంద్రం మాట ఇచ్చిందని గుర్తుచేశారు. 2014లోనే భూమిని కేటాయించినప్పటికీ ఫ్యాక్టరీనీ మహారాష్ట్రకు తరలించారని ఆరోపించారు. కరీంనగర్లో ట్రిపుల్ ఐటీ, ఆదిలాబాద్‌లో గిరిజన విశ్వవిద్యాలయం కోసం ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించలేదన్నారు. పసుపుబోర్డు తెస్తామని బాండుపేపర్రాసిచ్చిన బీజేపీ నేతలు ఎక్కడా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకో 20 ఏళ్లు అధికారంలో ఉంటుందని కేటీఆర్ జోస్యం చెప్పారు.
Also Read: శాసనమండలిలో కల్వకుంట్ల కవిత తొలి ప్రసంగం చూడండి