News
News
X

Tollywood Vs AP Govt : టిక్కెట్ రేట్లా ? ఆన్ లైన్ టిక్కెట్లా ? ఏపీ ప్రభుత్వంతో సినీ పరిశ్రమకు పేచీ ఎక్కడ ?

ఏపీ ప్రభుత్వం, సినిమా పరిశ్రమ మధ్య వివాదం ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో లేని పేచీ ఏపీ ప్రభుత్వంతో టాలీవుడ్‌కు ఎందుకు వచ్చింది. ఏపీ ప్రభుత్వం కావాలనే సమస్యలు సృష్టిస్తోందా..?

FOLLOW US: 
 

సాధారణంగా సినీ పరిశ్రమలోని ఏ చిన్న అంశమైనా సామాన్య ప్రజలకు ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. అలాంటిది ప్రభుత్వంపైనే సమరం ప్రకటిస్తే ఇక ఆ అంశానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం - సినీ పరిశ్రమ మధ్య అలాంటి ఓ రకమైన కోల్డ్ వార్ నడుస్తోంది. నిన్నామొన్నటిదాకా అది అంతర్గతంగా ఉండేది కానీ పవన్ కల్యాణ్ ఒక్క సారిగా విమర్శలు చేయడంతో బహిరంగమయింది. పవన్‌కు మద్దతుగా కొంత మంది తెర ముందుకు వస్తున్నారు. మరికొందరు వ్యక్తిగతం అంటున్నారు. మరికొందరు సైలెంట్‌గా ఉన్నారు. ఎవరి స్పందన ఎలా ఉన్నా ఏపీ ప్రభుత్వం - సినీ పరిశ్రమ మధ్య సుహృద్భావ సంబంధాలు లేవననేది మాత్రం నిజం. దీనికి కారణం ఏమిటి ? 

కరోనా తర్వాత ట్రాక్‌లోని అన్ని పరిశ్రమలు..  టాలీవుడ్‌కు మాత్రమే ఇబ్బంది ! 

ప్రస్తుతం కరోనా పరిస్థితుల నుంచి అందరూ బయట పడుతున్నారు. ప్రభుత్వాలు కూడా మళ్లీ సాధారణ జన జీవనం ఉండేలా..  ఉపాధి కోల్పోయిన అందరి పరిస్థితి మళ్లీ గాడిన పడేలా చేయడానికి తమ వంతు సహకారం అందిస్తున్నాయి. తెలంగాణలో అందరితో పాటు సినీ పరిశ్రమపైనా పూర్తి స్థాయిలో ఆంక్షలు తొలగించారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి సమస్యా లేదు. కరోనాకు ముందు ఎలాంటి వ్యాపార పరిస్థితులు.. షూటింగ్ సౌకర్యాలు ఉన్నాయో.. ఇప్పుడు తెలంగాణలో అవే పరిస్థితులు ఉన్నాయి. ధియేటర్లపై ఆంక్షల్లేవ్.. కొన్ని ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ కారణంగా సినిమాల షూటింగ్‌లు జోరందుకున్నాయి. సినిమాల విడుదలలు కూడా ప్రారంభమయ్యాయి. లవ్ స్టోరీ లాంటి సినిమాలు రెండు రాష్ట్రాల్లోనూ విడుదలవుతున్నాయి. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ పచ్చగా ఉండాలంటే పెద్ద సినిమాలు కూడా విడుదల కావాలి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా పెద్ద సినిమాలు విడుదల కావడం లేదు. దానికి కారణం ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ విడుదల చేసుకోలేని పరిస్థితులు ఉండటమే..!

Also Read : 'మా'లో ఎన్నికల సందడి షురూ.. నామినేషన్ వేసిన ప్రకాశ్ రాజ్ టీమ్

News Reels

తెలంగాణ సర్కార్‌తో లేని ఇబ్బందులు టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వంతో ఎందుకు వస్తున్నాయి ?

సినిమా ధియేటర్లను పూర్తి స్థాయిలో తెరుచుకోవడానికి వంద శాతం సీట్ల బుకింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో అనుమతి ఇచ్చింది. కానీ వారు చాలా వరకూ తెరవలేదు. ఈ విషయంపై సినీ ఇండస్ట్రీ పెద్దలను చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పిలిపించి మాట్లాడారు. ఎందుకు తెరవలేదని.. సమస్య ఏమిటో చెప్పాలని అడిగారు. అప్పుడు వారు చెప్పిన సమాధానం సినిమాలు ఒక్క తెలంగాణలోనే విడుదల చేయలేమని రెండు రాష్ట్రాల్లోనూ ఒకే సారి విడుదల చేసుకునే పరిస్థితి ఉండాలని. దీంతో తెలంగాణ చీఫ్ సెక్రటరీ కూడా సమస్య తమ చేతుల్లో లేదని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఏపీలో ఇప్పటికీ ధియేటర్లపై ఆంక్షలు ఉన్నాయి. సగం టిక్కెట్లకు మించి అమ్మకూడదు.. మూడు షోలు వేయాలన్న రూల్స్ ఉన్నాయి. దీనికి తోడు వకీల్ సాబ్ సినిమా సమయంలో కొత్తగా టిక్కెట్లను రెగ్యులేట్ చేస్తూ జీవో తీసుకు వచ్చారు. ఆ టిక్కెట్ల రేట్ల సవరణ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది.

Also Read : "బ్రాండ్ న్యూ కేబినెట్"కు ముహుర్తం ఖరారైందా ? సీనియర్లను జగన్ ఎలా డీల్ చేస్తారు ?

పదేళ్ల కిందటి నాటి టిక్కెట్ ధరలను నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం ! 

ఏప్రిల్ రెండో వారంలో సినిమా ధియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తూ ప్రభుత్వం రాత్రికి రాత్రి జీవో జారీ చేసేసింది. తాము చెప్పినదానిపై ఒక్క పైసా వసూలు చేయకూడదని .. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ జీవో ప్రకారం.. కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టిప్లెక్స్ లలో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేట్లు రూ. 250  మాత్రమే ఉండాలి. మిగతా టిక్కెట్లు రూ. 150, 100 ఉండాలి. సింగిల్ ధియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ. 100 మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర రూ. 60. ఈ టిక్కెట్ రేట్లు జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న ధియేటర్లలో రేట్లు ఇంకా ఇంకా తక్కువ.  ఇవే టిక్కెట్లతో కలెక్షన్లు రావాలంటే ఆదాయం సగానికి సగం పడిపోతుంది. చిన్న సినిమాల సంగతేమో కానీ పెద్ద సినిమాలు మాత్రం ఈ టిక్కెట్ల ధరలతో కుదేలవడం ఖాయంగా మారింది.Also Read : ఏపీలో వైట్ ఛాలెంజ్.. డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమా అని టీడీపీ సవాల్... గంజాయి రవాణాతో సంబంధం లేదన్న వైసీపీ ఎమ్మెల్యే

బెనిఫిట్ షోలు, ఇతర ఆదాయ మార్గాలనూ కుదించేసిన ఏపీ ప్రభుత్వం !

పెద్ద సినిమాల హీరోలకు బెనిఫిట్ షోలు ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. ఎంత టిక్కెట్ కావాలంటే అంత పెట్టుకుని ఫ్యాన్స్‌కు టిక్కెట్లు అమ్ముతుంటారు. అలాగే తొలి రెండు వారాలు ప్రత్యేకంగా టిక్కెట్ ధరలను పెంచుకునేందుకు ప్రభుత్వాలు పర్మిషన్ ఇచ్చేవి. ఆ అవకాశఆలను ఏపీ ప్రభుత్వం తొలగించింది. బెనిఫిట్ షోలకు ఎలాంటి పర్మిషన్లు ఇవ్వలేమని స్పష్టం చేసింది. అదే సమయంలో తొలి రెండు వారాల పాటు టిక్కెట్ రేట్ల పెంపునకూ ఆమోదించంలేదు. ఇదంతా వకీల్ సాబ్ సినిమా రిలీజ్ టైంలోనే జరిగింది. ఏపీలో ఆ సినిమాకు అడ్డంకులు ఎదురైతే తెలంగాణలో సంపూర్ణమైన సహకారం లభించింది. రేట్లు పెంచుకుని.. కావాల్సినన్ని షోలు వేసుకునేవిధంగా ఆ చిత్ర యూనిట్‌కు స్వేచ్చ లభించింది. 

Also Read : టాలీవుడ్‌పై ఏపీ ప్రభుత్వం పగ సాధిస్తోందా ? పవన్ కల్యాణ్ వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమిటి ?

పులి మీద పుట్రలా ప్రభుత్వ అధీనంలోకి టిక్కెటింగ్ ! 
 
ఈ టిక్కెట్ రేట్ల వివాదం కారణంగా పెద్ద సినిమాల విడుదలలు ఆగిపోయాయి. అదే సమయంలో జీఎస్టీ ఎగ్గొడుతున్నారని టిక్కెట్లను ప్రభుత్వమే అమ్ముతుందంటూ జీవో జారీ చేశారు.  రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఉన్న ఐఆర్‌సీటీసీ వెబ్ సైట్ తరహాలో ఏపీలో ఉన్న సినిమాహాళ్లు మొత్తానికి టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి ఓ పోర్టల్ రూపొందించాలని నిర్ణయించుకుంది.  ఈ విధానం అమలయితే ఇక టిక్కెట్ రేట్లు, బుకింగ్ సహా మొత్తం ప్రభుత్వంచేతుల్లోనే ఉంటుంది. విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదు. కమిటీని నియమించారు. అయితే ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అదే కమిటీ రిపోర్టులో ఇస్తుంది. ప్రభుత్వ ఆలోచనలేమిటో అన్నదానిపై స్పష్టత లేదు.

Also Read : ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన జనసేన ! ఇక గాజు గ్లాస్ గుర్తు ఉండదా ?

టాలీవుడ్ ప్రముఖులకు పదే పదే అపాయింట్‌మెంట్లు క్యాన్సిల్ చేస్తున్న సీఎం జగన్ !

ఆగస్టు  రెండో వారంలో ఆంధ్రప్రదేశ్‌లో టాలీవుడ్‌కు ఉన్న సమస్యలపై చర్చించడానికి రావాలని చిరంజీవికి ఏపీ సీఎం జగన్ ఆహ్వానం పలికారు. చిరంజీవితో పాటు టాలీవుడ్ పెద్దలు రావొచ్చని కబురు పంపారు.   మంత్రి పేర్ని నాని నేరుగా ముఖ్యమంత్రి తరపున నేరుగా చిరంజీవికి ఫోన్ చేసి.. సీఎంతో భేటీ అయి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా సూచించారు.  నెలాఖరులో సమావేశం జరిగే అవకాశం ఉంటుదన్నారు. ఆ తర్వాత ఓ సారి పేర్ని నాని హైదరాబాద్ వచ్చి చిరంజీవితో సమావేశం అయ్యారు. అదే ఆఖరు. ఆ నెలాఖరులో జగన్‌తో సినీ పెద్దల భేటీ జరగలేదు..  సెప్టెంబర్ నాలుగు, ఇరవయ్యో తేదీల్లో భేటీ జరుగుతుందని ప్రచారం జరిగింది. కానీ కొంత మంది నిర్మాతలు, ఎగ్జిబిటర్లతో పేర్ని నాని సమావేశం అయ్యారు.  దాంతో సమస్య మరింత ముదిరింది కానీ తగ్గలేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో తేలిపోయింది.

Also Read : తెలంగాణ రక్తచరిత్ర.. కొండా దంపతులపై ఆర్జీవీ సినిమా

చీలిపోయిన టాలీవుడ్  ! 

పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత టాలీవుడ్ రెండుగా చీలిపోయింది. రెండు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఫిల్మ్ చాంబర్ తరపున నారాయణ్ దాస్ నారంగ్ ప్రకటన జారీ చేశారు. పవన్ కల్యాణ్‌ది వ్యక్తిగత అభిప్రాయమని తేల్చేశారు. ఈ నారంగ్ కుమారుడే లవ్ స్టోరీ నిర్మాత. ప్రభుత్వం ఏ మాత్రం కక్షసాధించినా ఉన్నది కూడా ఊడిపోతుదని ఫిల్మ్ చాంబర్ భయపడిందేమో కానీ.. సమస్యలు లేవని మాత్రం వారు కూడా అనలేరు. హీరోలు మాత్రం కొంత మంది ముందుకు వచ్చారు. పవన్ కల్యాణ్ వ్యక్తం చేసిన అభిప్రాయాల్లో ధర్మాగ్రహం ఉందని.. ఇండస్ట్రీ అనేక సమస్యల్లో ఉందని.. అదీ కూడా ప్రభుత్వం వల్లేనని గుర్తిస్తూ తక్షణం పరిష్కరించాలని కోరుతూ కొంత మంది యువ హీరోలు బయటకు వచ్చారిు. నాని,కార్తికేయ, సంపూర్ణేష్ లాంటి వారు తమ మద్దతు తెలిపారు. ఆ అతికొద్ది మంది తప్పితే మిగిలిన వారు సైలెంటయిపోయారు. ఏపీ ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా మారుతున్న ఈ సమస్య ఎంత వరకూ వెళ్తుందో అంచనా వేయడం కష్టమే.  

Watch Video : కాలగర్భంలోకి ఆసియాలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

 

 

 

Published at : 27 Sep 2021 01:14 PM (IST) Tags: Tollywood ap govt AP Cm Jagan perni nani FILM INDUSTRY GOVT VS FILM INDUSTRY

సంబంధిత కథనాలు

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

తీవ్ర తుపానుగా మాండోస్- ఆరు జిల్లాల యంత్రాంగం అప్రమత్తం

ABP Desam Top 10, 9 December 2022: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 9 December 2022:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Google Year in Search 2022: ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అత్యధికంగా వెతికిన అంశాలు ఇవే!

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Gold-Silver Price 09 December 2022: ₹54 వేల పైకి పసిడి రేటు, వెండి కూడా మాంచి జోరుమీదుంది

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

Petrol-Diesel Price, 09 December 2022: కర్నూల్లో దిగి వచ్చిన చమురు ధర, మిగిలిన నగరాల్లోనూ మారిన పెట్రోల్‌ రేట్లు

టాప్ స్టోరీస్

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Airport Metro : లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Airport Metro :  లండన్ మెట్రో ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు మెట్రో - శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి !

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Panchathantram Review - 'పంచతంత్రం' రివ్యూ : స్వాతి ఈజ్ బ్యాక్ - ఒక్క సినిమాలో ఐదు కథలు ఎలా ఉన్నాయంటే?

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!