Janasena : ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన జనసేన ! ఇక గాజు గ్లాస్ గుర్తు ఉండదా ?
జనసేనకు ఈసీ గుర్తింపు లభించలేదు. ఎన్నికల్లో పోటీ చేసి గుర్తింపు కోసం తగినన్ని ఓట్లు, సీట్లు సాధించలేకపోయింది. ఆ పార్టీ సింబల్‌ను ఫ్రీ సింబల్ కేటగరిలో ఈసీ చేర్చింది.
భారత ఎన్నికల సంఘం దేశంలో గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీల వివరాలను ప్రకటించింది. ఇందులో ఎనిమిది పార్టీలకు జాతీయ హోదా దక్కింది. కాంగ్రెస్, బీజేపీ కాకుండా సీపీఐ, సీపీఎం, తృణమూల్, బీఎస్పీ,ఎన్‌సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలు జాతీయ హోదా దక్కించుకోవడానికి అవసమైన అర్హతలు సాధించగలిగాయి. ఇక 27 రాష్ట్రాల్లో 57 పార్టీలు ప్రాంతీయ హోదా దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ , మజ్లిస్‌లకు ప్రాంతీయ పార్టీ హోదా దక్కింది. ఈ జాబితాలో పవన్ కల్యాణ్ అధ్యక్షునిగా ఉన్న జనసేనలేదు. అంటే ప్రాంతీయ పార్టీగా అర్హత సాధించడానికి అవసరమైన ఓట్లు, సీట్లను ఆ పార్టీ దక్కించుకోలేకపోయిందన్నమాట. అందుకనే ఆ పార్టీ గుర్తును ఫ్రీ సింబల్స్‌లో పెట్టేసిందిఎన్నికల సంఘం.
ప్రాంతీయ పార్టీ హోదా దక్కించుకోవాలంటే కొన్ని అర్హతలు ఆ పార్టీ సాధించంాల్సి ఉంటుంది. శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం ఓట్లు సాధించడంతోపాటు రెండు అసెంబ్లీ స్థానాలను గెలవాలి. అలా గెలిస్తే ప్రాంతీయ పార్టీ హోదా ఆటోమేటిక్‌గా వస్తుంది. అయితే జనసేన పార్టీ ఆరు శాతం ఓట్లనుసాధించింది కానీ అసెంబ్లీ సీట్లను మాత్రం ఒక్క దాన్నే సాధించింది. ఈ ఒక్కటే కాదు మరిన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లలో ఆరు శాతం తెచ్చుకుని కనీసం ఒక్క లోక్‌సభ సీటు గెల్చినా గుర్తింపు లభిస్తుంది. అలా కాకపోయినా ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలిచినా పర్వాలేదు. ఏపీలో ఉన్న 25 లోక్ సభ స్థానాలే కాబట్టి ఒక్క లోక్‌సభ సీటును జనసేన గెల్చుకున్నా ప్రాంతీయ పార్టీ హోదా లభించేది. ఓట్లు మూడు శాతం వచ్చినా గుర్తింపు వచ్చే దారి ఉంది. కాకపోతే మూడు సీట్లు సాధించాలి. అసలేమీ సీట్లు సాధించకపోయినా ఎన్నికల్లో 8 శాతం ఓట్లు తెచ్చుకుని ఉన్నా జనసేనకు గుర్తింపు వచ్చి ఉండేది.
Also Read : నగరిలో రోజాకు పెద్దిరెడ్డి వర్గీయుల షాక్ - ఎంపీపీ పీఠాల కోసం రోడ్డున పడ్డ రాజకీయం !
వీటిలో ఏ పారామీటర్‌ను కూడా జనసేన అధిగమించలేకపోయింది. అందుకే గుర్తింపులేని పార్టీల జాబితాలో ఈసీ చేర్చింది. గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్స్‌లో చేర్చింది. మొత్తం 197 గుర్తులు ఫ్రీ సింబల్స్ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే జనసేన గుర్తుకు వచ్చిన ఇబ్బందేమీ లేదని ఎన్నికల నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు కామన్‌గా తమకు గ్లాస్ గుర్తే కేటాయించాలని ఈసికి దరఖాస్తు చేసుకుంటే కేటాయించే అవకాశం ఉంది. ఇతరులకు కేటాయించే అవకాశం ఉండదు.
Also Read : కరోనా మరణాలకు పరిహారం ! లెక్కల్లో వేయని వారి కుటుంబాలు అన్యాయమైపోయినట్లేనా..!?
ఇటీవల జనసేన పార్టీ తిరుపతిలో పోటీ చేయకపోవడం వల్ల గ్లాస్ గుర్తు ఇతరులకు కేటాయించారు. వారు ప్రత్యేకంగా గ్లాస్ గుర్తు కోసమే విజ్ఞప్తి చేశారు. జనసేన పోటీ చేసి ఉంటే ఆ పార్టీకే కేటాయించేవారు. అలాగే వచ్చే ఎన్నికల్లో గ్లాస్ గుర్తుకు వచ్చిన ఇబ్బందేమీ లేదన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది. అందుకే జనసేన పార్టీకి గుర్తుతో వచ్చిన సమస్యేమీ లేదని అంటున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని .. 25 శాతం ఓట్లు వచ్చాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అయితే స్థానిక ఎన్నికల ఓట్లను ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు.
Also Read : పగ తీర్చుకోవడానికి ఈ కోతి 22 కిలోమీటర్లు నుంచి వచ్చింది... కర్ణాటకలో వింత ఘటన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి