అన్వేషించండి

Train Reservations: కేవలం ఐదే 5 నిమిషాలు - రైళ్లల్లో రిజర్వేషన్లన్నీ ఫుల్, సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఈసారి కష్టాలు తప్పవా?

Trains: వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కోసం ఇప్పటి నుంచే ప్రధాన రైళ్లల్లో రిజర్వేషన్లు పూర్తయ్యాయి. శుక్రవారం రిజర్వేషన్లు ఓపెన్ కాగా కేవలం 5 నిమిషాల్లోనే రిగ్రెట్ అని చూపించడంతో ప్రయాణికులు నిరాశ చెందారు.

Rail Reservations Completed: వచ్చే ఏడాదికి సంక్రాంతి (Sankranthi) పండుగ కోసం ఊరెళ్లాలనుకుంటున్నారా.?. అయితే, మీరు కొంచెం ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే అప్పటికి రైళ్లల్లో రిజర్వేషన్లు అన్నీ నిండిపోయి రిగ్రెట్ స్టేజ్‌కు వచ్చేశాయి. ముఖ్యమైన రైళ్లల్లో బెర్తులన్నీ అప్పుడే ఫుల్ అయిపోయాయి. వచ్చే ఏడాది జనవరి 11వ తేదీకి సంబంధించిన రిజర్వేషన్లు శుక్రవారం ఉదయం 8 గంటలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో ప్రధాన రైళ్లైన విశాఖ (Visakha), గోదావరి (Godavari), ఫలక్‌నుమా (Falaknuma), కోణార్క్ (Konark) తదితర రైళ్లకు 8.05 కల్లా పూర్తిస్థాయిలో బెర్తులు నిండిపోయాయి. కేవలం 5 నిమిషాల్లోనే రిజర్వేషన్లన్నీ పూర్తి కావడంతో ప్రయాణికులు నిరాశ చెందారు. సంక్రాంతికి 4 నెలల ముందే ఈ పరిస్థితి నెలకొనడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

ఈసారీ కష్టాలు తప్పవా

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చి ఉన్న వారంతా సంక్రాంతి పండుగకు సొంతూరికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు రైళ్లతో పాటు బస్సులు కూడా రద్దీగా మారుతాయి. అయితే, రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు, కోచ్‌లు ఏర్పాటు చేసినా అవి ఏమాత్రం సరిపోని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో జనరల్ కోచ్‌లు జనసంద్రాన్ని తలపిస్తాయి. ప్రతిసారీ ఇదే పరిస్థితి ఉన్నా పరిస్థితి మార్చే దిశగా రైల్వే అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. జనరల్ కోచ్‌లు, ప్రత్యేక రైళ్లు పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. అలా అయితే కొంత వరకూ పరిస్థితి మారొచ్చని చెబుతున్నారు.

ప్రత్యేక రైళ్లు

అటు, దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ (07442) రైలు అక్టోబర్ 6 నుంచి నవంబర్ 10 వరకూ అందుబాటులో ఉంటుంది. అలాగే, శ్రీకాకుళం రోడ్ - తిరుపతి స్పెషల్ ఎక్స్ ప్రెస్ (07443) అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకూ అందుబాటులో ఉంటుంది. అటు, సికింద్రాబాద్ - కొల్లం స్పెషల్ ఎక్స్ ప్రెస్ (07193) సెప్టెంబర్ నుంచి నవంబర్ 27 వరకూ, కొల్లం - సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ (07194) రైలు సెప్టెంబర్ నుంచి నవంబర్ 29 వరకూ అందుబాటులో ఉంటుంది. మరోవైపు, రద్దీ దృష్ట్యా విశాఖ - కిరండూల్ (08551) రైలు సెప్టెంబర్ 14, 21, 28 తేదీల్లో అదనపు విస్టోడోమ్ కోచ్ జోడించనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. అటు, సెప్టెంబర్ 15, 22, 29 తేదీల్లో అదనపు థర్డ్ ఏసీ కోచ్‌ను జోడిస్తారు.

కొత్తగా 2 వందేభారత్‌లు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా 2 వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 16న వీటిని ప్రధాని మోదీ అహ్మదాబాద్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఒకటి తెలంగాణలోని హైదరాబాద్ నుంచి మహారాష్ట్రాలోని నాగపూర్ మధ్య.. మరొకటి ఏపీలోని విశాఖ నుంచి ఛత్తీస్ గఢ్‌లోని దుర్గ్ మధ్య రాకపోకలు సాగించనున్నాయి.

Also Read: Chittoor Crime News: చిత్తూరు జిల్లాలోని ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు- నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు ఫెయిల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget