అన్వేషించండి

Chittoor Crime News: చిత్తూరు జిల్లాలోని ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు- నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు ఫెయిల్

Chittoor Crime News:చిత్తూరు, తిరుపతి జిల్లాలోని రెండు ఘాట్ రోడ్స్ లో ప్రమాదాలు రోజు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగితే తప్ప అధికారులు, నాయకులు స్పందించడం లేదు.

Chittoor Crime News: గత రెండు రోజులు కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పది మందిని మృత్యువు కబలించింది... 40 మంది వరకు గాయాలు పాలు చేసింది. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న నివారణ చర్యలు తీసుకోవడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు వెనుకడుగు వేస్తున్నారు.

Chittoor Crime News: చిత్తూరు జిల్లాలోని ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు- నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు ఫెయిల్

* ఎదురొచ్చిన మృత్యువు

తిరుపతి మదనపల్లె మార్గం కేవలం ఒకటే మార్గం ఉంటుంది. గురువారం జరిగిన ప్రమాదం గురించి పరిశీలిస్తే తిరుమల దర్శనం చేసుకుని తిరిగి తమ ఇంటికి వెళ్తున్న కర్నాటక వాసులకు కలకడ నుంచి టమోటో లోడుతో చెన్నై వెళ్తున్న లారీ రూపం లో ఎదురొచ్చి కారు పై పడింది. లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడం, లోడ్ అధికంగా ఉండడం ప్రధాన కారణం గా తెలుస్తోంది. ఈ ప్రమాదం అయితే రోడ్డు ఒక్కటే కావడం వల్ల ఎదురుగా వేగం గా వచ్చిన లారీ కారు పై పడడంతో మృత్యువు కబలించింది.

శుక్రవారం సాయంత్రం మొగిలి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదం అయితే తిరుపతి అలిపిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమల నుంచి బెంగళూరు కు ప్రయాణమైంది. చిత్తూరు నుంచి బంగారుపాళ్యం మీదుగా మొగిలి దాటి పలమనేరు కు చేరుకునే సమయంలో  మొగిలి ఘాట్ రోడ్డులో ప్రమాదం లారీ రూపం లో ఎదురొచ్చింది. 

పలమనేరు వైపు నుంచి ఇనుప కమ్ములు వేసుకుని వస్తున్న లారీ వేగంగా చిత్తూరు వైపు వస్తుంది. ఈ లారీ అధిక లోడ్ తో వేగంగా వచ్చి పలమనేరు వైపు వెళ్తున్న బస్సుపైకి అటు వైపు రోడ్డు నుంచి డివైడర్ పై నుంచి ఆపోజిట్ రోడ్డు లోకి చొచ్చుకొచ్చి వేగంగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ వేగానికి ఆర్టీసీ బస్సు వెనుక ఉన్న గ్రానైట్ తో పలమనేరు వైపు వెళ్తున్న మరో లారీనీ ఢీకొట్టింది. ఇనుప కమ్ములతో వచ్చిన లారీ వెనుక ఉన్న మరో లారీ మధ్యలో పడి బస్సు అందులోని ప్రయాణికులు  మృతి చెందారు. సుమారు 31 మంది తీవ్ర గాయాలు అయ్యాయి. సుమారు 8 మందికి పైగా ఎమర్జెన్సీ చికిత్స పొందుతున్నారు.

రెండు ఘాట్ రోడ్ల పై ప్రత్యేక నిఘా

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు ప్రధాన ఘాట్ రోడ్డులు ఉన్నాయి. ఇందులో భాకరాపేట, పలమనేరు రెండు కూడా ప్రతిరోజు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నవి. ఇక్కడ ప్రమాదం జరిగింది అంటే ఎన్ని మరణాలు సంభవించాయి అనే రీతిలో జీవితాలను చిదిమేస్తుంది. ప్రతినిత్యం ప్రమాదాలకు నెలవుగా మారుతున్న ఘాట్ రోడ్డులో ఏదైన పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటే తప్ప అధికారులు అటు వైపు చూడరు. ఆ రోజు ప్రమాదం గురించి మాట్లాడి ఆ తరువాత నివారణ చర్యలు తీసుకోవడం పై దృష్టి పెట్టడం లేదు.

వాహన డ్రైవర్లదే తప్పు

ప్రమాదం జరిగిన ప్రాంతాలను తిరుపతి, చిత్తూరు జిల్లా అధికారులు పరిశీలన చేసారు. ప్రమాదం జరిగిన తీరును, ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించారు. రోడ్డు రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. డౌన్ ఘాట్ రోడ్డు లో వచ్చే వాహనాలు ఎక్కువ శాతం న్యూట్రల్ లో దిగుతున్నారు... అనుకోని మలుపులు ఊహించక వేగం నియంత్రణ చేయలేక ప్రమాదాలు జరుగుతున్నాయి నిర్థారించారు. ప్రమాదానికి ఎక్కువ శాతం ఎత్తు నుంచి కిందకు వచ్చే వాహనాలే కారణంగా తేల్చారు. ఇక పై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఘటన స్థలాన్ని, క్షతగాత్రులను స్థానిక ప్రజా ప్రతినిధులు పరిశీలన చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా రోడ్డు విస్తరణ, వేగం తగ్గించే మార్గాలు పై దృష్టి సారించాలని సూచించారు.

Chittoor Crime News: చిత్తూరు జిల్లాలోని ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు- నివారణ చర్యలు తీసుకోవడంలో అధికారులు ఫెయిల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget