అన్వేషించండి

Revanth Reddy: వెంకట్రామిరెడ్డి 5 వేల ఎకరాలు ఎవరికీ బదిలీ చేశారో తెలియదు.. ఆయన రాజీనామా ఆమోదించొద్దు 

సిద్దిపేట కలెక్టర్‌గా ఉన్నవెంకట్రామిరెడ్డితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీ కట్టబెట్టడం సరికాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. వెంకట్రామిరెడ్డి రాజీనామానాను ఆమోదించడానికి వీల్లేదన్నారు.

వెంకట్రామిరెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్‌కు వెంకట్రామిరెడ్డి బంట్రోతుగా పని చేశారని ఆరోపించారు. ఔటర్ రింగ్ రోడ్డును అష్టవంకరలు తిప్పడం వెనక వెంకట్రామిరెడ్డి పాత్ర ఉందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.  ఉమ్మడి మెదక్‌ కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి భూఅక్రమాలకు సహకరించారని  ఆరోపించారు.  కోకాపేట భూముల వేలంలోనూ వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజ్‌ పుష్ప సంస్థ భూములను దక్కించుకుందని రేవంత్ రెడ్డి వివరించారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలోనూ ఆయన టీఆర్ఎస్ కు సహకరించినట్టు ఆరోపించారు. 

ఉమ్మడి రాష్ట్రంలోని ముఖ్యమంత్రులకు అత్యంత దగ్గరివాడు వెంకట్రామిరెడ్డి అని.. అందుకే.. ఉమ్మడి మెదక్ జిల్లా కలెక్టర్ గా నియమించినట్టు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రికి వేల కోట్లు రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యాలు వెంకట్రామిరెడ్డిలో ఉన్నాయని విమర్శించారు. దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ బాధ్యతలను కేసీఆర్‌ వెంకట్రామిరెడ్డికి అప్పగించారన్నారు. దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సీఈఓగా ఉన్న వెంకట్రామిరెడ్డి 5వేల ఎకరాలు ఎవరికి బదిలీ చేశారో సమాచారం అందుబాటులో లేదన్నారు. భూసేకరణ విషయంలో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రైతులను కొట్టించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని వెంకట్రామిరెడ్డికి శిక్షతో పాటు జరిమానా విధించారని తెలిపారు. 

వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖలు రాస్తే తుంగలో తొక్కారు. వెంకట్రామిరెడ్డిని ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఏడేళ్లు వ్యాపారాలు చేసి వెనక్కి వచ్చిన సోమేశ్‌ కుమార్‌కు సీఎస్‌ పదవి ఇచ్చారు. అక్రమార్కులను అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారు. తన ఆస్తుల వివరాలను వెంకట్రామిరెడ్డి ఎక్కడా తెలుపలేదు. వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించేందుకు వీల్లేదు. ఆయన ఎమ్మెల్సీ నామినేషన్‌ తిరస్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
                                                                               -రేవంత్‌ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిగా వెంకట్రామిరెడ్డి రాజీనామా చేశారు.  సోమవారం ఉదయం నేరుగా బీఆర్కే భవన్​కు వెళ్లి సీఎస్ సోమేశ్​కుమార్​కు తన రాజీనామా సమర్పించారు. తన రాజీనామాకు ఆమోదం తెలిపిన తర్వాతే సీఎస్ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు.
ఇవాళ టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, రవీందర్‌రావు, బండా ప్రకాష్‌లు నామినేషన్ వేశారు. అయితే ఆఖరి నిమిషంలో బండా ప్రకాష్‌ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం బండా ప్రకాష్‌ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

Also Read: TRS MLC Candidates : రాజ్యసభ సభ్యుడ్ని ఎమ్మెల్సీ చేసిన కేసీఆర్ ! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ మార్క్...

Also Read: Bandi Vs TRS : బండి సంజ‌య్‌కు బ్రేకులు వేస్తున్నది ఎవ‌రు? రైతులా? టీఆర్ఎస్ కార్యక‌ర్తలా?

Also Read: Bjp Vs Trs: రణరంగమైన బండి సంజయ్ పర్యటన.... అడుగడుగునా అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు...

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్ వర్సెస్ కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
PM Modi: ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
ప్రధాని మోదీ ఎయిర్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Embed widget