Top 5 Headlines Today: వైసీపీ విక్టరీకి నేటితో నాలుగేళ్లు! కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో అరుదైన ఖ్యాతి - నేటి టాప్ హెడ్ లైన్స్
Top 5 Telugu Headlines Today 23rd May 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
వైసీపీ విక్టరీకి నేటితో నాలుగేళ్లు - 98.4 శాతం హామీలు నెరవేర్చామంటున్న అధికార పార్టీ
ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నేటితో నాలుగేళ్లు పూర్తి అవుతుంది. 50 శాతానికి పైగా ఓట్లు సంపాదిచి... 151 అసెంబ్లీ స్థానాలను, 22 ఏంపీ సీట్లను సాధించుకుంది. అయితే ఏపీ సీఎం జగన్ అధికారంలోకి రాకముందు చేసిన హామీలను.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమలు చేశామని చెబుతున్నారు అధికార పార్టీ నాయకులు. నాలుగేళ్ల పాలనలో 98.4 శాతం హామీలను నెరవేర్చామని వివరిస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ కార్యకర్త ప్రజల దగ్గరకు వెళ్లి తాము చేసిన మంచి పనులు చూసే ఓటు వేయమని అడుగుతున్నట్లు తమ పాలను ఉందని సీఎం జగన్ చెప్పుకొస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఆనం- నియోజకవర్గంపై కొనసాగుతోంది వివాదం
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ బహిష్కరించిన తర్వాత ఆయన దాదాపుగా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. శుభకార్యాలకు వెళ్లడం, పరామర్శలకు వెళ్తూ నాయకులందర్నీ కలసి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకూ తాను టీడీపీ తరపున పోటీ చేసే విషయాన్ని ఎక్కడా బహిరంగ పరచలేదు ఎమ్మెల్యే ఆనం. కానీ తొలిసారి ఆయన టీడీపీ తరపున పోటీ చేస్తానని ప్రకటించేశారు. అయితే ఆత్మీయుల వద్దే ఆయన ఆ మాట చెప్పారు కానీ బహిరంగ ప్రకటన చేయలేదు. టీడీపీ తరపునే పోటీ చేస్తానన్నారు, ఎంపీగా కాదు, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే నియోజకవర్గం మాత్రం ఫైనల్ చేయలేదు ఆనం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో అరుదైన ఖ్యాతి, ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ అవార్డు!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు మరో అరుదైన ఖ్యాతిని గడించింది. ప్రపంచంలోనే అత్యంత పురాతన, ప్రతిష్ఠాత్మక అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ఏఎస్‌సీఈ) సంస్థ నుంచి విశ్వ వేదికపై అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును దక్కించుకుంది. అమెరికాలోని నెవాడా రాష్ట్రం హెండర్సన్ నగరంలో నిర్వహించిన ‘వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్-2023’లో.. కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్ (ఇంజినీరింగ్ ప్రగతికి సుస్థిర ప్రతీక)’గా గుర్తించి అవార్డుతో ఏఎస్‌సీఈ సత్కరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎమ్మెల్యే కోటంరెడ్డి హౌస్ అరెస్ట్- నెల్లూరులో ఉద్రిక్తత
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన్ను ఇంటినుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆయన ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు మోహరించాయి. ఆయన అనుచరుల ఇళ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు, ఎవర్నీ బయటకు రానివ్వడంలేదు. ఈరోజు ఎమ్మెల్యే కోటంరెడ్డి క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల్ని ప్రారంభిస్తామని చెప్పారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నెల్లూరులోని చర్చిల వద్ద ఒక్కో ఇటుక సేకరించి తెచ్చారు. వాటితో పనులు మొదలు పెడతామన్నారు. గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కి కేటాయించిన స్థలంలో నిరసన తెలిపే అవకాశం ఉండటంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. గతంలో కూడా పొట్టేపాలెం కలుజు వద్ద నిరసనకు వెళ్లే సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయన్ను అడ్డుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మూడేళ్ల తర్వాత హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ, జూన్ 9నే మృగశిర కార్తె!
మూడేళ్ల తర్వాత హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు అయింది. జూన్ 9వ తేదీ నుంచి చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేయబోతున్నారు. ఈక్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బత్తిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా చేప మందు ప్రసాదం పంపిణీపై మంత్రి తలసానితో మాట్లాడారు. జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి