అన్వేషించండి

వచ్చే ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన ఆనం- నియోజకవర్గంపై కొనసాగుతోంది వివాదం

ఆనం రామనారాయణ రెడ్డి కూడా టీడీపీ తరపున పోటీ చేయడానికే ఇష్టం చూపిస్తున్నారు. చంద్రబాబు ఆదేశించిన తర్వాత నియోజకవర్గం ఖరారవుతుందని ఆయన సన్నిహితులతో చెబుతున్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ బహిష్కరించిన తర్వాత ఆయన దాదాపుగా సైలెంట్ గా ఉంటున్నారు. అయితే హడావిడి లేకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. శుభకార్యాలకు వెళ్లడం, పరామర్శలకు వెళ్తూ నాయకులందర్నీ కలసి మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకూ తాను టీడీపీ తరపున పోటీ చేసే విషయాన్ని ఎక్కడా బహిరంగ పరచలేదు ఎమ్మెల్యే ఆనం. కానీ తొలిసారి ఆయన టీడీపీ తరపున పోటీ చేస్తానని ప్రకటించేశారు. అయితే ఆత్మీయుల వద్దే ఆయన ఆ మాట చెప్పారు కానీ బహిరంగ ప్రకటన చేయలేదు. టీడీపీ తరపునే పోటీ చేస్తానన్నారు, ఎంపీగా కాదు, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. అయితే నియోజకవర్గం మాత్రం ఫైనల్ చేయలేదు ఆనం. 

ఆత్మకూరుపైనే గురి..
గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచి వైఎస్సార్ హయాంలో మంత్రిగా పనిచేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి అదే నియోజకవర్గం తరపున బరిలో దిగి మేకపాటి గౌతమ్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో వెంకటగిరికి వెళ్లారు. అక్కడ వైసీపీ అభ్యర్థిగా గెలిచారు. కానీ పార్టీలో ఇమడలేకపోయారు. అభివృద్ధికి నిధులు లేకుండా కట్టడి చేయడం, నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో పెత్తనం లేకపోవడం, ఉన్నా పనులు చేయించుకోలేని పరిస్థితి రావడంతో ఆయన పార్టీపై ఘాటు వ్యాఖ్యలు చేసి బయటకొచ్చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే నెపంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ. అప్పటినుంచి ఆయన మళ్లీ వెంకటగిరికి వెళ్లలేదు. నెల్లూరులోని తన ఇంట్లోనే ఉంటున్నారు. అడపా దడపా ఆత్మకూరుపై ఫోకస్ చేస్తున్నారు. అక్కడ జరిగే శుభకార్యాలకు వెళ్తున్నారు. పరామర్శలకు ముందుంటున్నారు. 

జిల్లాలో టీడీపీదే విజయం..
తాజాగా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని  వరికుంటపాడుకి వచ్చిన ఆనం.. మాజీ ఏఎంసీ ఛైర్మన్‌ అండ్రా నాగిరెడ్డి ఇంటిలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో అన్ని స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆఖరులో ముందస్తు ఎన్నికలు ఉండొచ్చని చెప్పారు ఆనం. సరిగ్గా ఎన్నికల ముందు 60 శాతం మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారని చెప్పారు. ఇంకా ఏడాది అధికారం ఉంది కాబట్టి, కొంతమంది వారి పనుల దృష్ట్యా తాత్కాలికంగా వైసీపీలో ఉంటున్నారని వివరించారు. ఈసారి నెల్లూరు జిల్లాలో టీడీపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుందన్నారు. చంద్రబాబు ఆదేశాలతో ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తానన్నారు. అంటే టీడీపీలో చేరేందుకు తాను సుముఖంగా ఉన్నాననే సంకేతాలు పంపించారు ఆనం. దాదాపుగా ఆయనకు టీడీపీలో టికెట్ ఖరారైందని, అది కూడా ఆత్మకూరునుంచే అనే ఊహాగానాలు వినపడుతున్నాయి. 

వైసీపీ బహిష్కృత నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు దాదాపుగా టీడీపీ గూటికి చేరుకున్నట్టే కనపడుతోంది. నెల్లూరులోని ముగ్గురు ఎమ్మెల్యేలలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ముందుగా తన తమ్ముడిని టీడీపీలోకి పంపించి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా స్థానిక టీడీపీ నాయకులతో సఖ్యత పెంచుకుంటున్నారు. ఏ క్షణంలో అయినా ఆయన టీడీపీవైపు వచ్చేస్తారని టాక్. ఇక ఆనం రామనారాయణ రెడ్డి కూడా దాదాపుగా టీడీపీ తరపున పోటీ చేయడానికే ఇష్టం చూపిస్తున్నారు. ఆమధ్య జనసేన, బీజేపీ అంటూ ఊహాగానాలు వినిపించినా.. తాజాగా ఆయన టీడీపీకే మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు ఆదేశించిన తర్వాత నియోజకవర్గం ఖరారవుతుందని ఆయన సన్నిహితులతో చెబుతున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో బహిష్కృత ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీ గూటికి చేరుకుంటున్నారని స్పష్టమైపోయింది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
YSRCP Assembly March: అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?
అసెంబ్లీ ముట్టడికి వైసీపీ ప్లాన్? డీఎస్సీలో అక్రమాలు జరిగాయనే చర్చ జనాల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహం?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget