అన్వేషించండి

Top Headlines Today: సీఐడీ విచారణపై సుప్రీంకోర్టుకు చంద్రబాబు! ఢిల్లీకి షర్మిల - విలీనంపై తేల్చేసుకుంటారా ?

Top 5 Telugu Headlines Today 23 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

సుప్రీంకోర్టుకు చంద్రబాబు- సీఐడీ విచారణపై క్వాష్ పిటిషన్ దాఖలు
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సీఐడీ విచారణపై సుప్రీంకోర్టుకు వెళ్లారు. సీఐడీ విచారణ కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది. క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరపున లాయర్లు సుప్రీకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో ఉన్న కేసు ఇప్పుడు ఢిల్లీకి చేరింది. పూర్తి వివరాలు

Nara Lokesh : జగన్‌కు బెయిల్ వచ్చి పదేళ్లు - నారా లోకేష్ సెటైర్ !
అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీఎం జగన్ పదహారు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత బెయిల్ పొందారు. పదేళ్లల కిందట సెప్టెంబర్ 23నే బెయిల్ లభించింది. దీనిపై టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. నారా లోకేష్ సోషల్ మీడియాలో జగన్ పై విమర్శలు గుప్పించారు. బెయిల్ డే ప‌దో వార్షికోత్స‌వ‌ శుభాకాంక్ష‌లు జైలు మోహ‌న్. 42 వేల కోట్లు ప్ర‌జాధ‌నం దోచేసి, సీబీఐ-ఈడీ పెట్టిన 38 కేసుల్లో ఏ1 అయినా ప‌దేళ్లుగా బెయిలుపై ఉన్న ఆర్థిక ఉగ్ర‌వాది జైలు మోహ‌న్‌ ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల్ని ధ్వంసం చేస్తూ, రాజ్యాంగాన్ని కాల‌రాస్తూ, నీతిమంతుల్ని జైలుకు పంపుతున్నాడు . జైలులో ఉండాల్సిన జ‌గ‌న్ ప‌దేళ్లుగా బెయిలుపై ఉంటే,  జ‌నంలో ఉండాల్సిన నిజాయితీప‌రుడు సీబీఎన్  జైలులో ఉన్నారని అన్నారు. పూర్తి వివరాలు
https://telugu.abplive.com/andhra-pradesh/on-the-occasion-of-10-years-since-jagan-got-bail-tdp-leaders-made-satires-118283

మల్కాజ్ గిరి టికెట్ రేసులో మర్రి రాజశేఖర్ రెడ్డి, శంభీపూర్ రాజు!
మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కుమారుడితో పాటు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మల్కాజ్ గిరి అసెంబ్లీ సీటుతో పాటు మెదక్ అసెంబ్లీ సీటును ఆశించారు. బీఆర్ఎస్ రెండు సీట్లు ఇవ్వకుండా, మైనంపల్లికి మల్కాజ్ గిరి సీటును మాత్రమే కేటాయించడంతో  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాలు

గాంధీ జయంతి రోజున రాష్ట్రానికి రానున్న ప్రధాని మోదీ - బహుముఖ వ్యూహంతో బీజేపీ సన్నద్ధం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కార్యాచరణ కసరత్తును బీజేపీ రాష్ట్ర నాయకత్వం కొలిక్కి తెచ్చింది. ఈ ఎన్నికల్లోనూ జాతీయ నాయకత్వాన్ని వీలైనంత మేరకు భాగం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది. బహుముఖ వ్యూహంతో ఎన్నికల కార్యాచరణను ముందుకు తీసుకెళ్లాలని కిషన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. సభలు, సమావేశాలు, ఇతర ఎన్నికల కార్యక్రమాలు ఎలా చేపట్టాలి, ఎప్పుడు చేపట్టాలని అనే కార్యాచరణపై ఈ నెల ఆఖరు లోపు తుది నిర్ణయానికి వచ్చి.. వచ్చే నెల నుంచి దానిని అమలు చేయడానికి సిద్ధమైంది. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. అదే రోజు నిజామాబాద్, మహబూబ్‌నగర్ లలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారని రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది. పూర్తి వివరాలు

ఢిల్లీకి షర్మిల - విలీనంపై తేల్చేసుకుంటారా ?
కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై షర్మిల ఏదో ఒకటి తేల్చుకోవాలనుకుంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్ టిక్కెట్ల కసరత్తు పూర్తవుతోంది. కమ్యూనిస్టులతో పొత్తులపైనా చర్చిస్తున్నారు. కానీ షర్మిల పార్టీ గురించి మత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. దీంతో షర్మిల ఏదో ఓ విషయం తేల్చుకోవాలని ఢిల్లీ వెళ్తున్నట్లుాగ తెలుస్తోంది.  ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ అయ్యారు. వైఎస్సార్‌టీపీ విలీనంకు సంబంధించి ఆయన మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. పూర్తి వివరాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!

వీడియోలు

Telangana Aviation Academy CEO Interview | ఇండిగో దెబ్బతో భారీ డిమాండ్.. 30వేల మంది పైలట్ లు కావాలి
నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Panchayat Election Results: తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
తొలి గోల్ కొట్టిన రేవంత్ రెడ్డి.. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా, గట్టిపోటీ ఇచ్చిన బీఆర్ఎస్
Farmhouse Liquor Party: ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
ఫాంహౌస్‌లో మందు పార్టీ.. పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. లిక్కర్ బాటిల్స్, హుక్కా స్వాధీనం
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
Telugu TV Movies Today: డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
డిసెంబర్ 12, శుక్రవారం.. థియేటర్లలోనే కాదు, తెలుగు టీవీ ఛానళ్లలో కూడా అదిరిపోయే సినిమాలున్నాయ్... ఆ లిస్ట్ ఇదే!
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
Tata Sierra SUV కి పోటీగా వచ్చిన Kia Seltos - ఫీచర్లు, ఇంజన్లలో ఏది బెస్ట్ తెలుసా..
IndiGo: సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
సాధారణంగా ఇండిగో సర్వీసులు - టైమ్ ప్రకారమే ఫ్లైట్లు - సంక్షోభం ముగిసినట్లేనా?
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Embed widget