అన్వేషించండి

Delhi Sharmila : ఢిల్లీకి షర్మిల - విలీనంపై తేల్చేసుకుంటారా ?

పార్టీ విలీనంపై ఏదో ఒకటి తేల్చుకోవాలని షర్మిల భావిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది.


Delhi Sharmila :  కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై షర్మిల ఏదో ఒకటి తేల్చుకోవాలనుకుంటున్నారు. ఓ వైపు కాంగ్రెస్ టిక్కెట్ల కసరత్తు పూర్తవుతోంది. కమ్యూనిస్టులతో పొత్తులపైనా చర్చిస్తున్నారు. కానీ షర్మిల పార్టీ గురించి మత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. దీంతో షర్మిల ఏదో ఓ విషయం తేల్చుకోవాలని ఢిల్లీ వెళ్తున్నట్లుాగ తెలుస్తోంది.  ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా హైదరాబాద్‌లో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో షర్మిల భేటీ అయ్యారు. వైఎస్సార్‌టీపీ విలీనంకు సంబంధించి ఆయన మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఆయన  కూడా ఏమీ చెప్పకపోతూండటంతో షర్మిలకు ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. 

ఏపీలో అయితే ఓకే అంటున్న హైకమాండ్   

తెలంగాణ కాంగ్రెస్ నేతలు షర్మిలను చేర్చుకోవద్దన్న గట్టి పట్టుదలతో ఉన్నారు. కోమటిరెడ్డి వంటి ఒకరిద్దరు ఓకే చేసినా..ఇతరులు మాత్రం వద్దంటున్నారు. షర్మిల ను పార్టీలో చేర్చుకోవడం వల్ల కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం ఉంటందని భావిస్తున్నారు. అందుకే..షర్మిల ఏపీలో పని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచిస్తున్నట్లుగా చెబుతున్నారు.   ఇప్పటికే పార్టీ విలీనంపై షర్మిల నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రకటన చేస్తానంటూ ఇటీవల వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో తెలిపారు. కానీ తెలంగాణలో రాజకీయాలు చేయాలా? లేదా ఏపీలో షర్మిల సేవలను ఉపయోగించుకోవాలా? అనే దానిపై తర్జనభర్జన జరుగుతోంది. ఏపీకి వెళ్లాలని షర్మిలను కాంగ్రెస్ కోరుతుండగా.. ఆమె అక్కడికి వెళ్లేందుకు తిరస్కరిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లోనే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం తెలంగాణకు భారం అని భావిస్తోంది.    

పార్టీ మారిపోతున్న నేతలు

షర్మల పార్టీ కాంగ్రెస్ లో విలీనం కారణంగా ఆ పార్టీలో ఉన్న ఒకరిద్దరు నేతలు కూడా వెళ్లిపోతున్నారు.  షర్మిల పాదయాత్రలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి తన పార్టీ తరపున ప్రజాగాయకుడు ఏపూరి సోమన్న పోటీ చేస్తారని ప్రకటించారు. ఆయనను తన సోదరుడిగా చెప్పారు.కానీ ఇప్పుడు ఆ ఏపూరి సోమన్న షర్మిల పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.   బీఆర్ఎస్‌లో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఇక  ఆ పార్టీలో ముఖ్య నేతలంటూ ఎవరూ లేకుండా పోయారు. షర్మిల ఒంటరిగా నిలిచారు. పార్టీ కార్యక్రమాలను కూడా ఆమెపెద్దగా చేపట్టడం లేదు. 

షర్మిల పోటీ ఉంటుందా ? ఉండదా ? 

షర్మిల వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా.. ఆయన అక్కడ నుంచి టికెట్ ఖరారు చేశారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నయి.  దీంతో షర్మిల పోటీ చేసే విషయంపై క్లారిటీ రాకపోవడంతో కాంగ్రెస్‌లో వైఎస్సార్‌టీపీ విలీనానికి బ్రేక్‌లు పడ్డాయి. ఢిల్లీ పర్యటనలో పార్టీ విలీనంపై తుది చర్చలు జరుగుతాయని, అనంతరం షర్మిల క్లారిటీ ఇచ్చే అవకాశముందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ కాంగ్రెస్ హ్యాండిస్తే షర్మిల ఏం చేస్తారన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.                                   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Walk in Davos | ట్రాఫిక్ లో చిక్కుకోవటంతో కాలినడకన లోకేశ్ ప్రయాణం | ABP DesamJawan Karthik Final Journey | దేశం కోసం ప్రాణాలర్పించిన కార్తీక్ కు కన్నీటి వీడ్కోలు | ABP DesamCM Chandrababu Met Bill gates | దావోస్  ప్రపంచ ఆర్థిక సదస్సులో బిల్ గేట్స్ తో సీఎం చంద్రబాబు | ABP DesamBazball In T20 | ఇంగ్లండ్ పరిమిత ఓవర్లకూ కోచ్ గా మెక్ కల్లమ్ | Ind vs Eng | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
తెలంగాణలో భారీ పెట్టుబడులు - ఒకే రోజు రూ.56,300 కోట్లు, భారీగా ఉద్యోగాలు, దావోస్ వేదికపై సరికొత్త రికార్డు
CM Chandrababu: 'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
'ఇండియా ఫస్ట్.. అవర్ పీపుల్ ఫస్ట్' అనేదే నినాదం - ప్రపంచానికి టెక్నాలజీ అందిస్తున్నామన్న సీఎం చంద్రబాబు
CM Revanth Reddy: 'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది' - అల్లు అర్జున్ అరెస్టుపై మరోసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన
Karnataka Express: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం - పట్టాలు దాటుతుండగా ప్రయాణికులను ఢీకొన్న ఎక్స్‌ప్రెస్ రైలు, 12 మంది మృతి
CM Chandrababu: 'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
'గేట్స్ ఫౌండేషన్ కార్యక్రమాలకు ఏపీని గేట్ వే చేయండి' - అప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
CM Revanth Reddy : రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
రవాణా రంగంలో అగ్రగామిగా తెలంగాణ - డ్రైపోర్టు ఏపీలో మచిలీపట్నం పోర్టుతో అనుసంధానం, సీఎం రేవంత్ ప్రణాళికలు
Vizag News: విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
విశాఖలో జువనైల్ హోమ్ నుంచి రోడ్లపైకి వచ్చిన బాలికలు - మానసిక రోగులుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపణలు
Embed widget