News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

మల్కాజ్ గిరి టికెట్ రేసులో మర్రి రాజశేఖర్ రెడ్డి, శంభీపూర్ రాజు!

మైనంపల్లి రాజీనామా ప్రకటనతో మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్ గిరి సీటు లైన్ క్లియర్ అయినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కుమారుడితో పాటు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మల్కాజ్ గిరి అసెంబ్లీ సీటుతో పాటు మెదక్ అసెంబ్లీ సీటును ఆశించారు. బీఆర్ఎస్ రెండు సీట్లు ఇవ్వకుండా, మైనంపల్లికి మల్కాజ్ గిరి సీటును మాత్రమే కేటాయించడంతో  బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది. 

మైనంపల్లి రాజీనామా ప్రకటనతో మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్ గిరి సీటు లైన్ క్లియర్ అయినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైనంపల్లి వంటి శక్తివంతమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే అదే స్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నాయకుడు అవసరం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. మర్రి రాజశేఖర్ రెడ్డి గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి మల్లారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో మైనంపల్లికి మర్రి రాజశేఖర్ రెడ్డి సరైన అభ్యర్థి అని డిసైడ్ అయినట్లు సమాచారం. 

మల్కాజ్ గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీలో నిలిస్తే అనేక అంశాలు కలిసి వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలలో మల్కాజిగిరి నియోజకవర్గం కూడా ఒకటి. రాజశేఖర్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పేరుపొందిన కళాశాలలు నడిపిస్తున్నారు. తల్లి పేరిట "అరుంధతి" హాస్పిటల్ పేరిట ఉచితంగా పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అన్ని కోణాల్లో సరైన వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డేనని నేతలు అభిప్రాయపడుతున్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా అల్లుడికి సీటు ఇప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా అల్లుడ్ని గెలిపించుకోవాలని మల్లారెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు. 

బీఆర్ఎస్ లో మరో సీనియర్ నేత శంభీపూర్ రాజు సైతం మల్కాజ్ గిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉండటం, ఆర్థికంగా బలవంతుడు కావడంతో ఆయన పేరును బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శంభీపూర్ రాజుకు...ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ వద్ద మంచి పేరు వస్తుంది. ఇదే తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అసెంబ్లీ సీట కేటాయిస్తే గెలుస్తానని పార్టీ నేతలకు చెబుతున్నట్లు సమాచారం.  

మరోవైపు ఇదే అసెంబ్లీ సీటును కుమారుడు సాయికిరణ్ కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసి...మల్కాజ్ గిరి సీటు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఎంపీ సీటు కాకుండా అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పదే పదే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది.  మైనంపల్లి హనుమంతరావు రెండు సీట్లు డిమాండ్ చేసినా, కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో ఆయన పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో తలసాని కుమారుడికి టికెట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. 

Published at : 23 Sep 2023 10:58 AM (IST) Tags: Assembly Malkajgiri BRS Telangana Assembly Elections 2023 marri rajasekhar reddy samhipur raju

ఇవి కూడా చూడండి

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి  బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !

Telangana BJP : ఎమ్మెల్యేలుగా ప్రమాణానికి బీజేపీ దూరం - అక్బరుద్దీనే కారణమన్న రాజాసింగ్ !

BRSLP Meeting : బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే - కాంగ్రెస్ సర్కార్ పై పోరాటానికి రెడీ !

BRSLP Meeting :  బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆరే -  కాంగ్రెస్ సర్కార్ పై పోరాటానికి రెడీ !

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్‌ రెడ్డి- మంత్రివర్గ విస్తరణ శాఖ కేటాయింపుపై చర్చలు

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్‌ రెడ్డి- మంత్రివర్గ విస్తరణ శాఖ కేటాయింపుపై చర్చలు

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

MIM What Next : పాతబస్తీలో మజ్లిస్‌కు గడ్డు పరిస్థితే - కాంగ్రెస్ ఎంబీటీని ప్రోత్సహిస్తే ఏం జరుగుతుంది ?

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

తెలంగాణ కేబినెట్ లో ఏ కులానికి ఎన్ని మంత్రి పదవులు దక్కాయంటే ?

టాప్ స్టోరీస్

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

Revanth Reddy Resigns: రేవంత్‌ రెడ్డి రాజీనామా- ఢిల్లీకి వెళ్లి రిజైన్‌ లెటర్ అందజేత

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

KCR Surgery Success: మాజీ సీఎం కేసీఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్, బీఆర్ఎస్ శ్రేణులు హర్షం

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Jr NTR: నెట్‌ఫ్లిక్స్ సీఈవోకు జూనియర్ ఎన్టీఆర్ ఆతిథ్యం - మధ్యాహ్నం బాగా గడిచిందంటూ ట్వీట్!

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే

Free Bus Journey to Women: మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం - మార్గదర్శకాలివే