Top Headlines Today: బెయిల్ వచ్చినా చంద్రబాబు బయటకు రాకుండా సీఐడీ బిగ్ ప్లాన్- గద్వాల ఎమ్మెల్యేకు సుప్రీంలో ఊరట
Top 5 Telugu Headlines Today 11 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Top 5 Telugu Headlines Today 11 September 2023:
చంద్రబాబు అరెస్టుపై పీవీ రమేశ్ కీలక వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పాత్రధారి అని భావిస్తున్న మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారిగా పనిచేసిన పీవీ రమేశ్ ఈ కేసులో సీఐడీకి లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ఆస్టేట్‌మెంట్ ఆధారంగానే కేసు పెట్టారని ప్రచారం జరిగింది. దీనిపై రమేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన వాంగ్మూలంతో చంద్రబాబును అరెస్ట్ చేశారనటం హాస్యాస్పదంగా ఉదన్నారు రమేశ్. తాను అప్రూవర్‌గా మారాననే ప్రచారం అవాస్తవమన్నారు. అసలు ఫైలే లేకుండా కేసులు ఎలా పెడతారని సీఐడీని ప్రశ్నించారు. పూర్తి వివరాలు
గద్వాల ఎమ్మెల్యేకు సుప్రీంలో భారీ ఊరట - హైకోర్టు తీర్పుపై స్టే
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎన్నికల వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నికల చెల్లదంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కృష్ణ మోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు ఇచ్చింది. పూర్తి వివరాలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ వచ్చినా చంద్రబాబు బయటకు రాకుండా సీఐడీ బిగ్ ప్లాన్
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ మరో షాక్ ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో విచారణకు కోర్టులో పిటిషన్ వేసింది. 2022లో నమోదైన ఈ కేసులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఒకవేళ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ వచ్చిన వెంటనే ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో అరెస్టు చేసేందుకు సిఐడీ సిద్ధమవుతోంది. అందుకే కోర్టులో పిటిషన్ మూవ్ చేసింది. పూర్తి వివరాలు
13,14 తేదీల్లో ఢిల్లీకి సీఎం జగన్-మోడీ, అమిత్‌షాతో భేటీ
ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో ఢిల్లీ వెళ్లనున్న జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశం అవుతారని సమాచారం. చంద్రబాబు అరెస్ట్, జమిలీ ఎన్నికల కసరత్తు వేళ... సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఏపీలో ఇప్పటికే రాజకీయం వేడెక్కింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్టు చేసి... రిమాండ్‌కు కూడా పంపారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమమని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాలు
తెలంగాణలో సెప్టెంబర్ 17 హీట్- మూడు పార్టీల పోటాపోటీ సభలు
తెలంగాణ రాజకీయాల్లో సెప్టెంబర్ 17 సెగ రాజుకుంది. అధికార, ప్రతిపక్షాలన్నీ.. బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించాయి. బీజేపీ హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో సభ నిర్వహిస్తోంది. ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాని ముఖ్య అతిథిగా తీసుకురావాలని యోచిస్తోంది. ఇక, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం పేరుతో వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్న ఆ పార్టీ.. సోనియాగాంధీ నేతృత్వంలో తుక్కుగూడలో ఈ నెల 17న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఇప్పుడు బీఆర్‌ఎస్ కూడా.. జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. మూడు పార్టీల పోటాపోటీ సభలతో... సెప్టెంబర్ 17న.. ఏం జరగబోతోందన్న టెన్షన్ రాజకీయ వర్గాల్లో నెలకొంది. పూర్తి వివరాలు





















