News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యేకు సుప్రీంలో భారీ ఊరట - హైకోర్టు తీర్పుపై స్టే 

Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది.  

FOLLOW US: 
Share:

Gadwal MLA: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎన్నికల వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ధర్మాసనం స్టే విధించింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నికల చెల్లదంటూ బీజేపీ నాయకురాలు డీకే అరుణ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. కృష్ణ మోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని.. ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన డీకే అరుణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు... తీర్పు ఇచ్చింది. కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని నిర్ధారణ కావడంతో కృష్ణమోహన్ రెడ్డిపై అనర్హతా వేటు వేసి.. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తీర్పు చెప్పారు. కృష్ణమోహన్ రెడ్డికి మూడు లక్షల జరిమానాను కూడా కోర్టు విధించింది. ఇందులో యాభై వేల రూపాయలు డీకే అరుణకు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.                                

దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పుపై కృష్ణ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈక్రమంలోనే తెలంగాణ హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కృష మోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించారు. 

Read Also: KTR: దేశానికే ఆదర్శంగా నిలిచేలా సెప్టెంబర్ 17 న జాతీయ సమైక్య దినోత్సవం: మంత్రి కేటీఆర్

ఇటీవలే కొత్తగూడెం ఎమ్మెల్యేపై కూడా అనర్హత వేటు

కొద్ది రోజుల క్రితం కొత్తగూడెం ఎమ్మెల్యేలపైనా ఇలాగే అనర్హతా వేటు వేశారు. దీంతో ఆయన సుప్రీంకర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా తో పోటీలో ఓడిపోయిన జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రకటించారు. కానీ సుప్రీంకోర్టు స్టే వల్ల ప్రమాణస్నీకారం చేయలేకపోయారు. 2018 ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా  28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి  బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.                         

హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. అయితే ఎమ్మెల్యే పదవి కాలం దాదాపుగా ముగిసిపోయే దశకు వచ్చింది.  మళ్లీ ఎన్నికల కోసం  కేసీఆర్ ..  బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులోనూ.. కృష్ణమోహన్ రెడ్డి అభ్యర్థిగా చోటు దక్కించుకున్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చారు. 

Published at : 11 Sep 2023 01:07 PM (IST) Tags: Telangana News Telangana Politics Bandla Krishna Mohan Reddy Gadwal MLA Huge Relief to Gadwal MLA

ఇవి కూడా చూడండి

Chittaranjan Dass: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో షాక్, ఎన్టీఆర్‌ను ఓడించిన నేత రాజీనామా

Chittaranjan Dass: ఎన్నికల వేళ బీఆర్ఎస్‌కు మరో షాక్, ఎన్టీఆర్‌ను ఓడించిన నేత రాజీనామా

Mother Dairy Issue : మదర్ డెయిరీపై ఆధిపత్యం కోసం ఎత్తులు - నల్లగొండ రాజకీయాల్లో హై టెన్షన్ !

Mother Dairy Issue  : మదర్ డెయిరీపై ఆధిపత్యం కోసం ఎత్తులు  - నల్లగొండ రాజకీయాల్లో హై టెన్షన్ !

Minister KTR: 75 ఏళ్లలో సాధ్యం కానిది కేవలం ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ సుసాధ్యం చేశాడు : మంత్రి కేటీఆర్

Minister KTR: 75 ఏళ్లలో సాధ్యం కానిది కేవలం ఐదేళ్లలోనే సీఎం కేసీఆర్ సుసాధ్యం చేశాడు : మంత్రి కేటీఆర్

Telangana Elections: కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు, కాంగ్రెస్ కు 75కు పైగా సీట్లు: ప్రేమ్ సాగర్ రావు

Telangana Elections: కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు, కాంగ్రెస్ కు 75కు పైగా సీట్లు: ప్రేమ్ సాగర్ రావు

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

టాప్ స్టోరీస్

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్ మీటింగ్ వచ్చే వారం !

KCR Fever : కేసీఆర్‌కు తగ్గని జ్వరం - కేబినెట్  మీటింగ్ వచ్చే వారం   !

TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

TDP News  :  అధికార మత్తు  వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?