అన్వేషించండి

Top 5 Headlines Today: ఏపీ మంత్రి ఆర్కే రోజాకు అస్వస్థత! కేసీఆర్‌ అంటే హరీశ్‌ రావుకి ఈర్ష్యనా! నేటి టాప్ 5 హెడ్ లైన్స్

Top 5 Telugu Headlines Today 11 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్! ఇరకాటంలో లీడర్లు
సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతున్న ట్రోల్స్ తో బెజవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇరకాటంలోకి వెళుతున్నారు.అసంతృప్తి గా ఉన్న నేతలను టార్గెట్ గా చేసుకొని ట్రోల్స్ మొదలవటంతో వ్యవహరం ఆసక్తిగా మారింది. అసంతృప్తి ఉన్న నేతలను టార్గెట్ చేసుకొని వాట్సాప్ గ్రూపుల్లో ట్రోల్స్ మొదలవటంతో సదరు నేతలు లబోదిబోమంటున్నారు. కొందరు ఈ వ్యవహారాన్ని ఖండిస్తుంటే, మరి కొందరు సైలెంట్ గా ఉండిపోతున్నారు. బెజవాడ కేంద్రంగా మెదలయిన సోషల్ మీడియా ట్రోల్స్ ఇప్పుడు ఆసక్తి కరంగా మారాయి. పూర్తి వివరాలు

కేసీఆర్‌ అంటే హరీశ్‌ రావుకి ఈర్ష్య! ఆయన చంద్రబాబును ఫాలో అవుతున్నారు - పేర్ని నాని కౌంటర్
మేనమామ, ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ అంటే తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు కోపం అని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. మేనమామ కేసీఆర్, బావమరిది కేటీఆర్ పై ఈర్ష్యతోనే ఏపీపై హరీష్ రావు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. గతంలో హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. ‘‘హరీష్ రావుకు మేనమామ మీద, బావ మీద కోపం, ఈర్ష్య ఉంది. హరీష్ రావు బాధపడలేకే కేసీఆర్ హరీష్ రావును పక్కన పెట్టి పనిష్మెంట్ వేశారు. 2018లో హరీష్ రావు కేసీఆర్ కెబినెట్లో ఎందుకు లేరు? హరీష్ రావు చంద్రబాబును ఫాలో అవుతున్నారు. హరీష్ రావు సర్టిఫికెట్లు కాటాకేస్తే.. ఉల్లిపాయలు కూడా రావు. హరీష్ రావు సర్టిఫికెట్లు మాకేం అవసరం లేదు. మమ్మల్ని విమర్శిస్తే మేం తిరిగి కేసీఆరును విమర్శిస్తామని హరీష్ రావు ఆలోచన. మేం కేసీఆర్ ను విమర్శిస్తే హరీష్ రావు సంతోషించాలని అనుకుంటున్నారు. మళ్లీ హరీష్ రావు మమ్మల్ని విమర్శిస్తే ఆ ఉబలాటం తీర్చేస్తాం. కేసీఆర్ అల్లుడు గిల్లుడు చూస్తూ ఊరుకుంటే.. మేం కేసీఆర్ ని విమర్శిస్తాం’’ అని పేర్ని నాని అన్నారు.   పూర్తి వివరాలు

తెలంగాణపై మాకు ఎలాంటి వివక్ష లేదు, అప్పుడు కేసీఆరే మమ్మల్ని మెచ్చుకున్నారు
దేశంలో మరోసారి బీజేపీ సర్కారే వస్తుందని కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్ అన్నారు. దేశమే ప్రథమ ప్రాధాన్యంగా మోదీ పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. తొమ్మిదేళ్ల మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని చెప్పారు. ఈ విషయంలో ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలు కూడా లేవని అన్నారు. బీజేపీ సర్కారు హయాంలో దేశం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. తమది 24 గంటలు పని చేసే ప్రభుత్వమని తెలిపారు. దేశంలో అవినీతి రహిత సర్కార్ ను మొదటి సారి చూస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ సర్కారు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడానికి బీజేపీ దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్ సభలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు

దేవుడికైనా వెన్నుపోటు పొడుస్తారు - తిరుమలలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు
చంద్రబాబు మ్యానిఫెస్టోను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. ఆదివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. దేశ చరిత్రలోనే అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా పేద ప్రజలకు సంక్షేమ పధకాలు అందజేసే‌ నాయకుడు సీఎం జగన్ ఒక్కరేన్నారు. పూర్తి వివరాలు

మంత్రి ఆర్కే రోజాకు అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం రాత్రి చెన్నైలోని క్రిమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు కాలు బెణకడంతో వారం రోజుల పాటు ఫిజియోథెరఫీ చేయించారు. అయినా నొప్పి ఎక్కువ కావడంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేర్చిన్టలు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కారణంగానే పది రోజుల పాటు నియోజక వర్గ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలోని నగరి నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP DesamRishiteswari Case: Guntur Court Final Verdict | 9 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు ఏంటి? | ABP DesamPawan Kalyan Seize the Ship | డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ నౌకను సీజ్ చేయగలరా? | ABPPushpa 2 Ticket Booking Rates | అల్లు అర్జున్ సినిమా చూడాలంటే ఆ మాత్రం ఉండాలి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
సమగ్ర సర్వేలో ఆ కుల వృత్తుల వారిని విశ్వబ్రాహ్మణులుగా పరిగణించాలి: హైకోర్టు
Fengal Cyclone: తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
తీరాన్ని తాకిన 'ఫెంగల్' తుపాను - ఏపీ, తమిళనాడు తీర ప్రాంతాలకు రెడ్ అలర్ట్
Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Hydra News: హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
హైడ్రా కూల్చివేతలతో బ్యాంకులపై ఎన్ని వేల కోట్ల రుణభారం పడింది, పరిష్కారం ఏంటి? ABP Desam Exclusive
Pushpa 2 Ticket Rates: 'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
'పుష్ప 2' బెనిఫిట్ షో టికెట్ @ 1000 ప్లస్ - తెలంగాణ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది
Upcoming Smartphones in December: డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
డిసెంబర్‌లో లాంచ్ కానున్న స్మార్ట్ ఫోన్లు - కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి పండగే!
Chandrababu Comments: వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
వైసీపీ 11 సీట్లపై చంద్రబాబు సెటైర్లు, బెల్ట్ షాపులు పెడితే నేను బెల్ట్ తీస్తానంటూ మాస్ వార్నింగ్
Telangana News: కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటాలను దక్కించుకోవాలి: అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు
Embed widget